ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 11AM - telangana top news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-ten-news-in-telangana-today-till-now
టాప్​టెన్ న్యూస్ @ 11AM
author img

By

Published : Feb 4, 2021, 11:00 AM IST

  • పెట్రో ధరలు పైపైకి...

ఫిబ్రవరిలో తొలిసారి ఇంధన ధరలు పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 37 పైసల చొప్పున పెరిగాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.86.65కు చేరుకోగా.. ముంబయిలో రూ.93.20కి పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సిలిండర్ మరింత భారం

దేశీయంగా ఎల్పీజీ ధరలు మరోసారి పెరిగాయి. సబ్సిడీ లేని సిలిండర్​ ధరపై రూ.25 పెంచింది ఇండియన్​ ఆయిల్​ సంస్థ. తాజా పెంపుతో.. దేశ రాజధాని దిల్లీలో ఒక్కో సిలిండర్​ ధర రూ.719కు ఎగబాకింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రైతుల వద్దకు విపక్ష నేతలు

రైతుల ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ 10 పార్టీలకు చెందిన 15 మంది ఎంపీలు దిల్లీ సరిహద్దుకు బయలుదేరారు. ఘాజీపూర్​ చేరుకున్న విపక్షనేతలను పోలీసులు అడ్డుకున్నారు. గాజీపూర్​ సరిహద్దులోపలికి ప్రవేశించకుండా బారికేడ్ల ముందు పోలీసులు ఏర్పాటు చేసిన మేకులను రైతులు తొలగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ప్రియాంక కాన్వాయ్​కు ప్రమాదం

కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాహనశ్రేణి ప్రమాదానికి గురైంది. ఈ ఘటన నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మరో 177 కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి నెమ్మదిగా తగ్గుతోంది. రాష్ట్రంలో తాజాగా మరో 177 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సీఎం సభలో ఫుడ్ పాయిజన్

అసోం కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని ఓ వైద్య కళాశాలలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో బిర్యానీ తిని 145 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్, ఆరోగ్య మంత్రి హిమంత్ బిశ్వ శర్మ హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తొమ్మిది దుకాణాల్లో చోరీ

వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పరిగి పట్టణంలోని తొమ్మిది దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. గంజిరోడ్డులోని అల్ మదీన నగల దుకాణంలో 20 కిలోల వెండి, 5 తులాల బంగారం దొంగిలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భారత్​కు మరో సవాల్!

మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో.. భారత విదేశాంగ విధానానికి సరికొత్త సవాలు ఎదురైంది. ఈశాన్యంలో సాయుధ తీవ్రవాదులతో పోరాడుతూ ఇటీవలి కాలంలో గణనీయ విజయాలు సాధించిన భారత్‌కు తాజా పరిణామం మరో సమస్యగా మారే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అప్పుడే.. కెప్టెన్​ మార్పు

పాకిస్థాన్​తో టెస్టు సిరీస్​ అనంతరం కెప్టెన్సీ మార్పు ఉంటుందని దక్షిణాఫ్రికా కోచ్​ మార్క్​ బౌచర్​ తెలిపాడు. ఈ అదనపు బాధ్యతలతో డికాక్​ బ్యాటింగ్​పై ప్రభావం పడుతుందని పేర్కొన్నాడు. త్వరలోనే మరో వ్యక్తిని కెప్టెన్​గా నియమిస్తామని స్పష్టం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రాజశేఖర్.. ఇకపై 'శేఖర్'!

కథానాయకుడు రాజశేఖర్ హీరోగా కొత్త చిత్రం ప్రకటన వచ్చింది. అలాగే మేఘా ఆకాశ్ హీరోయిన్​గా తెరకెక్కుతోన్న 'డియర్ మేఘ' ఫస్ట్​లుక్ విడుదలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.