- మోదీకి కరోనా టీకా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా టీకా తీసుకున్నారు. దిల్లీలోని ఎయిమ్స్‌లో తొలి డోసును వేయించుకున్నారు. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను ప్రధాని స్వీకరించారు. పుదుచ్చేరికి చెందిన నర్సు పీ నివేద సిరంజీ ద్వారా మోదీకి టీకా అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రేపటితో ఏడాది
యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్ మహమ్మారి తొలి కేసు రాష్ట్రంలో నమోదై రేపటితో ఏడాది పూర్తి కావస్తోంది. కొవిడ్ నిబంధనల మధ్య ఈ సంవత్సర కాలం ఎన్నో చేదు అనుభవాలతో గడిచిపోయింది. ఎన్నో స్వీయ రక్షణ ఏర్పాట్లను మానవాళికి పరిచయం చేసింది. శాస్త్రవేత్తల కృషితో మహమ్మారికి టీకాను సాధించాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మూడో ముప్పు తప్పదు!
జాగ్రత్తలు పాటించకపోతే కరోనా వైరస్ నుంచి మరోసారి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో దశ వ్యాప్తి రాకుండా ఉండాలంటే మాస్కులు, భౌతికదూరం, వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే.. దేశం ఇప్పటివరకు ఎదుర్కొన్న సవాళ్ల కంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తే అవకాశముందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పూర్వవైభవం
రెండు దశాబ్దాలకు పైగా రైతుల కష్టాలు తీరేలా కీలక ఘట్టానికి నాందిపడింది. 22ఏళ్ల తర్వాత తొలిసారిగా రామగుండం ఎరువుల కర్మాగారం పునః ప్రారంభం దిశగా ముందడుగుపడింది. ట్రయల్‌రన్ విజయవంతంతో ఆధునిక హంగులతో కర్మాగారం ఉత్పత్తికి సిద్ధమైంది. మార్చి నెలాఖరులోగా వాణిజ్య ఉత్పత్తి చేపట్టేందుకు వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- గెలుపు మనదే
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు పల్లా రాజేశ్వరరెడ్డి, సురభి వాణీదేవి... ఘన విజయం సాధిస్తారని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. మిగిలిన స్థానాల కోసమే ఇతర పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల కోసం పార్టీ నమోదు చేసిన ఓట్లన్నీ కచ్చితంగా పార్టీకే వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- సీట్ల సర్దుబాటుపై 'హస్తం' కుస్తీ
నాలుగు రాష్టాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనున్న ఎన్నికలలో విజయం సాధించి తీరాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. కేంద్రంపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసివస్తుందని అంచనా వేసుకుంటోంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఉన్న ప్రధాన సమస్య సీట్ల సర్దుబాటు. కేరళ మినహా ఇతర ప్రాంతాల్లో ఎదురవుతున్న ఈ సమస్యను కాంగ్రెస్ ఎలా పరిష్కరించుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- సిలిండర్ ధర పెంపు
వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకున్నాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. తాజా పెంపుతో ఒక్కో సిలిండర్ ధర రూ.1,614 వద్దకు చేరింది. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అదే నా కల
భారత్, పాకిస్థాన్‌లో ప్రజలు శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నారని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ చెప్పారు. రెండు దేశాలూ నిజమైన స్నేహితుల్లా మారితే చూడాలన్నదే తన కల అని ఉద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మైదానంలో మాణిక్యాలు
ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వాళ్ల గ్రామాలున్నాయి.. అయితేనేం తమ ప్రతిభతో వెలుగులోకి వస్తున్నారు. వాళ్లవి పేద కుటుంబాలే.. అయితేనేం ప్రతిభ, నైపుణ్యాలనే ఆస్తి వాళ్ల సొంతం. వాటిని నమ్ముకుని అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. బీసీసీఐ ఇటీవల ప్రకటించిన సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ కోసం హైదరాబాద్ జట్టులో తొలిసారి స్థానం సంపాదించిన అంజలి, నిఖిత, అనిత, పార్వతిల స్ఫూర్తివంతమైన నేపథ్యంపై ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- బెల్లంకొండ హీరోయిన్ దిశానే!
హిందీ ఛత్రపతి రీమేక్‌లో హీరోయిన్గా దిశా పటానీనే ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి