ETV Bharat / city

TOP NEWS TODAY : టాప్ న్యూస్ @ 1PM - తెలంగాణ తాజా వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS TODAY, telangana top news
తెలంగాణ వార్తలు
author img

By

Published : Feb 14, 2022, 12:59 PM IST

మేడ్చల్ జిల్లా కీసర మండలంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాంపల్లి వద్ద ఓ రసాయన పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. వెంటనే పరిశ్రమ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

  • హైదరాబాద్‌లో ముగిసిన రాష్ట్రపతి పర్యటన

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌... రెండు రోజుల హైదరాబాద్ పర్యటన ముగిసింది. బేగంపేట విమానాశ్రయం నుంచి సోమవారం నాడు దిల్లీ వెళ్లారు. గవర్నర్లు తమిళిసై, దత్తాత్రేయ ఆయనకు వీడ్కోలు పలికారు.

  • మేడారం భక్తులపై మరోభారం..

మేడారం జాతరకొచ్చే భక్తులకు టోల్​గేట్ కష్టాలు తప్పట్లేదు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి వచ్చే వారికి... అదనపు భారం పడుతోంది. జాతర జరిగే నాలుగు రోజుల్లోనైనా... భక్తులకు టోల్ గేట్ భారం లేకుండా చేయాలన్న విజ్ఞప్తులు వ్యక్తమవుతున్నాయి.

  • తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కలెక్టరేట్లు..

ఇరుకుగదులు, పెచ్చులూడే పైకప్పులు, వానొస్తే తడిసే దస్త్రాలు.. ఇదంతా రాష్ట్ర విభజనకు ముందు కలెక్టరేట్ల పరిస్థితి. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత పాలనను ప్రజలచెంతకు తీసుకెళ్లడంపై తెరాససర్కారు దృష్టిసారించింది. అభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఆధునిక కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా.. కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా సమీకృత భవన సముదాయాలను నిర్మించింది.

  • 54 చైనా యాప్​లపై నిషేధం!

దేశ భద్రత, రక్షణ దృష్ట్యా చైనాకు చెందిన 54 యాప్​లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 59 యాప్​లపై నిషేధం విధించిన భారత్​ మరోసారి చైనాకు షాక్​ ఇవ్వనుంది.

  • మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం..

మాదకద్రవ్యాల నిరోధానికి పోలీసులు మరింత పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. డ్రగ్స్ కట్టడికి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు నిఘా పెంచాయి. మూతపడిన పరిశ్రమల్లో తయారవుతున్న... మెఫిడ్రిన్‌, ఎపిడ్రిన్‌, ఎండీఎంఏ ముడి పదార్ధాలపై... లోతుగా ఆరా తీస్తున్నాయి. జీడిమెట్ల, బాలానగర్‌, కొంపల్లి తదితర ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేసినట్లు సమాచారం.

  • ఉక్రెయిన్​పై రష్యాకు ఎందుకంత కోపం..?

ఉక్రెయిన్​తో యుద్ధం దిశగా రష్యా అడుగులు వేస్తోంది. పుతిన్​ దూకుడును తగ్గించేందుకు అమెరికా సహా మరికొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నా.. ఫలితం కనిపించట్లేదు. ఈ నెల 16వ తేదీన రష్యా దాడి చేయొచ్చనే అమెరికా చేసిన ప్రకటనలు..ఐరోపా సమాఖ్య దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి ఉన్న సమయంలో యుద్ధం వస్తే తట్టుకొనే స్థితిలో ఏ దేశ ఆర్థిక వ్యవస్థా ఉండదు.

  • సినిమా కలిపింది వాళ్లిద్దరినీ!

స్క్రీన్​పై ప్రేమతో జనం మనసుల్ని కనికట్టు చేసే నటీనటులు నిజంగానే ప్రేమలో పడిపోయారు. అడ్డంకులు దాటి.. పెద్దల్ని ఒప్పించి.. కెరీర్‌లో ఒడుదొడుకులు అధిగమించి.. చివరికి ఒకే గూటి పక్షులయ్యారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా.. ఆ ప్రేమకథలు షార్ట్‌ అండ్‌ స్వీట్‌గా..

  • సమతా మూర్తి విగ్రహానికి ఘనంగా ప్రాణ ప్రతిష్ఠాపన

శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు.. ముగింపు దశకు వచ్చాయి. చివరి రోజు కార్యక్రమాలన్నీ వైభవంగా సాగుతున్నాయి. సహస్ర కుండలాల యజ్ఞం, యాగశాలలో మహా పూర్ణాహుతి అట్టహాసంగా నిర్వహించారు. సమతా మూర్తి బంగారు విగ్రహానికి చినజీయర్ స్వామి ప్రాణ ప్రతిష్ఠాపన చేసి తొలి ఆరాధన చేశారు.

  • పుల్వామా అమరులకు ప్రధాని నివాళి

పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అమరులు చేసిన త్యాగాలను వారు గుర్తు చేసుకున్నారు.

  • కీసర మండలంలో భారీ అగ్నిప్రమాదం

మేడ్చల్ జిల్లా కీసర మండలంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాంపల్లి వద్ద ఓ రసాయన పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. వెంటనే పరిశ్రమ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

  • హైదరాబాద్‌లో ముగిసిన రాష్ట్రపతి పర్యటన

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌... రెండు రోజుల హైదరాబాద్ పర్యటన ముగిసింది. బేగంపేట విమానాశ్రయం నుంచి సోమవారం నాడు దిల్లీ వెళ్లారు. గవర్నర్లు తమిళిసై, దత్తాత్రేయ ఆయనకు వీడ్కోలు పలికారు.

  • మేడారం భక్తులపై మరోభారం..

మేడారం జాతరకొచ్చే భక్తులకు టోల్​గేట్ కష్టాలు తప్పట్లేదు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి వచ్చే వారికి... అదనపు భారం పడుతోంది. జాతర జరిగే నాలుగు రోజుల్లోనైనా... భక్తులకు టోల్ గేట్ భారం లేకుండా చేయాలన్న విజ్ఞప్తులు వ్యక్తమవుతున్నాయి.

  • తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కలెక్టరేట్లు..

ఇరుకుగదులు, పెచ్చులూడే పైకప్పులు, వానొస్తే తడిసే దస్త్రాలు.. ఇదంతా రాష్ట్ర విభజనకు ముందు కలెక్టరేట్ల పరిస్థితి. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత పాలనను ప్రజలచెంతకు తీసుకెళ్లడంపై తెరాససర్కారు దృష్టిసారించింది. అభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఆధునిక కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా.. కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా సమీకృత భవన సముదాయాలను నిర్మించింది.

  • 54 చైనా యాప్​లపై నిషేధం!

దేశ భద్రత, రక్షణ దృష్ట్యా చైనాకు చెందిన 54 యాప్​లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 59 యాప్​లపై నిషేధం విధించిన భారత్​ మరోసారి చైనాకు షాక్​ ఇవ్వనుంది.

  • మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం..

మాదకద్రవ్యాల నిరోధానికి పోలీసులు మరింత పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. డ్రగ్స్ కట్టడికి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు నిఘా పెంచాయి. మూతపడిన పరిశ్రమల్లో తయారవుతున్న... మెఫిడ్రిన్‌, ఎపిడ్రిన్‌, ఎండీఎంఏ ముడి పదార్ధాలపై... లోతుగా ఆరా తీస్తున్నాయి. జీడిమెట్ల, బాలానగర్‌, కొంపల్లి తదితర ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేసినట్లు సమాచారం.

  • ఉక్రెయిన్​పై రష్యాకు ఎందుకంత కోపం..?

ఉక్రెయిన్​తో యుద్ధం దిశగా రష్యా అడుగులు వేస్తోంది. పుతిన్​ దూకుడును తగ్గించేందుకు అమెరికా సహా మరికొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నా.. ఫలితం కనిపించట్లేదు. ఈ నెల 16వ తేదీన రష్యా దాడి చేయొచ్చనే అమెరికా చేసిన ప్రకటనలు..ఐరోపా సమాఖ్య దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి ఉన్న సమయంలో యుద్ధం వస్తే తట్టుకొనే స్థితిలో ఏ దేశ ఆర్థిక వ్యవస్థా ఉండదు.

  • సినిమా కలిపింది వాళ్లిద్దరినీ!

స్క్రీన్​పై ప్రేమతో జనం మనసుల్ని కనికట్టు చేసే నటీనటులు నిజంగానే ప్రేమలో పడిపోయారు. అడ్డంకులు దాటి.. పెద్దల్ని ఒప్పించి.. కెరీర్‌లో ఒడుదొడుకులు అధిగమించి.. చివరికి ఒకే గూటి పక్షులయ్యారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా.. ఆ ప్రేమకథలు షార్ట్‌ అండ్‌ స్వీట్‌గా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.