ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 11AM - telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news, telangana news, telangana latest news
తెలంగాణ న్యూస్, తెలంగాణ టాప్ న్యూస్, తెలంగాణ అప్​డేట్స్
author img

By

Published : Apr 17, 2021, 10:58 AM IST

  • తెలంగాణ @ 4,446

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. రికార్డుస్థాయిలో రోజువారీ కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో మరో 4వేల 446 కొవిడ్‌ కేసులు వెలుగు చూడగా... 12 మరణాలు సంభవించాయి. దీంతో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 33,514కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భారత్ @ 2 లక్షల 34 వేలు

భారత్​లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. కొత్తగా 2,34,692 మందికి వైరస్ సోకగా.. 1,341 మంది మరణించారు. లక్షా 23 వేల మందికిపైగా వైరస్​ను జయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అందరికీ టీకా అందేదెప్పుడు?

జనాభాలో ప్రతి అయిదుగురిలో ముగ్గురికి టీకా వేస్తే సామూహిక రోగ నిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ) లభిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. భారతదేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి, వాడకాలను ఎన్నో రెట్లు పెంచితే కానీ, రెండో దశ కొవిడ్‌ విజృంభణకు పగ్గాలు వేయలేం. ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా టీకాలు వేగంగా అందుబాటులోకి రావడం లేదు. భారత్‌కు రోజుకు కోటి డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ కావలసి ఉండగా, అందులో సగం కూడా ఉత్పత్తి కావడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఉద్యమ స్థలాల్లో టీకా కేంద్రాలు

సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తున్న ప్రాంతాల్లో వ్యాక్సినేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంయుక్త కిసాన్​ మోర్చా(ఎస్​కేఎం) డిమాండ్​ చేసింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా రైతులు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భక్తులు పరిమితంగా ఉండాలి

కుంభమేళాలో పాల్గొనే భక్తుల సంఖ్య కొవిడ్ వ్యాప్తికి దారితీయకుండా లాంఛనప్రాయంగా ఉండాలని కోరారు ప్రధాని నరేంద్ర మోదీ. వైరస్​ బారిన పడిన సాధువుల ఆరోగ్య పరిస్థితుల గురించి జునా అఖాడా ఆచార్యులు స్వామి అవదేశానందగిరిని ఫోన్​లో అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సీతారాముల కల్యాణానికి వేళాయె

భద్రాద్రిలో ఈ నెల 21న జరిగే రామయ్య కల్యాణోత్సవానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. సాయంత్రం అర్చకులు అంకురార్పణ పూజలు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రౌల్​ క్యాస్ట్రో రాజీనామా

ఫిడేల్​ క్యాస్ట్రో సోదరుడు రౌల్​ క్యాస్ట్రో.. కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఎనిమిదవ కాంగ్రెస్​ సమావేశంలో ఆయన ఈ మేరకు ఓ ప్రకటన ఇచ్చారు. తన మిషన్​ పూర్తయిందని, మాతృభూమి భవిష్యత్​పై నమ్మకం కలిగిందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఈ లింక్‌ మీకూ వచ్చిందా?

వాట్సాప్‌ ఏం రంగులో ఉంటుంది అంటే.. ఆకుపచ్చ రంగులో అని టక్కున సమాధానం వచ్చేస్తుంది. అయితే కొన్నిసార్లు కొత్త రంగులో వాట్సాప్‌ వస్తోంది, వచ్చేసింది అంటూ కొన్ని లింక్‌లు కనిపిస్తూ ఉంటాయి. అవి నిజం కావు, వాట్సాప్‌కి వాటికీ సంబంధం లేదని గతంలో చాలామంది టెక్‌ నిపుణులు హెచ్చరించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. మరో ఫేక్‌ లింక్‌ ఇప్పుడు వాట్సాప్‌లో వైరల్‌ అవుతోంది కాబట్టి.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అందుకే దక్కలేదు!

బీసీసీఐ ఇటీవల ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల్లో భారత బౌలర్​ నటరాజన్​కు స్థానం దక్కలేదు. ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​లపై మంచి ప్రదర్శనలు చేసిన.. నట్టూకు మరి ఎందుకు కాంట్రాక్టు ఇవ్వలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఓటీటీలో 'సైనా'

బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి సైనా నెహ్వాల్​ జీవితకథ ఆధారంగా రూపొందిన చిత్రం 'సైనా'. పరిణీతి చోప్రా టైటిల్​ పాత్ర పోషించింది. ఇటీవలే థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా త్వరలోనే అమెజాన్​ ప్రైమ్​లో అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.