ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్​ @ 1PM - telangana news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-ten-news-in-telangana-today-till-now
టాప్​టెన్ న్యూస్​ @ 1PM
author img

By

Published : Jan 18, 2021, 1:02 PM IST

  • కుమారుడికి నిప్పంటించిన తండ్రి

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీలో దారుణం జరిగింది. సరిగా చదవడం లేదని కోపంతో కుమారుడిపై తండ్రి టర్పెంటాయిల్​ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన బాలుణ్ని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • వ్యాక్సినేషన్‌ @ 2రోజు

రాష్ట్రంలో రెండో రోజు కొవిడ్‌ టీకా పంపిణీ కొనసాగుతోంది. ఇవాళ 184 కేంద్రాలను కొత్తగా నెలకొల్పారు. మొత్తం కేంద్రాల సంఖ్య 324కు పెరిగింది. ఒక్కో కేంద్రంలో 50 మంది చొప్పున 16,200 మంది వైద్యసిబ్బందికి టీకా వేయనున్నారు. మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రిలో సూపరింటెండెంట్ రాజు టీకా తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అఖిలప్రియకు బెయిల్​ వచ్చేనా?

అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్ న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్​పై కాసేపట్లో వాదనలు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మరో 50వేల మొక్కలు నాటుతాం

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ రిజర్వు ఫారెస్టులో సోమవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ మొక్కలు నాటారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత పథకంలో భాగంగా సంస్థ మొక్కల పెంపకాన్ని చేపట్టింది. అభివృద్ధి చేసిన ఫారెస్ట్‌ బ్లాక్‌ను మార్గదర్శి ఎండీ అటవీశాఖకు అప్పగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • టైర్ల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

తమిళనాడు గుమ్మిడిపూంది పారిశ్రామిక ప్రాంతంలోని టైర్ల కంపెనీలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పోలీసులదే తుది నిర్ణయం

జనవరి 26న రైతులు తల పెట్టిన ట్రాక్టర్​ ర్యాలీకి సంబంధించి నిర్ణయాధికారం దిల్లీ పోలీసులదేనని సుప్రీంకోర్టు తెలిపింది. శాంతి భద్రతలకు సంబధించిన విషయంలో ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ వారికుందని పేర్కొంది. దీనిపై తదుపరి విచారణ జనవరి 20న చేపడుతామని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సెప్టెంబర్​ నాటికి వయోజనులందరికీ టీకా

కొవిడ్​ వ్యాక్సినేషన్​ కార్యక్రమంలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది బ్రిటన్ ప్రభుత్వం. ఆ దేశంలోని వయోజనులందరికీ సెప్టెంబర్​ నాటికి టీకా మొదటి డోసు వేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కొత్త రకం వైరస్​ బారిన పడే వారి సంఖ్య నానాటికి అధికమవుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది బ్రిటన్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • శాంసంగ్‌ వైస్‌ ఛైర్మన్‌కు జైలు శిక్ష

అవినీతి కేసులో శాంసంగ్‌ వైస్‌ ఛైర్మన్‌ లీ జే యాంగ్‌కు రెండున్నరేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది సియోల్ హైకోర్టు. 2017లోనే ఐదేళ్ల జైలు శిక్ష విధించగా .. 2019 లో ఈ కేసుపై మరోసారి విచారణ జరిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆస్ట్రేలియన్​ ఓపెన్​కు కరోనా సెగ

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ను కరోనా కలవరపెడుతోంది. తాజాగా మరో కొవిడ్ కేసు బయటపడింది. దీంతో స్వీయ నిర్భందంలోకి వెళ్లిన ఆటగాళ్ల సంఖ్య 72కి చేరింది. టోర్నీ నిర్వహణకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కేసులు పెరగడం ఆందోళన రేకేత్తిస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నిర్మాత దొరస్వామికి సినీప్రముఖుల నివాళి

ప్రముఖ నిర్మాత వి.దొరస్వామి రాజు.. గుండెపోటుతో సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సోషల్​మీడియాలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.