- నేటి నుంచి 'టీకా ఉత్సవ్'..
దేశవ్యాప్తంగా నేటి నుంచి నాలుగు రోజల పాటు టీకా ఉత్సవ్ జరగనుంది. అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు నిర్వహిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ముగ్గురు ముష్కరులు హతం..
జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శరవేగంగా సిద్ధమవుతోన్న యాదాద్రి..
నవనారసింహుని దివ్యక్షేత్రం పునఃప్రారంభానికి సిద్ధమవుతోంది. అద్భుత రూపాన్ని సంతరించుకొన్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనభాగ్యం వచ్చే నెలలో భక్తులకు కలిగే అవకాశం కనిపిస్తోంది. ఆలయ ప్రధాన పనులన్నీ తుదిదశలో ఉండగా... ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా మిగతా పనులను వడివడిగా పూర్తి చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉప ఎన్నిక ప్రచారంపై సీఎం ఆరా..
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి నోముల భగత్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తోడు దివంగత శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య తనయుడైన భగత్‌కు ఆదరణ వెల్లువెత్తుతోందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భార్య, అత్తను హత్య చేసిన అల్లుడు..
సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో దారుణం జరిగింది. నర్సింహా అనే వ్యక్తి భార్య స్వరూప, అత్త ఎల్లమ్మను హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎరువుల ధరలపై కేంద్రం కొత్త మెలిక..
ఎరువుల ధరలపై కేంద్రం మాట మార్చింది. పాత ధరలు ఇప్పుడు అందుబాటులో ఉన్న పాతస్టాక్ విక్రయాల వరకే పరిమితమని పేర్కొంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎరువుల లభ్యత, ధరల అంశాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తోందని ఎరువుల రసాయనాల శాఖ ప్రకటనలో వివిరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గూగుల్‌ను నమ్ముకుంటే.. వధువే మారిపోయింది..
ఇండోనేసియాలో ఓ కుటుంబానికి వింత అనుభవం ఎదురైంది. గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని పెళ్లింటి చిరునామా వెతుక్కుంటూ వెళ్లిన వరుడు మరో వధువు ఇంటికి వెళ్లాడు. పెళ్లి పీఠలెక్కాల్సిన సమయానికి విషయం తెలుసుకొని నాలుక్కరుచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రముఖ మోడల్‌పై అత్యాచారం..
బెంగళూరులో అమానవీయ ఘటన జరిగింది. మత్తుపదార్ధాలు కలిపిన పండ్లరసాన్ని తాగించి మోడల్‌పై స్నేహితునితో కలిసి అత్యాచారం చేశాడు ఆమె ప్రియుడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గ్యాప్ వస్తే ఏంటి.. ఫామ్ తగ్గలే..
గత ఐపీఎల్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా. చాలాకాలంగా బ్యాట్ పట్టకపోవడం వల్ల ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తాడో అన్న అనుమానాలు తలెత్తాయి. కానీ దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ధైర్యంగా విడుదల చేస్తున్నాం..
ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్ రెహ్మన్ నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం '99 సాంగ్స్'. ఏప్రిల్ 16న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రెహ్మన్ పలు విషయాలు పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.