ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...

top ten news till now
టాప్​టెన్​ న్యూస్​ @3PM
author img

By

Published : Apr 11, 2021, 2:59 PM IST

1.రేపు వరంగల్​కు కేటీఆర్​...

వరంగల్​ మహానగరంలో మంత్రి కేటీఆర్ రేపు​ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రి ఎర్రబెల్లి ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలో త్వరలోనే పుర పోరుకు నగారా మోగనున్న నేపథ్యంలో.. కేటీఆర్​ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. నా బిడ్డను ఆదుకోండి...

విద్యుత్​ అధికారుల నిర్లక్ష్యం వల్ల స్నేహితులతో ఆడుకోవాల్సిన ఎనిమిదేళ్ల బాలుడు ఆస్పత్రి పడకపై ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఓ అపార్టుమెంట్​ వద్ద ఉన్న ట్రాన్స్​ఫార్మర్​కు సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల.. దాన్ని ప్రమాదవశాత్తు తాకిన బాలుడు ఆస్పత్రి పాలయ్యాడు. తన బిడ్డను రక్షించుకునేందుకు ఆ బాలుడు తల్లి దాతల సాయం కోసం వేడుకొంది. ఈ ఘటనపై ట్విట్టర్​ వేదికగా స్పందించిన మంత్రి కేటీఆర్​.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. నగ్న వీడియో కాల్స్​తో వల...

డేటింగ్​ యాప్​లో పరిచమైన యువతితో ఓ యువకుడు నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడాడు. ఇదే అదునుగా భావించిన యువతి దానిని స్క్రీన్ రికార్డ్ చేసింది. అనంతరం డబ్బులు ఇవ్వాలని... లేకుంటే వీటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బ్లాక్​మెయిల్ చేసింది. ఈ ఘటన పేట్​బషీరాబాద్​లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. జోరుగా టీకా ఉత్సవ్​...

అర్హులైన వారందరికీ టీకా అందించడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన 'టీకా ఉత్సవ్'​ కార్యక్రమం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. టీకా తీసుకునేందుకు వ్యాక్సినేషన్​ కేంద్రాల వద్ద జనం బారులు తీరుతున్నారు. పలు రాష్ట్రాల్లో టీకా పంపిణీ కేంద్రాలను ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. సొంతూళ్లకు వలస కూలీలు...

కరోనా విజృంభిస్తున్న వేళ మహమ్మారిని అరికట్టేందుకు కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ లాక్​డౌన్​ ప్రకటించే అవకాశం ఉండొచ్చన్న సంకేతాలు.. వలస కూలీలను కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో సొంతూళ్లకు వెళ్లేందుకు ముంబయిలోని లోకమాన్య తిలక్ టెర్మినస్​తో పాటు, ఔరంగాబాద్​ రైల్వేస్టేషన్​కు వలస కూలీలు పోటెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. అమిత్​షా భారీ రోడ్​ షో...

బంగాల్​లో ఐదో దఫా ఎన్నికల ప్రచారంలో భాగంగా నదియా జిల్లాలోని శాంతిపుర్​ పట్టణంలో రోడ్​ షో నిర్వహించారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. మా వ్యాక్సిన్లకు అంతలేదు...

తమ దేశ వ్యాక్సిన్లు నాసిరకంగా ఉన్నట్లు చైనా ఒప్పుకుంది. అన్ని టీకాలను కలిపి వినియోగించటం ద్వారా టీకా సామర్థ్యం పెంచాలని ప్రభుత్వ యోచిస్తున్నట్లు చైనా వైరస్‌ నియంత్రణ కేంద్రాల డైరెక్టర్​‌ గోవ్‌ ఫూ చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. టాప్​ స్మార్ట్​ఫోన్లు ఇవే...

ఈ ఏడాది జనవరిలో అత్యధికంగా అమ్ముడైన​ స్మార్ట్​ఫోన్ జాబితాలో యాపిల్​ ఐఫోన్​-12 నిలిచింది. 5జీ సాంకేతికతతో పాటు.. ఐఫోన్​-11కి అప్​డేట్​ వెర్షన్​గా తయారైన మోడల్ అయినందున వినియోగదారులు ఆసక్తి చూపించారని కౌంటర్​ పాయింట్​ నివేదిక తెలిపింది. ఇక ఈ అమ్మకాలు అమెరికాలోనే అధికంగా నమోదయ్యయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. డ్రెస్సింగ్​ రూంలో డ్యాన్సులు...

చెన్నై సూపర్ కింగ్స్​పై విజయం సాధించాక దిల్లీ క్యాపిటల్స్ డ్రెస్సింగ్ రూమ్​లో ధావన్, పృథ్వీ షా ఉల్లాసంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోను ధావన్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. క్వారంటైన్​లోకి వకీల్​సాబ్​...

ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్వారంటైన్​లోకి వెళ్లారు. తన భద్రతా సిబ్బందితోపాటు వ్యక్తిగత సిబ్బందిలో ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, వైద్యుల సూచనల మేరకు పవన్​ క్వారంటైన్​లోకి వెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.