ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 1PM - top news in telangana today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top news, telangana news
తెలంగాణ టాప్ న్యూస్, తెలంగాణ లేటెస్ట్ అప్​డేట్స్
author img

By

Published : Apr 25, 2021, 1:02 PM IST

  • దేశవ్యాప్తంగా ఆక్సిజన్​ ప్లాంట్లు

ఆక్సిజన్ కొరత పరిష్కారానికి కేంద్రం చర్యలు చేపడుతోంది. పీఎం కేర్స్ నిధులతో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దేశంలో 551 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. వీలైనంత త్వరగా ప్రతి జిల్లా హెడ్​క్వార్టర్​లోని ప్రభుత్వాస్పత్రిలో ఓ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • దిల్లీలో లాక్​డౌన్ పొడిగింపు

దిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్​డౌన్​ కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు కఠిన ఆంక్షలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు. దేశ రాజధానిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవలే వారం రోజుల పాటు దిల్లీలో లాక్​డౌన్​ విధించారు కేజ్రీవాల్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తుపానులా కరోనా రెండో దశ

కరోనా.. దేశప్రజల ఓపికను పరీక్షిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొవిడ్​ టీకాలపై వస్తున్న వదంతులను నమ్మొద్దని 'మన్​కీ బాత్'​ రేడియా కార్యక్రమంలో తెలిపారు. వైరస్​ సెకండ్ వేవ్ దేశాన్ని వణికించిందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • టీకా ధర తగ్గించాల్సిందే

కరోనా టీకా ధరను వీలైనంత తక్కువగా నిర్ణయించాలని కేంద్రాన్ని కోరారు ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. కొవిషీల్డ్ టీకాను భారత్​లో అధిక ధరకు విక్రయిస్తున్నారని అన్నారు. అదనపు లాభాల కోసం సీరం సంస్థ.. టీకా రేట్లను పెంచిందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆ ఫ్యాన్ అంటే భయం

మధ్యప్రదేశ్​ ఛింద్వాడాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా రోగికి విచిత్రమైన బాధ వచ్చిపడింది. తన పడక​ వద్ద తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్​ వల్ల ప్రాణాలకు ముప్పుందని వాపోతూ అతను పోస్టు చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దాన్ని మార్చమని అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోట్లేదని తెలిపాడు. 'నేను కరోనా వైరస్​కు భయపడట్లేదు.. ఈ ఫ్యాన్​ని చూసి భయపడుతున్నా(కరోనా సే ఢర్​ నహీ లగ్తా సాబ్, ఫ్యాన్ సే లగ్తా హై) నన్ను వేరే బెడ్​కి మార్చండి'' అని వేడుకుంటున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బరిలో రౌడీషీటర్లు

రాజకీయం, రౌడీయిజం కలిశాయి. వరంగల్‌ మహానగర పాలక సంస్థ పరిధిలో పలువురు రౌడీషీటర్లకు కార్పొరేటర్లుగా ప్రధాన పార్టీలు టికెట్లు కేటాయించాయి. వారిని ప్రజలు ఆదరిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే పలువురు రౌడీషీటర్లు కొంతమంది ప్రజాప్రతినిధుల నీడలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • థాంక్యూ కేసీఆర్ తాతా

కరోనా సమయంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడంపై ఇద్దరు చిన్నారులు హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్​కు ధన్యవాదాలు తెలుపుతూ.. ఆయనకు కరోనా తగ్గిపోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బైడెన్​పై సొంత పార్టీ విమర్శలు

భారత్​కు మిత్రపక్షంగా ఉన్న అమెరికాపై.. కరోనా విజృంభణ వేళ సహాయం చేయకుండా ముఖం చాటేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ సొంత పార్టీ నుంచే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మిగులు టీకాలను భారత్​కు సహాయంగా అందించాలని భారత సంతతి అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అదే మా బాధ్యత'

భారత్​లో కరోనా కట్టడికి ఫ్రంట్​లైన్​ వర్కర్లు చేస్తున్న కృషిని కొనియాడాడు రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ క్రిస్ మోరిస్. ఈ సంక్షోభ సమయంలో ప్రజలను సంతోష పెట్టేలా ఆడటమే తమ బాధ్యత అని వ్యాఖ్యానించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'ఆచార్య' సాంగ్ లీక్!

మెగాస్టార్ చిరంజీవి-రామ్​చరణ్​ల మల్టీస్టారర్ 'ఆచార్య'లో ఓ సాంగ్​లోని చరణం లీకైంది. అది బాగుందని, పూర్తి సాంగ్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.