ETV Bharat / city

టాప్ న్యూస్ @ 1PM - తెలంగాణ టుడే టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్ న్యూస్ @ 1PM
టాప్ న్యూస్ @ 1PM
author img

By

Published : Jan 30, 2022, 12:57 PM IST

  • భావోద్వేగానికి గురైన క్షణం అది : మోదీ

జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్​ జ్యోతి విలీనంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. జ్యోతి విలీనం చేసిన క్షణం అమరుల కుటుంబీకులు భావోద్వేగానికి గురయ్యారని పేర్కొన్నారు. కోటి మందికిపైగా పిల్లలు తమ మన్​కీ బాత్​ను పోస్టుకార్డుల ద్వారా పంపించారని తెలిపారు.

  • రాజ్​ఘాట్ ​వద్ద ప్రముఖుల నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. గాంధీజీ ఆశయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలని ప్రధాని పిలుపునిచ్చారు.

  • ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా

ఇంకో ఐదు నిమిషాల్లో పొలం నుంచి ఇంటికి చేరుకుంటారనగా.. లారీ రూపంలో మృత్యువు వారిని కబళించింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం తొండపల్లి సమీపంలో లారీ ఢీకొట్టి ఇద్దరు దుర్మరణం చెందారు.

  • డాక్టర్ పద్మజారెడ్డిని సన్మానించిన బండి సంజయ్

పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పద్మజా రెడ్డిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్మానించారు. జగద్గురు శంకరాచార్య హంపీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామితో పాటు పలువురు నేతలతో కలిసి ఆమె ఇంటికి వెళ్లారు.

  • రిజిస్ట్రేషన్ విలువలు పెంపు

తెలంగాణలో అధిక ప్రాధాన్యత కలిగిన గ్రామాలు, ప్రాంతాలు మొత్తం ఏడువేలు ఉన్నట్లు తేల్చిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆయా ప్రాంతాల్లో నిర్దేశిత విలువ కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్​ విలువలను పెంచింది. ఆరువేల‌కుపైగా ప్రాంతాలు, ఖాళీస్థ‌లాలు ప్రాధాన్య‌త కలిగినవికాగా, దాదాపు ఆరు వంద‌ల‌ గ్రామాల వ్య‌వ‌సాయ భూములు ప్రాధాన్య‌త క‌లిగిన‌విగా గుర్తించింది. ఖాళీ స్థ‌లాల‌కు గరిష్ఠంగా 60 శాతం, వ్య‌వ‌సాయ భూముల‌కు గ‌రిష్ఠంగా రిజిస్ట్రేష‌న్ విలువ‌లు 150 శాతం పెంచింది.

  • టీకా వ్యతిరేక ఆందోళనలు.. రహస్య ప్రదేశానికి ఆ దేశ ప్రధాని

కరోనా టీకా తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ కెనడాలో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో ప్రధాని జస్టిన్ ట్రూడోను తమ ఇంటి నుంచి తరలించాల్సి వచ్చింది. ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.

  • బీఏ.2 వేరియంట్ కలకలం

ఒమిక్రాన్‌ కొత్తరకం 'బీఏ.2'గా పిలిచే కరోనా వైరస్‌.. మూల ఒమిక్రాన్‌ వేరియంట్‌ కన్నా చాప కింద నీరులా వ్యాపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని జన్యు లక్షణాల కారణంగా దీన్ని నిర్దిష్టంగా గుర్తించడం కష్టం కావడమే ఇందుకు కారణం.

  • 2030 కల్లా పది లక్షల ఉద్యోగాలు!

భారత పునరుత్పాదక విద్యుత్‌ రంగానికి 2030 కల్లా సుమారు 10 లక్షల ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం ఉందని తాజా నివేదిక పేర్కొంది. సోలార్‌ పార్క్‌లు లాంటి పెద్ద ప్రాజెక్టులతో పోలిస్తే భవనాల పైకప్పులపై ఏర్పాటు చేసే చిన్న చిన్న సౌరవిద్యుత్తు పనులు, మినీ, మైక్రో- గ్రిడ్‌ సిస్టమ్స్‌ లాంటి చిన్న తరహా పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుల నుంచే కొత్త ఉద్యోగాల్లో చాలా వరకు వస్తాయని తెలిపింది.

  • స్వదేశంలోనే ఐపీఎల్

ఐపీఎల్​లను స్వదేశంలోని నిర్వహించాలని బోర్డు సన్నాహాలు చేస్తోందని తెలిసింది. లీగ్​ మ్యాచ్​లను మహారాష్ట్రలో, ప్లేఆఫ్స్​ను గుజరాత్​లో నిర్వహించాలని భావిస్తున్నట్లు క్రికెట్​ వర్గాలు తెలిపాయి.

  • 'ఖిలాడి' డైరెక్టర్​కు గిఫ్ట్​

'ఖిలాడి' విడుదలకు ముందే డైరెక్టర్​కు అదిరిపోయే కారును గిఫ్ట్​గా ఇచ్చారు సినిమా నిర్మాత. ఇంతకీ దాని విలువ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.