- నేటి నుంచే రాష్ట్ర వార్షిక బడ్జెట్
శాసనసభ, మండలి నేటి నుంచి కొలువుదీరనున్నాయి. రాష్ట్ర వార్షిక పద్దు ఆమోదం కోసం ఉభయసభలు ఇవాళ్టి నుంచి సమావేశం కానున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ఇవాళ ప్రసంగిస్తారు. అనంతరం బడ్జెట్ సమావేశాల ఎజెండా ఖరారవుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రాష్ట్ర బడ్జెట్ సిద్ధం
చివరి త్రైమాసికం అంచనాలతో ఆశావహంగా రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతోంది. కరోనా కష్టకాలంలోనూ స్వల్ప ఆర్థికవృద్ధి నమోదైన నేపథ్యంలో రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ఇంకా బాగుంటుందని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అటు ప్రస్తుత కార్యక్రమాల అమలుతో పాటు హామీల అమలుకు కేటాయింపులు ఉండనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అమ్మకానికి విమానాశ్రయం
పలు సంస్థల్లో ఉన్న పెట్టుబడులను ఉపసంహరించుకుని రెండున్నర లక్షల కోట్లు సమీకరించాలన్న కేంద్ర సర్కారు నిర్ణయంలో భాగంగా... ప్రస్తుతం విమానాశ్రయాలపై దృష్టి సారించింది. హైదరాబాద్‌తో పాటు దిల్లీ, ముంబయి, బెంగళూరు విమానాశ్రయాల్లో ప్రభుత్వానికి మిగిలిఉన్న వాటాను విక్రయించబోతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కట్టెలమ్ముతున్న కామ్రేడ్లు!
మూడు దశాబ్దాల పాటు ఏకధాటిగా బంగాల్‌ను పాలించిన చరిత్ర కామ్రేడ్లది. రాష్ట్రవ్యాప్తంగా బలమైన క్యాడర్, దిగ్గజ నేతల నాయకత్వం, ప్రజల విశ్వాసం... వారిని అధికారంలో అందలం ఎక్కించాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రోజురోజుకూ వీరి పరిస్థితి తీసికట్టుగా తయారవుతోంది. మరి ఈ సారి ఎన్నికల్లో వీరి ప్రభావం ఎంత? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- నేడు, రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె
ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ బ్యాంక్ సంఘాలు జాతీయస్థాయి సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా రెండురోజుల పాటు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి. సమ్మెలో పది లక్షల మంది ఉద్యోగులు పాల్గొననున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అమ్మకం కాదు.. అప్పగింతే!
1970వ దశకం నాటి విలువకే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడానికి కేంద్రం సిద్ధం కావడం ఆశ్చర్యకరం. ఇప్పటికే సుమారు 38వేల మంది శాశ్వత, ఒప్పంద ఉద్యోగులున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తక్కువ ధరకు విక్రయించి ఎంత అదనపు పెట్టుబడులు ఆయా కొనుగోలుదారులు తీసుకురాబోతున్నారు? కొత్తగా ఎన్ని వేల ఉద్యోగాలు కల్పించబోతున్నారు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఇష్టారాజ్యం
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధ్యుక్త ధర్మ నిర్వాహకుడైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు రాజ్యాంగం ప్రసాదించిన స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసే దుర్రాజకీయాలకు పాల్పడటం ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైంది. అలాంటి నైతిక నిష్ఠాగరిష్ఠుల్ని ఎంపిక చేసేందుకు ప్రత్యేక యంత్రాంగమే కొరవడిన దేశంలో- అధికార పార్టీ ఇష్టాయిష్టాలే కొలబద్దగా ఎన్నికల సంఘాల్లో అస్మదీయులు తిష్ఠవేసే ధోరణి పాతుకుపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మయన్మార్‌లో హింసాకాండ
మయన్మార్‌లో హింస రోజురోజుకు పెరిగిపోతోంది. భద్రతా దళాల చేతిలో మరో 38 మంది మరణించారు. ఇప్పటివరకు 2,156 మందిని బలగాలు అరెస్టు చేశాయి. అందులో 1,837 మంది ఇప్పటికీ నిర్బంధంలోనే ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఈ అవార్డు ఆయనకే అంకితం
అరంగేట్రం మ్యాచ్‌లోనే 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుపొందిన టీమ్ఇండియా యువ కెరటం ఇషాన్ కిషన్.. దానిని తన చిన్ననాటి కోచ్ తండ్రికి అంకితమిచ్చాడు. కనీసం ఓ 50 పరుగులు తన తండ్రి కోసం చేయాలని కోచ్ కోరినట్లు ఇషాన్ గుర్తు చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 'శ్రీకారం' అలా పుట్టింది
పుట్టి పెరిగిన ఊరు, తన చుట్టూ పరిస్థితులు నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథే 'శ్రీకారం' అని అన్నారు ఈ చిత్ర దర్శకుడు కిషోర్.బి. ఈ చిత్రం థియేటర్లలోకి రావడానికి దాదాపు నాలుగేళ్లు పట్టిందని చెప్పారు. ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా తన కెరీర్ సహా చిత్రం గురించి పలు విశేషాలను కిషోర్ పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి