- భారత్ @ 26,291
దేశంలో ఒక్కరోజే 26 వేల 291 మంది కరోనా బారినపడ్డారు. మరో 118 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య లక్షా వేల కు చేరింది. కొవిడ్ బారినపడిన వారిలో మరో 17 వేల 450 మందికిపైగా కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- తెలంగాణ @ 157
తెలంగాణలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. రాష్ట్రంలో మరో 157 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి మరొకరు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఓటరు జాబితాలో మోదీ ఫొటో
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో ప్రధాని మోదీ ఫొటో దర్శనమిచ్చింది. ఓటర్ లిస్టులో వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం పరిధిలోని పులుసుమామిడి గ్రామానికి చెందిన దయాకర్ రెడ్డి పేరు వద్ద అతని ఫొటోకు బదులు ప్రధాని మోదీ ఫొటో ప్రింట్ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- వేసవిలో అగ్నిప్రమాదాలు
వేసవి వస్తూనే అగ్నిప్రమాదాలతో హడలెత్తిస్తుంటుంది. కొన్నిసార్లు ఆస్తి, ప్రాణ నష్టం భారీగా ఉంటోంది. చాలావరకు అగ్నిప్రమాదాలకు షార్ట్ సర్క్యూటే కారణమని చెబుతున్నారు. దుకాణాలు, గోడౌన్లతోపాటూ ఇటీవల అపార్ట్‌మెంట్లలోనూ ప్రమాదాలు పెరిగాయి. ఈ ప్రమాదాలకు గల కారణాలు, అవి సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ తనిఖీ అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కీలక ప్రకటన
2022 పంజాబ్ ఎన్నికల్లో జలాలాబాద్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్లు శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. ఆదివారం జలాలాబాద్‌లో నిర్వహించిన ర్యాలీలో ఈ విషయాన్ని వెల్లడించారు. అమరీందర్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- జలాశయంలో మునిగి
తమిళనాడులోని దిండిక్కల్ జిల్లాలో విషాదం జరిగింది. జలాశయంలో స్నానానికి అని వెళ్లిన ఐదుగురు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఐదుగురు సజీవదహనం
బిహార్‌లో ఆదివారం అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్న పిల్లలు సహా మొత్తం ఐదుగురు మృతిచెందారు. కిషన్‌గంజ్ జిల్లా సలాం కాలనీలో జరిగిన ఈ విషాద ఘటనలో తండ్రి సహా.. నలుగురు చిన్నారులు మృతి చెందారు. నూర్ ఆలం అనే వ్యక్తి ఇంటికి సమీపంలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయని.. సమీపంలోని మరో నాలుగు ఇళ్లు సైతం అగ్నికి ఆహుతయ్యాయని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అందరూ ఇష్టపడుతున్నారు'
క్వాడ్ కూటమి సమావేశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. భేటీ చాలా బాగా జరిగిందని తెలిపారు. కూటమిని ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నట్లు అనిపించిందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మార్కెట్లకు భారీ నష్టాలు
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. ప్రస్తుతం 500 పాయింట్ల నష్టంతో 50,280 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అమితాబ్ కంటికి శస్త్రచికిత్స
తన రెండో కంటికి సర్జరీ విజయవంతంగా జరిగిందని తెలిపారు బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు వెల్లడించారు. ఇటీవలే ఓ కంటికి ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి