ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 9AM - telangana top news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-ten-news-in-telangana-today-till-now
టాప్​టెన్ న్యూస్ @ 9AM
author img

By

Published : Mar 16, 2021, 8:58 AM IST

  • వారి మృతికి నేడు శాసనసభ సంతాపం

మాజీ ఎమ్మెల్యేల మృతికి శాసనసభ ఇవాళ సంతాపం ప్రకటించనుంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ మొదటి రోజు సమావేశం కానుంది. ఈరోజు కేవలం సంతాపాలకు మాత్రమే సభ పరిమితం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కరోనా చావలేదు..

భయమొద్దు. అలాగని అలసత్వం పనికిరాదు. నిబ్బరం కావాలి గానీ నిర్లక్ష్యం తగదు. కరోనా జబ్బు విషయంలో ఇప్పుడిలాంటి విజ్ఞతే అవసరం. మహా సునామీ నుంచి బయటపడినా ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. విదేశాల్లో మాదిరిగా మనదగ్గరా మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జాగ్రత్త పడకపోతే కుదుట పడిన పరిస్థితి దిగజారటం ఖాయం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మండలాల్లోనూ టీకాలు..

కరోనా వ్యాక్సిన్ పంపిణీని ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యంలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రులు కలిపి మొత్తంగా 225 దవాఖానాల్లో.. ప్రైవేటులో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అనుసంధానంగా ఉన్న 179 ఆసుపత్రుల్లో కొవిడ్‌ టీకాలను ఇస్తుండగా.. వీటి పరిధిని మరింత విస్తరించాలని సర్కారు తీర్మానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బాప్ ​రేవ్

రేవ్ పార్టీ సంస్కృతి తెలంగాణలో పేట్రేగిపోతోంది. ఎక్కువగా యువత ఈ కల్చర్​కు ఆకర్షితులవుతూ భవిష్యత్​ను నాశనం చేసుకుంటున్నారు. ఎంజాయ్ పేరుతో మత్తులో జోగుతున్నారు. నగరం నుంచి శివార్లకు పాకిన కల్చర్​పై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూనే ఉన్నా... ఎక్కడో ఓచోట భయటపడుతూనే ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పెరిగిన తాజ్​మహల్ టిక్కెట్​ ధర!

ప్రపంచ ప్రఖ్యాత ప్రేమసౌధం తాజ్​మహల్​ సందర్శన మరింత ప్రియం కానుంది. సందర్శకుల టికెట్టు ధర పెంచాలని నిర్ణయించింది ఆగ్రా డెవలప్​మెంట్ అథారిటీ. స్వదేశీ పర్యటకులపై రూ.30, విదేశీ పర్యటకుల టిక్కెట్టుపై రూ. 100 ధర పెంచుతున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మునుగుతున్న ఊళ్లు

గతేడాది హైదరాబాద్​ నగరంలో ముంచెత్తిన భారీ వరదలకు దురాక్రమణలే ప్రధాన కారణమని నీతి ఆయోగ్​ సమర్పించిన నివేదికలో వెల్లడైంది. చెరువుల పూర్తి నీటిమట్టం (ఎఫ్‌టీఎల్‌) పరిధిలోని అక్రమ నిర్మాణాలను గుర్తించి తొలగించడంలో నిర్లక్ష్యం వహించడం, ఏళ్లకొద్ది పూడిక తీయకపోవడం, మూసుకుపోయిన తూములను తెరవకపోవడం, గొలుసుకట్టు నాలాలు ఆక్రమణల తరహా మానవ తప్పిదాల వల్లే వరదల వంటి విపత్తులు తలెత్తుతున్నాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పెరుగుతున్న దూరం

సంస్కృతీ సంప్రదాయాల్లో అనేక సారూప్యతలున్న రష్యా-భారత్​ల మధ్య దూరం పెరుగుతోంది. ఆ దేశం పాకిస్థాన్​తో జట్టుకట్టడం భారత్​కు కలవరపాటుగా మారింది. అఫ్గానిస్థాన్‌ శాంతి చర్చల్లో భారత్‌ పాత్ర లేకుండా రష్యా దారులు మూసివేసిందనే ప్రచారానికి అంతర్జాతీయ మాధ్యమాలు తెరతీశాయి. అసలు ఇందుకు కారణమేంటి? అమెరికా విధానాలు భారత్​-రష్యాల సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రుణాలు పెరుగుతున్నాయ్‌

ప్రస్తుతం ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థపై యాక్సిస్​ బ్యాంక్​ సీఈఓ అమితాబ్ ఛౌద్రి 'ఈనాడు'తో ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కొన్ని నెలలుగా ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుండటం వల్ల యాక్సిస్​ బ్యాంక్​ వృద్ధి సాధిస్తోందని తెలిపారు. అనేక రంగాల్లో ఉత్పత్తి సామర్థ్యం పెంచే ప్రతిపాదనలు బడ్జెట్‌లో ఉన్నందున, రుణాలకు గిరాకీ మరింత పెరగొచ్చని అంచనా వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఇంకా పిల్లాడే

భారత ప్రొ బాక్సర్ విజేందర్ త్వరలోనే మళ్లీ బౌట్​లో అడుగుపెట్టనున్నాడు. మార్చి 19న ఆర్టిష్ లాప్సన్​తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఈ మ్యాచ్​కు ముందు ఇరువురు తమ నోటికి పనిచెబుతున్నారు. ఒకరినొకరు కవ్వించుకుంటూ మాట్లాడుతున్నారు. తన ప్రత్యర్థి ఆర్టిష్ పొడగరే అయినా తనముందు ఇంకా పిల్లాడేనని విజేందర్ అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'జగడం' రీమేక్ !

రామ్-సుకుమార్ కాంబినేషన్​లో వచ్చిన 'జగడం' సినిమా 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆనాటి విశేషాల్ని సుకుమార్ పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.