1. మీరు నిజమైన ప్రేమికులేనా...?
ప్రేమ.. అందరినీ జీవితంలో ఒక్కసారైనా పలకరిస్తుంది. అప్పుడిక ఊహల్లో ఊరేగుతుంటాం. హీరోల్లా ఫీలైపోతాం. నిజానికి ప్రేమలో పడినవాళ్లంతా హీరోలు కాదు. ప్రేమలో పడ్డాక.. ఎదురయ్యే కష్టాలను అధిగమించి, అందరినీ ఒప్పించి, కొత్త జీవితం మొదలుపెట్టేవాళ్లే నిజమైన హీరోలు, ప్రేమికులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. అడుగడునా కొత్త అనుమానాలు...
ఘట్‌కేసర్ సమీపంలో ఫార్మసీ విద్యార్థినిపై అఘాయిత్యం జరిగినట్లుగా నమోదైన కేసు మలుపులు తిరుగుతోంది. నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకుని సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆమె అసలు అపహరణకు గురికాలేదని సీసీటీవీ దృశ్యాల ద్వారా పోలీసులు కనిపెట్టారు. ఆ కోణంలో సాగిన దర్యాప్తులో ఎన్నెన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు ఎదురవడంతో ఈ కేసు రాచకొండ పోలీసులకు సవాలుగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. తల్లి ఎదుటే కుమారుని మరణం...
పొట్ట చేతపట్టుకుని కూలి పనుల కోసం వందల కిలోమీటర్లు దాటి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు వచ్చిన ఓ కుటుంబానికి.. తీరని విషాదం మిగిలింది. కూలీ పని చేసుకుని పిల్లలతో ఇంటికి తిరిగి వెళ్తుండగా లారీ ఢీకొని బాలుడు మృతి చెందాడు. కళ్లెదుటనే కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరైయ్యారు. విగతజీవిగా పడి ఉన్న తమ్మున్ని చూసి అన్నయ్య బోరున విలపించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. తెలుగు రాష్ట్రాల రైళ్లే అధికం...
దేశవ్యాప్తంగా ప్రైవేటీకరించే రైళ్లలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవే అధికంగా ఉన్నావని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. సంక్షోభంలోనూ సంక్షేమం...
సంక్షోభంలో వచ్చిన అవకాశాన్ని కేంద్రం వినియోగించుకుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశానికి దీర్ఘకాలంలో కావాల్సిన వృద్ధి కోసం.. సంక్షోభంలోనూ సంస్కరణలు చేపట్టినట్టు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. రైతులకు అండగా హరియాణా ప్రజలు...
దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులకు అండగా నిలుస్తున్నారు హరియాణా ప్రజలు. ప్రతి రోజు కూరగాయలు, పాలు వంటి ఇతర నిత్యవసరాలను సరఫరా చేస్తున్నారు. సమీప జిల్లాల నుంచి ప్రతి రోజు ట్రాలీల్లో నిరసన ప్రాంతాలకు చేరుకుని ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. రెండో వారానికి చేరిన పౌర నిరసలు...
మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా చేపడుతున్న పౌర నిరసనలు రెండోవారానికి చేరాయి. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి, నిర్బంధంలోని ఆంగ్ సాన్ సూకీని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున వీధుల్లోకి చేరి ఆందోళనలు చేపట్టారు ప్రజలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. నకిలీ కట్టడికి మరిన్ని అడ్డుకట్టలు...
నకిలీ వార్తలు, ఖాతాల కట్టడిలో భాగంగా ప్రభుత్వ నేతలు, అనుబంధ సంస్థల గుర్తింపునకు మరిన్ని లేబుల్స్ తీసుకురానున్నట్లు ప్రకటించింది ట్విట్టర్. కెనడా, జర్మనీ, ఇరాన్, జపాన్ వంటి 15 దేశాల్లో ఈనెల 17 నుంచి అమలు చేస్తామని తెలిపింది. అయితే.. ఈ జాబితాలో భారత్‌ను చేర్చకపోవటం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. రెండో రోజు మరో రెండు స్వర్ణాలు...
దుబాయ్ వేదికగా జరుగుతున్న పారా అథ్లెటిక్స్ పోటీల్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. రెండో రోజు రెండు గోల్డ్ మెడల్స్‌తో సహా మొత్తం ఐదు పతకాలు సాధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. యంగ్ డైనమిక్స్‌లో బన్నీ స్థానం...
గతేడాది ప్రజల్ని అత్యంత ప్రభావితం చేసిన భారతీయుల్లో ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్ ఒకరిగా నిలిచారు. ఈ మేరకు జీ క్యూ సంస్థ జాబితాను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.