- పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ షురూ!
రాష్ట్రంలో రెండు పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అభ్యర్థుల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో దినపత్రిక పరిమాణంలో ఉన్న బ్యాలెట్ పత్రాల ఉపయోగిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఓటేసిన మంత్రులు
రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్, మహబూబ్‌నగర్‌లో పర్యటక, ఆబ్కారీ శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఆటోను ఢీకొన్న లారీ..
ఏపీలోని కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో-లారీ ఢీకొని ఆరుగురు దుర్మరణం చెందారు. నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒడిశా రమేష్, భూక్య నాగరాజు, బాణావతు స్వనా, భూక్య సోమ్లా, బర్మావత్ బేబీ, బాణావతు నాగు ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- తిరుగుబాటు దళ నాయకుడు
నిషేధిత తిరుగుబాటు దళ నాయకుడు పరిమాళ్ దెబ్బర్మను ఐజ్వాల్‌లో అరెస్టు చేసినట్లు త్రిపుర డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కశ్మీర్లో ఎన్కౌంటర్
జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలకు, ముష్కరులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం 21 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. కన్యాకుమారి లోక్‌సభ స్థానానికి ప్రముఖ విద్యావేత్త వీ విజయ్‌కుమార్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- చైనాలో 100 కోట్ల మందికి టీకాలు?
ఏడాదిలోగా చైనా కనీసం 100కోట్ల మంది పౌరులకు కరోనా టీకాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు అతిపెద్ద సామూహిక వ్యాధి నివారణ కార్యక్రమ నిర్వహణలో ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని భావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- చిన్న కార్లకు మళ్లీ గిరాకీ!
భారత ఆటోమొబైల్ మార్కెట్లో కియా కార్లకు గొప్ప ఆదరణ లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పిన యూనిట్ ద్వారా దేశీయ మార్కెట్లో విక్రయించడం సహా 70 దేశాలకు ఎగుమతి చేస్తోంది. సొంత వాహనాల్లో ప్రయాణించాలన్న వినియోదారుల ఆలోచనే వాహన రంగం పుంజుకోవడానికి కారణమని కియా మోటార్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టే-జిన్ పార్క్ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- డకౌట్ ట్వీట్‌తో అభిమానుల ఆగ్రహం..
డ్రైవింగ్‌పై అవగాహన కోసం టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్‌ను ఉపయోగించి ఉత్తరాఖండ్ పోలీసులు చేసిన ట్వీట్‌పై వివాదం చెలరేగింది. దీంతో ఆ పోస్ట్‌పై అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆ ట్వీట్ డిలీట్ చేయకతప్పలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఎవరీ 'సారంగ దరియా'!
పల్లెపడుచుకూ, పల్లెపాటకూ పట్టిన హారతి ఇది. పంటచేలలో పుట్టిన అనామక జానపదం ఓ సినీ గేయకావ్యంగా మారిన అరుదైన సందర్భాల్లో ఇదీ ఒకటి. మామూలుగానే తెలుగు పల్లెపాటలు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తుంటాయి. దానికి సినిమా సొబగులూ తోడైతే చెప్పాలా! అందుకే 'సారంగ దరియా' పాట విడుదలైన నాలుగురోజుల్లోనే రెండుకోట్ల వీక్షణలు దాటి రికార్డులకెక్కింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి