ETV Bharat / city

టాప్‌టెన్ న్యూస్ @11am

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @11am
టాప్‌టెన్ న్యూస్ @11am
author img

By

Published : Jul 29, 2020, 11:00 AM IST

1. మరో 1,764

రాష్ట్రంలో కొత్తగా 1,764 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58,906కు చేరుకుంది. మరో 12 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 492కు చేరింది. మొత్తం 14,663 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. కొవిడ్ విలయం

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 47,744 వైరస్​ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 768 మంది వైరస్ ధాటికి బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. అంబాలా సిద్ధం

భారత రక్షణ రంగాన్ని శత్రు దుర్భేద్యం చేసే రఫేల్ యుద్ధవిమానాలు ఇవాళ మధ్యాహ్నం అంబాలా వైమానిక స్థావరానికి చేరుకోనున్నాయి. ఫ్రాన్స్​లోని అల్​-దాఫ్రా వైమానిక స్థావరం నుంచి ఇప్పటికే ఈ యుద్ధ విమానాలు భారత్​కు పయనమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. రైల్వే రికార్డు

కరోనా సమయంలోనూ భారతీయ రైల్వే గణనీయమైన మైలురాయిని సాధించింది. గతేడాదికి మించి సరకు రవాణా చేసింది. జులై 27న సరకు రవాణా 3.13 మెట్రిక్‌ టన్నులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. లాక్‌డౌన్‌ కాలంలో రైల్వే దాదాపు 200 మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. భవనం నేలమట్టం

కర్ణాటక రాజధాని బెంగళూరులో నాలుగు అంతస్తుల భవనం మంగళవారం అర్థరాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. మల్టీప్లెక్స్​ నిర్మించడానికి ప్రస్తుతం ఉన్న కపాలి థియేటర్​ను కూల్చివేశారు. ప్రస్తుతం పార్కింగ్​ స్థలం నిర్మించడానికి పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. దీని కోసం 50 అడుగుల లోతులో గొయ్యి తీసి, కొత్త నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలోనే దాని వెనుక ఉన్న నాలుగు అంతస్తుల భవనం బీటలువారి ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరు మరణించలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. అమెరికాలో..

ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ విజృంభిస్తోన్న కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు అన్ని దేశాల్లో కలిపి 1.69 కోట్ల కేసులు నమోదయ్యాయి. 6.63 లక్షల మంది మృత్యువాతపడగా సుమారు కోటి మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. నష్టాల్లో స్టాక్

అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల అంశాలతో స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 130 పాయింట్లు నష్టపోయి 38,362 వద్ద ట్రేడ్​ అవుతోంది. 25 పాయింట్లు పడిపోయిన ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 11,280 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. ధోనీ అలా చేశాడు

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు​ భారత స్టార్​ ఓపెనర్​ శిఖర్​ ధావన్. 2013 ఛాంపియన్స్​ ట్రోఫీ సమయంలో తనకు బాగా మద్దతుగా నిలిచాడని చెప్పుకొచ్చాడు శిఖర్​. ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్​ ఓడిపోకుండా కప్పు కైవసం చేసుకుంది భారత్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. చెట్టు మీద కోహ్లీ

లాక్​డౌన్​ సమయంలో గత స్మృతులను గుర్తు చేసుకున్నాడు టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. ఇందులో భాగంగా తను చెట్టు ఎక్కి విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను ట్విట్టర్​ వేదికగా పంచుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. చిన్నమ్మయిన ప్రియాంక చోప్రా

గ్లోబల్​స్టార్​ ప్రియాంక చోప్రా ఇప్పుడు చిన్నమ్మ అయ్యింది. అదేంటి విడ్డూరంగా అనుకుంటున్నారా.? తన తోడికోడలు సోఫీ సోమవారం బిడ్డకు జన్మనివ్వడం వల్ల సరికొత్త బాధ్యతలు అందుకుంది ప్రియాంక. నటి సోఫీ టర్నర్‌- గాయకుడు జో జోనాస్‌ 2019లో పెళ్లి చేసుకున్నారు. ఇతడు నిక్​ జొనాస్​కు స్వయానా సోదరుడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.