ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 1PM - telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news in telangana today till now
టాప్​టెన్ న్యూస్ @ 1PM
author img

By

Published : Mar 14, 2021, 12:58 PM IST

  • భాజపా ఆట మొదలెడితే..

తెరాస ప్రభుత్వం.. ఇచ్చిన హామీలు మరిచి కేంద్రంపై విమర్శలు చేస్తే చేతులు ముడుచుకుని కూర్చోమని... కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా... కేంద్రాన్ని విమర్శించడం తెరాస నాయకులకు అలవాటైందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కేసీఆర్​ను కలవలేదు...

సీఎం కేసీఆర్​ను తాను కలిశానని వస్తున్న వార్తలు అవాస్తవమని తెజస అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. పట్టభద్రులెవరూ దుష్ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెరాస-వామపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణ

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలోని పోలింగ్ బూత్​ వద్ద తెరాస-వామపక్ష కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కేసీఆర్​కూ ఓటమి తప్పదు

వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మహబూబ్​నగర్- హైదరాబాద్​- రంగారెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెరాస అభ్యర్థి నాలుగో స్థానంలో ఉండబోతుందని చిన్నారెడ్డి జోస్యం చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • యువకుడిపై అత్యాచారం

యువకుడిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్​లో లైంగికంగా దాడి చేశాడు. ఈ విషయంపై బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • జవాన్​ హనీట్రాప్

పాక్​కు సమాచారం చేరవేస్తున్న సైన్యానికి చెందిన ఓ జవాన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ జవాను.. హనీ ట్రాప్​లో చిక్కుకున్నాడని పోలీసులు తెలిపారు. సైన్యానికి చెందిన రహస్య సమాచారాన్ని ఫేస్​బుక్​లో పంపినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆ కేసు సీబీఐకి బదిలీ

ఆర్మీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసును సీబీఐకి బదిలీ చేయనున్నట్లు సైన్యం ప్రకటించింది. ఎంపిక కేంద్రాల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న అంశం బయటపడిన నేపథ్యంలో అప్రమత్తమైన సైన్యం ఈ మేరకు చర్యలు చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మార్కెట్లకు అవే కీలకం!

కీలక వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ నిర్ణయాలు, దేశీయంగా స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, ముడి చమురు ధరల్లో వృద్ధి వంటి అంశాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధాన అంశాలుగా ఉండనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కోహ్లీకి ఏమైంది?

ఛేదన రారాజు'కు ఏమైంది? పరుగుల యంత్రానికి ఏమైంది? మునుపట్లా పరుగులు ఎందుకు చేయడం లేదు? శతకాల మోత ఎందుకు మోగించడం లేదు? నాయకత్వం అతడికి భారంగా మారిందా? ఒత్తిడికి గురవుతున్నాడా? మానసికంగా తాజాగా లేడా? శారీరకంగా అలసిపోయాడా? బుడగలు దుష్ప్రభావం చూపిస్తున్నాయా? ఇవీ.. టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ పదేపదే డకౌట్‌ అవుతుండటం వల్ల అభిమానుల్లో కలుగుతున్న సందేహాలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఎంసీ షేర్​కు కరోనా

'గల్లీబాయ్'​ ఫేమ్​ సిద్ధాంత్​ చతుర్వేదికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రస్తుతం స్వీయనిర్బంధంలో ఉన్నట్లు సోషల్​మీడియాలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.