ETV Bharat / city

టాప్​ న్యూస్ @ 9AM - telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana, topnews, latest updates
తెలంగాణ, తాజా వార్తలు, లేటెస్ట్ అప్​డేట్స్
author img

By

Published : Mar 28, 2021, 8:53 AM IST

  • రేపు తెరాస‌ అభ్యర్థి ఎంపిక..

నాగార్జునసాగర్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై గులాబీ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో వ్యూహా, ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది. నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ లేదా శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని బరిలోకి దించే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆ శాఖలో 10వేల ఖాళీలు!

రాష్ట్రంలోని సంక్షేమ శాఖల్లో 10వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. త్వరలో 50వేల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న సర్కార్ నిర్ణయం మేరకు వివిధ విభాగాల్లో ఖాళీలను గుర్తించి వివరాలు సిద్ధం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఏపీ: రోడ్డు ప్రమాదంలో 8మంది మృతి

ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. శ్రీశైలం యాత్ర ముగించుకుని నెల్లూరు వెళ్తున్న యాత్రికుల టెంపో... బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • గ్యాంగ్​స్టర్​ ఫజ్జా ఎన్​కౌంటర్​

70 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న గ్యాంగ్​స్టర్​ ఫజ్జాను ఎన్​కౌంటర్ చేశారు దిల్లీ పోలీసులు. శనివారం రాత్రి ఈ కాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రాసలీలల సీడీ

కర్ణాటక రాజకీయాల్లో రాసలీలల సీడీ.. కాంగ్రెస్​కు గుదిబండలా తయారైంది. సీడీ తయారీ, తమ కుమార్తె అజ్ఞాతంలోకి వెళ్లడం వెనుక కేపీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ హస్తం ఉందని సీడీలో కనిపిస్తున్న యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే వారి ఆరోపణలను శివకుమార్‌ ఖండించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • జనోద్యమంగా జలసంరక్షణ

వాతావరణ మార్పులు, అతివృష్టి అనావృష్టుల వల్ల వర్షాలు గతి తప్పుతున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలకే కాక సమస్త ప్రాణవాళికి నీరు ప్రధాన జీవనాధారం. ఇలాంటి తరుణంలో జల సంరక్షణ, నిర్వహణ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం అత్యవసరం. ఈ నేపథ్యంలోనే మార్చి 22న కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో దేశమంతటా జలశక్తి అభియాన్‌ రెండో దశకు శంఖం పూరించింది కేంద్ర ప్రభుత్వం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కదలని 'ఎవర్ గివెన్'

సూయిజ్ కాలువలో ఇరుక్కుపోయిన భారీ నౌకను కదిలించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించటం లేదు. ఇక్కడ రాకపోకలు ఎప్పుడు పునరుద్ధరణ అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే, ప్రస్తుత ప్రయత్నాలు కలిసిరాకపోతే.. కంటైనర్లను తొలగించైనా నౌకను బయటకు తీస్తామని 'ఎవర్ గివెన్' యాజమాన్య సంస్థ అధ్యక్షుడు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • చైనాకు ఇంజినీరింగ్​ ఎగుమతులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్​- ఫిబ్రవరిలో చైనాకు భారత్​ ఇంజినీరింగ్​ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరిగాయని పరిశ్రమల సంఘం ఇంజినీరింగ్​ ఎక్స్​పోర్ట్​ ప్రమోషన్​ కౌన్సిల్​(ఈఈపీసీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారత ఇంజినీరింగ్​ ఉత్పత్తులకు చైనా, సింగపూర్​, జర్మనీ, థాయిలాండ్​, ఇటలీ దేశాల్లో మంచి గిరాకీ ఉన్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ధోనీతో మాట్లాడాకే రెచ్చిపోయా!

గతేడాది జరిగిన ఐపీఎల్​లో తాను బ్యాటింగ్​లో రాణించడానికి కారణం కెప్టెన్ ధోనీ అని అంటున్నాడు సీఎస్​కే బ్యాట్స్​మన్​ రుతురాజ్​ గైక్వాడ్​. ధోనీతో మాట్లాడిన తర్వాతే తాను స్వేచ్ఛగా బ్యాటింగ్​ చేశానని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అభిమానులు​ గర్వపడేలా చేస్తా

అందరిలా తనకోసం అభిమానులు కటౌట్లు కట్టడం.. పాలాభిషేకాలు చేయడం అవసరం లేదని అంటున్నారు కథానాయకుడు నాని. హీరోగా తన ఫ్యాన్స్​ గర్వపడేలా ప్రతిరోజూ కష్టపడుతూనే ఉంటానని.. 'టక్​ జగదీష్'​ పరిచయ వేడుక కార్యక్రమంలో ఆయన వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.