ETV Bharat / city

TOP NEWS TODAY : టాప్​టెన్​ న్యూస్​ @9AM - telangana news

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

telangana news, telugu top news
తెలుగు టాప్​టెన్​ న్యూస్
author img

By

Published : Jan 22, 2022, 8:59 AM IST

అమీన్​పూర్ ఫ్యామిలీ ఆత్మహత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. మృతదేహాలకు గురువారం పోస్టుమార్టం నిర్వహించి... కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్థిక పరమైన అంశాలే కారణం కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • రేపు ఓ మోస్తరు వర్షాలు

రాష్ట్రాన్ని మరోసారి వరణుడు పలకరించే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతారవణ కేంద్రం వెల్లడించింది. వాయవ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపపు తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో ఆదివారం రోజున మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

  • లోదుస్తుల్లో గుట్టుగా డ్రగ్స్​ తరలింపు

రూ.7 కోట్ల విలువగల హెరాయిన్​ను లోదుస్తుల్లో అక్రమంగా తరలిస్తున్న ఉగాండ దేశస్థుడిని చెన్నైలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. మరో ఘటనలో దుబాయ్​ నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

  • 'మూడో ముప్పు విమానయాన రంగానికీ'

కరోనా మహమ్మారి సృష్టించిన విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రంగాలన్నింటిపై కొవిడ్ మూడో దశ, ఒమిక్రాన్ వేరియంట్​లు మరోమారు పంజా విసురుతున్నాయి. ముఖ్యంగా మూడో ముప్పు ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడుతోంది. రోజురోజుకు విమానయాన ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతోంది.

  • సుప్రీంకోర్టు ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

దేశ అత్యున్నత న్యాయస్థానం దగ్గర శుక్రవారం విచారకర ఘటన జరిగింది. కోర్టుకు సమీపంలో ఓ వ్యక్తి(50) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

  • సుడిగాలిలా ఒమిక్రాన్‌ విజృంభణ

భారత్​లో రోజు వారి కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. మరోవైపు కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ కూడా అంతకంతకూ విస్తరిస్తోంది. ఒక్కరోజే దేశవ్యాప్తంగా ఏకంగా 3.5 లక్షల కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అమెరికా తరవాత ప్రపంచంలోనే అత్యధికంగా కొవిడ్‌ బారిన పడిన దేశాల జాబితాలోకి భారత్‌ చేరిపోయింది.

  • 'కోహ్లీకి షోకాజ్​ నోటీసులు'.. నిజమెంత?

టీమ్​ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ భావించినట్లు వస్తున్న కథనాలను దాదా ఖండించాడు. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు.

  • తల్లయిన గ్లోబల్ స్టార్

నిక్-ప్రియాంక దంపతులు బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

  • పెళ్లైన వ్యక్తితో యువతి ప్రేమ..

వనపర్తి జిల్లా గుడిపల్లి జలాశయంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

  • కరోనా సోకిందా.. ఈ పరికరాలు ఉన్నాయా?

ఇప్పుడు కరోనా మూడోవేవ్‌ నడుస్తోంది. వైరస్‌ సోకిందా లేదా అని తనిఖీ మొదలు దాని నుంచి బయట పడేందుకు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కువ మంది జ్వరం, దగ్గు, గొంతునొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. కొవిడ్‌ సోకిందా లేదా అనే అనుమానంతో సతమతమవుతున్నారు. జ్వరం మూడ్రోజుల్లో తగ్గకపోతే పరీక్ష తప్పదు. కిట్‌తో స్వీయ తనిఖీ కూడా చేసుకోవచ్చు.

  • ఇంకా వీడని సూసైడ్ మిస్టరీ

అమీన్​పూర్ ఫ్యామిలీ ఆత్మహత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. మృతదేహాలకు గురువారం పోస్టుమార్టం నిర్వహించి... కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్థిక పరమైన అంశాలే కారణం కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • రేపు ఓ మోస్తరు వర్షాలు

రాష్ట్రాన్ని మరోసారి వరణుడు పలకరించే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతారవణ కేంద్రం వెల్లడించింది. వాయవ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపపు తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో ఆదివారం రోజున మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

  • లోదుస్తుల్లో గుట్టుగా డ్రగ్స్​ తరలింపు

రూ.7 కోట్ల విలువగల హెరాయిన్​ను లోదుస్తుల్లో అక్రమంగా తరలిస్తున్న ఉగాండ దేశస్థుడిని చెన్నైలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. మరో ఘటనలో దుబాయ్​ నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

  • 'మూడో ముప్పు విమానయాన రంగానికీ'

కరోనా మహమ్మారి సృష్టించిన విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రంగాలన్నింటిపై కొవిడ్ మూడో దశ, ఒమిక్రాన్ వేరియంట్​లు మరోమారు పంజా విసురుతున్నాయి. ముఖ్యంగా మూడో ముప్పు ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడుతోంది. రోజురోజుకు విమానయాన ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతోంది.

  • సుప్రీంకోర్టు ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

దేశ అత్యున్నత న్యాయస్థానం దగ్గర శుక్రవారం విచారకర ఘటన జరిగింది. కోర్టుకు సమీపంలో ఓ వ్యక్తి(50) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

  • సుడిగాలిలా ఒమిక్రాన్‌ విజృంభణ

భారత్​లో రోజు వారి కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. మరోవైపు కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ కూడా అంతకంతకూ విస్తరిస్తోంది. ఒక్కరోజే దేశవ్యాప్తంగా ఏకంగా 3.5 లక్షల కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అమెరికా తరవాత ప్రపంచంలోనే అత్యధికంగా కొవిడ్‌ బారిన పడిన దేశాల జాబితాలోకి భారత్‌ చేరిపోయింది.

  • 'కోహ్లీకి షోకాజ్​ నోటీసులు'.. నిజమెంత?

టీమ్​ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ భావించినట్లు వస్తున్న కథనాలను దాదా ఖండించాడు. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు.

  • తల్లయిన గ్లోబల్ స్టార్

నిక్-ప్రియాంక దంపతులు బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.