- రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు
రాష్ట్ర బడ్జెట్ కసరత్తు వేగవంతం కానుంది. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే నిధులు, గ్రాంట్లపై స్పష్టత వచ్చింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసులతో.. రానున్న ఐదేళ్లకు రాష్ట్రానికి వచ్చే మొత్తం కూడా వెల్లడైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. ఇప్పటికే 10 నెలలు గడిచిన నేపథ్యంలో వాటిని బేరీజు వేసుకుంటూ బడ్జెట్ కసరత్తు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఆర్థిక సమాఖ్య భావనపై సమ్మెట
జీఎస్టీ రాకతో పన్ను రాబడులపై రాష్ట్రాల విచక్షణాధికార పరిధి కుంచించుకుపోగా- నిధులకోసం కేంద్రం ముందు మోరసాచక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. వచ్చే అయిదేళ్ల కాలావధిలో సంచిత నిధినుంచి భిన్న పద్దులకింద రాష్ట్రాలకు రూ.52 లక్షల 41వేల కోట్ల పైచిలుకు నిధులు అందుతాయని ఆర్థిక సంఘం ప్రకటిస్తున్నా- ఏకంగా లక్షా 80వేల కోట్ల రూపాయల గ్రాంటులపై కేంద్రం ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తుందట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 'పుర'పోరుకు సిద్ధం..
తెలంగాణలో మరో ఎన్నికల సమరం త్వరలో ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని రెండు నగరపాలక సంస్థలు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో వార్డుల పునర్విభజనకు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- నేడు 'తేజస్' కొనుగోలు ఒప్పందం
బెంగళూరులోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో నేడు 13వ ఏరోఇండియా-2021 ప్రదర్శన ప్రారంభం కానుంది. ఇదే వేదికగా.. తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- జైషే ఉగ్ర అనుచరులు అరెస్ట్
జమ్ముకశ్మీర్‌లో జైషే మహ్మద్ ముఠా కోసం పనిచేసే ఇద్దరు ఉగ్ర అనుచరులను అరెస్ట్ చేశారు పోలీసులు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అదే అసలు సమస్య
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు పలురకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. టీకా అందుకునేందుకు మాత్రం ఊహించినంత స్పందన కనబర్చకపోవడం గమనార్హం. వ్యాక్సిన్‌పై నెలకొన్న భయాందోళనలు వీడకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మెట్రో రైల్లో కొవిడ్ జాగ్రత్తలేవి?
మెట్రో రైల్లో కొవిడ్ జాగ్రత్తలు తీసుకోకపోవడంపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. స్టేషన్లలో ఏర్పాటు చేసిన డబ్బాల్లో శానిటైజర్ ఉండటం లేదు. థర్మల్ స్కానర్లు పనిచేయడం లేదు. కొన్ని నెలలు జాగ్రత్తలు తీసుకోవాలని ఒకపక్క ప్రభుత్వం, వైద్యులు చెబుతుంటే... ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నడుస్తున్న మెట్రోలో మాత్రం క్రమంగా ఒక్కోటి నీరుగారుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అమెజాన్ సీఈఓగా తప్పుకోనున్న జెఫ్ బెజోస్
ఈ ఏడాది చివరికల్లా సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్. ఆ తర్వాత.. ఆయన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతారు. నూతన సీఈఓగా అమెజాన్ వెబ్ సర్వీస్ హెడ్ ఆండీ జెస్సీ నియామకం కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- టాప్-20లోకి సాత్విక్-అశ్విని జోడీ
భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజు-అశ్విని పొన్నప్ప ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటారు. వీరు టాప్-20లోకి దూసుకెళ్లి కెరీర్లో అత్యుత్తమంగా 19వ ర్యాంకుకు చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- నేడే ఉప్పెన్ ట్రైలర్ ..
కొత్త సినిమా కబుర్లు మీ ముందుకొచ్చేశాయి. ఇందులో 'ఉప్పెన', 'చెక్' సినిమా ట్రైలర్, తమిళ నటుడు శింబు నటించిన 'మానాడు' టీజర్ విడుదల వివరాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలా.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి