ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్@5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @5pm
టాప్​టెన్​ న్యూస్@5PM
author img

By

Published : Jul 6, 2020, 4:58 PM IST

1. 'మోదీ లద్దాఖ్ పర్యటన చైనాకు గట్టి హెచ్చరిక!'

దేశ ఉత్తర సరిహద్దులో ప్రతిష్టంభన ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న తరుణంలో ప్రధాని మోదీ చేపట్టిన లద్దాఖ్ పర్యటన చాలా ముఖ్యమైనదని నిపుణులు చెబుతున్నారు. చైనా దూకుడుకు దీటుగా భారత్​ తన వైఖరిని స్పష్టం చేసిందని అంటున్నారు. చర్చల్లో పురోగతి లభించకపోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని మోదీ పర్యటన ద్వారా విస్పష్ట సందేశాన్ని చైనాకు ఇచ్చినట్లు విశ్లేషిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. టిమ్స్​ సిద్ధం.. ట్విట్టర్​లో వీడియో పోస్ట్​ చేసిన మంత్రులు

హైదరాబాద్​లో అధునాతన సౌకర్యాలతో కొవిడ్‌-19 రోగుల కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్(టిమ్స్‌) ప్రారంభానికి సిద్ధమైంది. మంత్రి ఈటల రాజేందర్​ ఓ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేయగా.. దానిని మంత్రి కేటీఆర్​ రీట్వీట్​ చేశారు. మొత్తం 1,224 పడకలు ఉండగా.. 1000 పడకలకు ఆక్సిజన్‌, 100కి వెంటిలేటర్‌ సౌకర్యం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. ఆన్‌లైన్‌ క్లాస్‌ల నిర్వహణపై కసరత్తు

రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ బోధన అయోమయంగా మారింది. కార్పొరేట్ పాఠశాలలు ఆన్ లైన్ పాఠాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. మరోవైపు నేటి నుంచి టీవీ ద్వారా డిగ్రీ పాఠాల బోధన ప్రారంభించిన ఎస్సీ గురుకుల సొసైటీ.. ఆగస్టు 3 నుంచి పాఠశాల విద్యార్థులకూ ప్రసారం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ బడుల విద్యార్థులకు టీశాట్, దూరదర్శన్ ద్వారా బోధన ఎప్పటి నుంచో కొనసాగుతున్నప్పటికీ... ఆశించిన ప్రయోజనాలు అందడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. రాచకొండ పరిధి‌లో 53 మంది పోలీసులకు కరోనా

రాచకొండ కమిషనరేట్ పరిధిలో 53 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. వైరస్‌ బారి నుంచి 7మంది కోలుకున్నారని పేర్కొన్నారు. మిగిలిన సిబ్బంది త్వరలో కోలుకుంటారని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. రానున్న మూడు రోజులు మెరుపులతో కూడిన వర్షం

రాగల మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. 'పనులు లేక ఇబ్బంది పడుతున్న వేళ... అదనపు భారాలా?'

పనులు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలను ఆదుకోవాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేసారు. లాక్​డౌన్​ కాలంలో ఇచ్చిన విధంగా బియ్యం, నగదు అందించాలన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.7500 ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. పాన్- ఆధార్ అనుసంధానానికి మార్చి వరకు గడువు

పన్ను చెల్లింపుదారులు పాన్​తో ఆధార్ అనుసంధానించుకునేందుకు ఆదాయపు పన్ను విభాగం మరోసారి గడువు పెంచింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అవకాశమిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. మాస్కు లేకపోతే వలంటీర్లుగా మారాల్సిందే!

బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోయినా.. కరోనా నిబంధనలను పాటించకపోయినా మూడురోజుల పాటు ఆసుపత్రులు, పోలీస్​ చెక్​పోస్టుల్లో వలంటీర్లుగా పనిచేయాలని మధ్యప్రదేశ్​ గ్వాలియర్​ జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. "కిల్​ కరోనా" కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. 'గంగూలీ సమయానికి వచ్చేవాడు కాదు'

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ ప్రతి మ్యాచ్​లోనూ టాస్​ వేసే సమయంలో ఆలస్యంగా వచ్చేవాడని అన్నాడు ఇంగ్లాండ్​ మాజీ సారథి నాసర్​ హుస్సేన్​. దీంతో అతడంటే తనకు నచ్చేది కాదని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. సుశాంత్ 'దిల్ బెచారా' ట్రైలర్ వచ్చేసింది.!

సుశాంత్ సింగ్ ఆఖరి సినిమా 'దిల్​బెచారా' ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. జులై 24 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందీ చిత్రం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.