ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news in telangana till now
టాప్​టెన్ న్యూస్ @11AM
author img

By

Published : Dec 28, 2020, 11:00 AM IST

  • దేశంలో కొత్తగా 20,021 కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కొవిడ్​-19 కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. తాజాగా 20,021 కేసులు వెలుగుచూశాయి. బాధితుల సంఖ్య 1కోటి 2లక్షల 7వేల 871కి చేరింది. మరో 279 మంది మహమ్మారికి బలవ్వగా.. మరణాల సంఖ్య లక్షా 47వేల 901కి పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు నమోదైన కేసుల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఏపీలో కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌

దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో కొవిడ్-19 వాక్సినేషన్ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఇందు​లో భాగంగా... ఏపీలోని కృష్ణా జిల్లాలో ఐదు చోట్ల డ్రైరన్ ప్రారంభమైంది. రెండు రోజులపాటు ఈ డ్రైరన్ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నింగి.. నేల.. నీరు.. అన్నీ కలుషితమే

అక్కడ గాలి పీల్చలేం.. జలం తాగలేం.. అంతా కాలకూట విషమే. ఫార్మా, రసాయన పరిశ్రమల నుంచి వెలువడుతోన్న వ్యర్థాలు నేరుగా గాలి, నీళ్లలో కలిసిపోతున్నాయి. ఉక్కిరిబిక్కిరి చేసే ఘాటు వాసనల మధ్య 50వేలకు పైగా జనం ఏళ్ల తరబడి నివాసముంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బెంగళూరు కేంద్రంగా దా'రుణా'లు

కొవిడ్​ నేపథ్యంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే.. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని దా'రుణా'లకు ఒడిగట్టారు కొందరు వ్యక్తులు. ఈ నేపథ్యంలో 'ఇన్​స్టంట్' లోన్ యాప్ ద్వారా రుణాలిచ్చి ఘరానా మోసానికి పాల్పడుతున్న ముఠాలోని ముగ్గురిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భారత్​ వ్యూహాత్మక ప్రస్థానం

మానవ జీవన గతిని మార్చేసిన సంవత్సరం 2020. కరోనాతో పాటు మరెన్నో సంక్షోభాలకు నెలవైంది. ఓ వైపు కరోనా దెబ్బకు ప్రపంచమంతా విలవిలలాడుతూంటే సందట్లో సడేమియాలాగా చైనా తన పన్నాగాలకు మరింత పదును పెట్టింది. భారత సరిహద్దుల్లో అలజడులు సృష్టించి.. ఆక్రమణలకు పాల్పడటం వంటి వింత పోకడలతో అగ్రరాజ్యంగా ఎదిగేందుకు అడ్డదారులు తొక్కుతోంది. మరోవైపు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం, కరోనా టీకాపై ఆధిపత్యం సరేసరి. ఈ నేపథ్యంలో ప్రపంచ యవనికపై భారత్ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది.? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సంజయ్​ రౌత్ భార్యకు ఈడీ సమన్లు

శివసేన సీనియర్​ నేత సంజయ్​ రౌత్​ సతీమణికి ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​ సమన్లు జారీ చేసింది. పంజాబ్​, మహారాష్ట్ర కోపరేటివ్​ (పీఎంసీ) బ్యాంక్​ కుంభకోణం కేసులో ఆమెను అధికారులు ప్రశ్నించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అల్​బోర్స్ పర్వత శ్రేణుల్లో..

ఇరాన్​లోని అల్​బోర్స్​ పర్వత శ్రేణుల్లో శుక్రవారం దుర్ఘటన జరిగింది. ఉత్తర టెహ్రాన్​లోని ఈ ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడి 12మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మైదానాన్ని వీడిన ఉమేశ్ యాదవ్..

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా పేసర్ ఉమేశ్​ యాదవ్​కు గాయమైంది. దీంతో అతడు మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • డబ్బు కోసమే..

మలయాళి నటి షకీలా జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం 'షకీలా'. బాలీవుడ్ నటి రిచా చద్దా టైటిల్ రోల్ పోషించారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం విడుదలైంది. త్వరలో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి రిచా స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.