ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 9AM - telangana latest updates

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news, telangana top news
తెలంగాణ టాప్ న్యూస్, తెలంగాణ న్యూస్
author img

By

Published : Jun 8, 2021, 8:53 AM IST

  • నేడు కేబినెట్​ భేటీ..

కరోనా పరిస్థితులే ప్రధాన అజెండాగా నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. లాక్​డౌన్ విషయమై తదుపరి నిర్ణయం తీసుకోనుంది. మూడో వేవ్ సన్నద్దతపైనా దృష్టి సారించనుంది. వానాకాలం పంటలు, సాగునీటి ప్రాజెక్టుల సంబంధిత అంశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేబినెట్ చర్చించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఉద్యోగులకు గుడ్​న్యూస్​

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు, పింఛనర్ల వేతన సవరణ (పే రివిజన్‌) అంశాలు మంగళవారం మంత్రిమండలి ఆమోదానికి రానున్నాయి. శాసనసభలో గత మార్చి 22న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన పీఆర్‌సీ, ఫిట్‌మెంటు, ఇతర నిర్ణయాల అమలును ఎజెండాలో చేర్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • వారికి ముందుగానే రెండో డోసు

విదేశాలకు వెళ్లే విద్యార్థులు, క్రీడాకారులకు 84 రోజుల కంటే ముందే కొవిషీల్డ్‌ టీకా తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మళ్లీ తెరపైకి పీవీ జిల్లా

పీవీ నరసింహారావు జిల్లా.. ఇప్పుడు ఈ అంశం మళ్లీ తెరపైకొచ్చింది. గతంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో హుజూరాబాద్‌ కేంద్రంగా ఈ జిల్లా ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు వచ్చాయి. అది చేస్తే కరీంనగర్‌ జిల్లా పరిధి చాలా తగ్గుతుందని ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. తాజాగా పీవీ శతజయంత్యుత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 28న పీవీ జయంతిని పురస్కరించుకొని సీఎం కేసీఆర్‌ పీవీ జిల్లాను ప్రకటించాలనే వినతులు మొదలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బ్రెయిన్ ట్యూమర్ డే

అన్ని అవయవాల పనితీరును నియంత్రించేది, నిర్వర్తించేది మెదడే. ఇంతటి కీలకమైన మెదడులో కణితి (ట్యూమర్‌) ఏర్పడితే? ఎవరికైనా ఆందోళన సహజమే. నిజానికి మెదడు కణితులన్నీ క్యాన్సర్‌ కానవసరం లేదు. మామూలువీ కావొచ్చు. వీలైనంత త్వరగా గుర్తిస్తే కొన్ని కణితులను పూర్తిగా నయం చేయొచ్చు. కావాల్సింది అవగాహనే. వరల్డ్‌ బ్రెయిన్‌ ట్యామర్‌ డే సందర్భంగా మెదడు కణితులపై సమాచారం మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మద్యం తాగిన చిన్నారులు

కర్ణాటక రామనగర్​ జిల్లా కనకపుర్ మండలం మరలిపుర్​లో చిన్నారులు మద్యం సేవిస్తున్న వీడియో వైరల్​గా మారింది. గ్రామంలోని అరటితోటలో పార్టీ చేసుకున్న బంధువులు.. చిన్నారులకు సైతం మద్యం అందించారు. ఆ దృశ్యాలను వీడియో తీశారు. మద్యం తాగిన పిల్లలు తూలుతూ కనిపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 100 ఖాతాలు ఫ్రీజ్

రుణయాప్‌ నిర్వాహకుల ఖాతాల నుంచి అక్రమంగా నగదు బదిలీ వ్యవహారంలో సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్తంభింప చేసిన ఖాతాల్లో నుంచి బదిలీ అయిన సొమ్ము చైనాకు చేరి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో బ్యాంకు అధికారుల హస్తం ఉండొచ్చనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సీఎంకు మద్దతుగా 60మంది ఎమ్మెల్యేలు

కర్ణాటకలో అధికార భాజపా నాయకత్వ మార్పు కొలిక్కి రావడం లేదు. హై కమాండ్​ ఆదేశిస్తే వెంటనే రాజీనామా చేస్తానని ఆదివారం యడియూరప్ప చెప్పిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా సీఎం రాజకీయ కార్యదర్శి రేణుకాచార్య నేతృత్వంలో 60మంది ఎమ్మెల్యేల సంతకాలను సేకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్య రేసులో శ్రీలంక

భారత్​లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్​ను(T20 world cup) యూఏఈలో నిర్వహిస్తారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు ఈ మెగాటోర్నీని శ్రీలంకకు తరలించే అవకాశం ఉందని బీసీసీఐ(BCCI) వర్గాల సమాచారం. యూఏఈ కాకుండా లంకను ఎంచుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కల్యాణ్​రామ్​ సినిమా కోసం తారక్​!

నందమూరి కల్యాణ్​రామ్​ 'బింబిసార' టీజర్​ త్వరలో రానుండగా, అందులో ఓ చిన్న సర్​ప్రైజ్​ ప్లాన్ చేసింది చిత్రబృందం. అసలు దాంతో ఎన్టీఆర్​కు ఉన్న సంబంధమేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.