ETV Bharat / city

TOP NEWS: టాప్​న్యూస్​@ 11AM - తెలుగు లేటెస్ట్ అప్డేట్స్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS, telangana news
టాప్​న్యూస్
author img

By

Published : Jan 2, 2022, 11:00 AM IST

నూతన సంవత్సర వేడుకల వేళ.. రాష్ట్రంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. పలుచోట్ల పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. మరికొందరు వాహనాలతో హల్‌చల్‌ చేశారు. పెద్ద సంఖ్యలో మందుబాబులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

  • ప్రియురాలి ఎడబాటు భరించలేక..

బతుకుదెరువు కోసం రాష్ట్రంకాని రాష్ట్రానికి వచ్చాడు. వచ్చిన పని చేసుకుంటూ కాలంగడుపుతుండగా ఓ అమ్మాయి... నచ్చింది. క్రమంగా ప్రేమగా మారింది. ఆమెను పెళ్లి చేసుకొని.. జీవితాంతం కలిసి ఉండాలని కలలు కన్నాడు. బాగా సంపాదించి... ప్రేయసిని వివాహమాడాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. కట్ చేస్తే.. ప్రియురాలి ఎడబాటు తట్టుకోలేక తనువుచాలించాడు.

  • ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ఆంగ్ల నూతన సంవత్సరం వేళ రాష్ట్రవ్యాప్తంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. కొత్త సంవత్సరంలో ఆశయాలు నెరవేరాలనీ వేడుకున్నారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో వేకువజాము నుంచే రద్దీ నెలకొంది.

  • బంగారం, వెండి ధరలు ఇలా..

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

  • వృద్ధికి కరోనా, ద్రవ్యోల్బణాలే సవాళ్లు..

కరోనా వచ్చిన నాటి నుంచి ఇబ్బందులు పడ్డ దేశ ఆర్థిక వ్యవస్థ.. ఈ ఏడాదిలో కూడా అదే బాటలో నడవబోతుందని నిపుణులు చెప్తున్నారు. దేశీయంగా పెరుగుతున్న కరోనా కేసులు, ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈ ఏడాదికి గానూ బడ్జెట్‌ ప్రకటనలు, ఉద్దీపన చర్యల కొనసాగింపు, పరపతి విధానం.. వంటి అంశాలు దేశీయ ఆర్థిక వ్యవస్థను దిశానిర్దేశం చేయనున్నాయి.

  • జంటగా పుట్టారు.. గుట్టు విప్పారు!

మానవ ఆరోగ్యం, వ్యవహారశైలి గురించి మెరుగ్గా అర్థం చేసుకోవడానికి అనేక సందర్భాల్లో పరిశోధకులు కవలలపై ఆధారపడుతుంటారు. వారిలోని వైరుధ్యాలను పరిశీలించడం ద్వారా కొత్త విషయాలను వెలుగులోకి తెస్తుంటారు. ఇప్పటివరకూ ఇలాంటి పరిశోధనల్లో వెల్లడైన కీలకాంశాలపై ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల విశ్లేషణ ఇలా ఉంది.

  • 'ధోనీ ఉన్నప్పటి నుంచే ఆ పద్ధతి..'

దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డేసిరీస్​కు కోహ్లీని కాకుండా కేఎల్​ రాహుల్​ను కెప్టెన్​గా ఎంపిక చేయడంపై స్పందించాడు పాక్​ మాజీ క్రికెటర్​ సల్మాన్​ బట్​. ఇలాంటి పద్ధతి ధోనీ నాయకుడిగా ఉన్న రోజుల నుంచే కొనసాగుతందని చెప్పాడు.

  • హీరోయిన్ కాజల్ ప్రెగ్నెంట్..

హీరోయిన్ కాజల్​.. ప్రస్తుతం సినిమాలు ఏవి చేయడం లేదు. 'ఆచార్య' షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసి భర్తతో సమయాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ఆమె గర్భవతి అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ న్యూ ఇయర్ సందర్భంగా కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ ఇన్​స్టా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

  • దేశంలో కరోనా ఉద్ధృతి

దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 27,553 కేసులు నమోదయ్యాయి. 284 మంది మరణించారు. శుక్రవారం 58,11,487 మందికి టీకాలు అందించారు. మరోవైపు ఒమిక్రాన్​ కేసులు ఆందోళన పెంచుతున్నాయి.

  • ఆర్టీసీలో అక్రమాలు..

ఆర్టీసీలో మందుల కొనుగోలు నుంచి పంపిణీ వరకు భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి ఒకే సంస్ఖకు మందుల సరఫరా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీలో మందుల మాయాజాలం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది.

  • మందుబాబుల హల్​చల్​

నూతన సంవత్సర వేడుకల వేళ.. రాష్ట్రంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. పలుచోట్ల పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. మరికొందరు వాహనాలతో హల్‌చల్‌ చేశారు. పెద్ద సంఖ్యలో మందుబాబులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

  • ప్రియురాలి ఎడబాటు భరించలేక..

బతుకుదెరువు కోసం రాష్ట్రంకాని రాష్ట్రానికి వచ్చాడు. వచ్చిన పని చేసుకుంటూ కాలంగడుపుతుండగా ఓ అమ్మాయి... నచ్చింది. క్రమంగా ప్రేమగా మారింది. ఆమెను పెళ్లి చేసుకొని.. జీవితాంతం కలిసి ఉండాలని కలలు కన్నాడు. బాగా సంపాదించి... ప్రేయసిని వివాహమాడాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. కట్ చేస్తే.. ప్రియురాలి ఎడబాటు తట్టుకోలేక తనువుచాలించాడు.

  • ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ఆంగ్ల నూతన సంవత్సరం వేళ రాష్ట్రవ్యాప్తంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. కొత్త సంవత్సరంలో ఆశయాలు నెరవేరాలనీ వేడుకున్నారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో వేకువజాము నుంచే రద్దీ నెలకొంది.

  • బంగారం, వెండి ధరలు ఇలా..

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

  • వృద్ధికి కరోనా, ద్రవ్యోల్బణాలే సవాళ్లు..

కరోనా వచ్చిన నాటి నుంచి ఇబ్బందులు పడ్డ దేశ ఆర్థిక వ్యవస్థ.. ఈ ఏడాదిలో కూడా అదే బాటలో నడవబోతుందని నిపుణులు చెప్తున్నారు. దేశీయంగా పెరుగుతున్న కరోనా కేసులు, ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈ ఏడాదికి గానూ బడ్జెట్‌ ప్రకటనలు, ఉద్దీపన చర్యల కొనసాగింపు, పరపతి విధానం.. వంటి అంశాలు దేశీయ ఆర్థిక వ్యవస్థను దిశానిర్దేశం చేయనున్నాయి.

  • జంటగా పుట్టారు.. గుట్టు విప్పారు!

మానవ ఆరోగ్యం, వ్యవహారశైలి గురించి మెరుగ్గా అర్థం చేసుకోవడానికి అనేక సందర్భాల్లో పరిశోధకులు కవలలపై ఆధారపడుతుంటారు. వారిలోని వైరుధ్యాలను పరిశీలించడం ద్వారా కొత్త విషయాలను వెలుగులోకి తెస్తుంటారు. ఇప్పటివరకూ ఇలాంటి పరిశోధనల్లో వెల్లడైన కీలకాంశాలపై ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల విశ్లేషణ ఇలా ఉంది.

  • 'ధోనీ ఉన్నప్పటి నుంచే ఆ పద్ధతి..'

దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డేసిరీస్​కు కోహ్లీని కాకుండా కేఎల్​ రాహుల్​ను కెప్టెన్​గా ఎంపిక చేయడంపై స్పందించాడు పాక్​ మాజీ క్రికెటర్​ సల్మాన్​ బట్​. ఇలాంటి పద్ధతి ధోనీ నాయకుడిగా ఉన్న రోజుల నుంచే కొనసాగుతందని చెప్పాడు.

  • హీరోయిన్ కాజల్ ప్రెగ్నెంట్..

హీరోయిన్ కాజల్​.. ప్రస్తుతం సినిమాలు ఏవి చేయడం లేదు. 'ఆచార్య' షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసి భర్తతో సమయాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ఆమె గర్భవతి అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ న్యూ ఇయర్ సందర్భంగా కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ ఇన్​స్టా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.