ETV Bharat / city

Top News Today : టాప్​టెన్​ న్యూస్​ @11AM - తెలుగు తెలంగాణ వార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

Top News Today, telangana news
తెలంగాణ టాప్​టెన్​ న్యూస్​
author img

By

Published : Jan 29, 2022, 11:00 AM IST

  • విద్యాసంస్థలు తెరిచేందుకే సర్కార్ మొగ్గు

ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలు తెరిచే అవకాశం ఉంది. ఈ విషయంపై తన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అధికారకంగా ప్రకటించనుంది. విద్యాసంస్థలు తెరిచాక.. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

  • దేశంలో తగ్గిన కేసులు..

భారత్​లో కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం మరో 2,35,532మందికి కొవిడ్ వైరస్​ సోకింది. ఒక్కరోజులో 871 మంది మరణించారు. 3,35,939 మంది కొవిడ్​ను జయించారు. దేశంలో పాజిటివిటీ రేటు 13.39 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • 'భాజపా హామీలన్నీ అబద్ధాలే..'

ఉత్తర్​ప్రదేశ్ గత ఎన్నికల సందర్భంగా భాజపా ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని తేలాయని సమాజ్​వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఈసారి భాజపాకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాల గురించి వివరించారు.

  • సామాన్యులకు కొత్త గూడు

కేంద్ర బడ్జెట్‌ ఫిబ్రవరి 1న రాబోతుంది. ఆర్థిక మంత్రి, తెలుగింటి కోడలు నిర్మలమ్మ పద్దు నుంచి గృహ కొనుగోలుదారులు ఏం ఆశిస్తున్నారు? స్థిరాస్తి వర్గాలు ఎలాంటి అంచనాలు పెట్టుకున్నాయి?.

  • 'దళితుల' కటాక్షం దక్కేదెవరికి?

పంజాబ్​లో దళితులు ఏ పార్టీవైపు మొగ్గుచూపనున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఏ ఒక్క పార్టీకో వీరు ఓటు బ్యాంకుగా లేరు. దీంతో రాష్ట్రంలో దాదాపు 32 శాతంగా ఉన్న దళితులను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మరి వారి కటాక్షం ఎవరికి దక్కుతుందో?

  • తొమ్మిది నెలల కింద మృతి.. ఇప్పుడు సెకండ్ డోసు టీకా!

తొమ్మిది నెలల కింద మృతి చెందిన వ్యక్తి... ఇప్పుడు సెకండ్ డోసు టీకా తీసుకున్నట్లు మెసేజ్ వచ్చింది. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు.. కోవిన్ పోర్టల్​ నుంచి ధ్రువపత్రం డౌన్ లోడ్ చేశారు. ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

  • కాలేజీ ఫీజు చెల్లిస్తేనే పరీక్షకు పంపేది

కరోనా మహమ్మారి, లాక్​డౌన్ వల్ల గత రెండేళ్లుగా విద్యాసంస్థలు తెరుచుకుంటున్నాయి.. మూసుకుంటున్నాయి. విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమై ఆన్​లైన్ తరగతులకు హాజరవుతున్నారు. ఆన్​లైన్ క్లాసులు వింటూనే.. పరీక్షలు రాస్తున్నారు. కానీ చాలా ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఫీజుల విషయంలో విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నాయి.

  • పర్వతగిరిలో విషాదం..

వరంగల్ జిల్లాలో 8 నెమళ్లు మృత్యువాత పడ్డాయి. పర్వతగిరి మండల శివారు దేవిలాల్ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంటలకు పిచికారీ చేసిన క్రిమిసంహారక మందుల వల్లే నెమళ్లు మరణించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

  • 'ఆ రూల్స్​ ఉంటే సచిన్​ లక్షకుపైగా రన్స్​ చేసేవాడు'

క్రికెట్​లో ప్రస్తుతం ఉన్న నిబంధనలు బ్యాటర్లకు అనుకూలంగా ఉన్నాయంటూ వస్తున్న వాదనలకు మద్దతు పలికాడు పాక్​ మాజీ క్రికెటర్​ షోయబ్​ అక్తర్​. ఈ రూల్స్​ తాము ఆడే రోజుల్లో ఉండి ఉంటే భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​ లక్షకు పైగా పరుగులు చేసేవాడని అభిప్రాయపడ్డాడు.

  • హీరో విజయ్​కు హైకోర్టులో ఊరట

డబ్బింగ్​ సినిమాలతో తెలుగువారికి సుపరిచితమైన స్టార్ హీరో విజయ్​కు హైకోర్టులో ఊరట లభించింది. పన్ను ఎగవేత కేసులో అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర స్టే జారీ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.