- సాగర్‌లో ఓటేశారు..
నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 31 శాతం పోలింగ్ నమోదయింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- చివరి రోజు దీక్ష
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసి.. ఖాళీలను భర్తీ చేయాలని వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో దీక్షాశిబిరం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- గన్‌తో బెదిరించి ..
జీడిమెట్ల పీఎస్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలోని దుకాణంలో చోరి జరిగింది. మనీట్రాన్స్‌ఫర్ దుకాణం యజమానిని గన్‌తో బెదిరించి దోపిడీ చేశారు. రూ.1.95 లక్షల నగదు, మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అయోధ్య రాముని చెక్కులు బౌన్స్
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఇచ్చిన.. దాదాపు 15వేలకు పైగా చెక్కులు బౌన్స్ అయ్యాయి. వీటి విలువ సుమారు రూ.22 కోట్లకు పైనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆడిట్ నివేదికలో తేలింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 'సీడబ్ల్యూసీ' భేటీ
కొవిడ్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశమైంది. వైరస్ కట్టడికి అనుసరించాల్సిన విధివిధానాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు పార్టీ నేతలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- దీప్ సిద్ధూకు బెయిల్
గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనలో అరెస్టైన పంజాబీ నటుడు దీప్ సిద్ధూకు బెయిల్ లభించింది. త్వరలో విడుదల కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- గోవులను కన్నబిడ్డల్లా సాకుతూ ..
గోమాతల సంరక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రచారాలు జరుగుతున్నాయి.. ఈ క్రమంలో పశువులను కన్నబిడ్డల్లాగా శ్రద్ధగా సాకుతోంది శ్రీబాలాజీ గోశాల ఇన్‌స్టిట్యూట్. ప్రస్తుతం అక్కడ 1600 పశువులు ఆశ్రయం పొందుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- వారికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు
భారత వైమానిక దళానికి.. అవసరాలకు తగ్గట్టుగా అశోక్ లే ల్యాండ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తయారు చేసింది. మొదటి విడతలో భాగంగా కొన్ని వాహనాలను ఐఏఎఫ్‌కు అందజేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ధోనీ.. సీఎస్కే గుండెచప్పుడు
ఐపీఎల్లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ధోనీపై ప్రశంసలు కురిపించాడు ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్. సీఎస్కే ఫ్రాంఛైజీకి మహీ గుండెచప్పుడు లాంటివాడని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అతడు మరో సుశాంత్ కాకూడదు
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న కొత్త చిత్రం 'దోస్తానా 2' నుంచి హీరో కార్తిక్ ఆర్యన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాతతో భేదాభిప్రాయాల కారణంగా హీరోను తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే విషయంపై నటి కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి