కేసు ఛేదించారు..
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఏటీఎం వద్ద ఏప్రిల్ 29న జరిగిన నగదు దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. దుండగులు జరిపిన కాల్పుల్లో.. ఏటీఎం సెక్యూరిటీ గార్డు మృతి చెందగా… మరొకరు గాయపడ్డారు. చోరీకి పాల్పడినవారు బిహార్‌కు చెందిన అజిత్‌కుమార్, ముఖేశ్ కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వ్యాక్సిన్ సెంటర్ల జియో లొకేషన్లు ఇవిగో..!
హైదరాబాద్ నగరంలో అమలవుతున్న లాక్‌డౌన్ వల్ల కరోనా సెకండ్ డోసు ఎలా వేసుకోవాలనే అయోమయంలో పడిపోయారు. అసలు టీకా ఎక్కడ అందుబాటులో ఉందో..? ఉన్నా అక్కడి వరకు ఎలా వెళ్లాలో..? అడ్రస్ సరిగా దొరుకుతుందో లేదో..? అంటూ ఎన్నో ప్రశ్నలతో ఆందోళన చెందుతుంటారు. అన్ని ఆందోళనలు వదిలేయండి.. జస్ట్ ఈ లింక్ క్లిక్ చేయండి చాలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
హైదరాబాద్ @ 5
కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాల పరిస్థితిపై ఓ నివేదిక విడుదలైంది. దీని ప్రకారం ప్రతి 1000 మంది జనాభాకు 1.4 ఆసుపత్రి పడకలే అందుబాటులో ఉన్నాయని స్పష్టం అవుతోంది. ఈ జాబితాలో 3.5 పడకల లభ్యతతో పుణె మొదటి స్థానంలో నిలవగా.. దిల్లీ చివరి స్థానంలో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కొనసాగుతున్న లాక్‌డౌన్
రాష్ట్రంలో పక్కగా లాక్‌డౌన్ అమలుతో ఉదయం 10 గంటల తర్వాత రహదారులు నిర్మానుష్యంగా మారిపోయాయి. అత్యవసర సేవలకు మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తున్నారు. దీంతో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, ఇతర వాహనాలపై నిషేధం కొనసాగుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
వరుసగా రెండోరోజు.!
దేశంలో వరుసగా రెండో రోజు యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజులోనే 11,122 యాక్టిన్ కేసులు తగ్గినట్లు పేర్కొంది. దీంతో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 37,04,009కు పరిమితమైందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరో టీకా రెడీ.!
జంతువు యాంటీబాడీలతో కొవిడ్ టీకాను అభివృద్ధి చేసినట్లు తెలిపింది మహారాష్ట్రకు చెందిన ఓ ఫార్మా సంస్థ. తమ సంస్థ తయారు చేసిన టీకా సమర్ధంగా పనిచేస్తుందని చెబుతోంది. ప్రస్తుతం 3 లక్షల డోసులు వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇంతకి ఆ టీకాకు అనుమతి లభిస్తుందా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వారికి కేంద్రం అనుమతి
వైద్య విద్యార్హతలు ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. మెడికల్ ప్రాక్టీసు, టెలీ కన్సల్టేషన్ సేవలు అందించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే.. ఖాళీ సమయాల్లో, పూర్తి స్వచ్ఛందంగా మాత్రమే ఇందులో పాల్గొనాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ సంస్థల్లో ఉద్యోగులకు టీకా
తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కలిపి 70,000 మందికి టీకా అందించినట్లు విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ ప్రకటించింది. మరోవైపు.. మే 17న తమ ఉద్యోగుల కోసం టీకా డ్రైవ్‌ను ప్రారంభిస్తామని స్పైస్ జెట్ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
' అందుకే ఎంపిక చేయలేదు'
ఇంగ్లాండ్ పర్యటనకు శార్దూల్ ఠాకూర్‌ను ఎంపిక చేయడానికి గల కారణాన్ని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వెల్లడించాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా శార్దూల్ సత్తా చాటాడని, అతడిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఓటీటీకి నో ఛాన్స్.!
కొవిడ్ కారణంగా ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న స్టార్ హీరో ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్, తన హాలీవుడ్ ఎంట్రీ, తర్వాత చేయబోయే ప్రాజెక్టుల గురించి వెల్లడించారు. 'ఆర్ఆర్ఆర్'ను ఓటీటీలకు అమ్మే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.