విచారణకు డ్రగ్స్ కేసు
సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసును నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. ఎక్సైజ్ సిట్ సమర్పించిన అభియోగపత్రాలను విచారణకు అనుమతించింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో 30 మందిని అరెస్టు చేసి, 27 మందిని సిట్ విచారించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
విచారణ వాయిదా
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. రఘురామ దాఖలు చేసిన రిజాయిండర్‌పై లిఖితపూర్వక సమాధానం ఇస్తానన్న జగన్ అభ్యర్థనను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కొత్తగా 869 కేసులు
రాష్ట్రంలో కొత్తగా 869 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 8 మంది మృతిచెందారు. ప్రస్తుతం 13,052 యాక్టివ్ కేసులున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆకుపచ్చ తెలంగాణే ధ్యేయం
పచ్చదనం కోసం చేస్తున్న మూడో అతిపెద్ద మానవ ప్రయత్నం విజయవంతమై... తెలంగాణ రాష్ట్రం దేశానికి పాఠాలు చెప్పేలా ఎదగాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా ప్రభావం చూశాకా పిల్లలు, భవిష్యత్ తరాల కోసం మొక్కలు నాటి సంరక్షించాలన్న సోయి అందరికీ రావాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కేంద్రానికి నోటీసులు
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో బంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది సుప్రీంకోర్టు. రాష్ట్రపతి పాలనపై కేంద్రం తన వైఖరి వెల్లడించాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఏటా 24 కోట్లు.!
ఆగస్టు నుంచి తాము నెలకు కోటి కొవిడ్ టీకా డోసులు ఉత్పత్తి చేస్తామని జైడస్ క్యాడిలా తెలిపింది. డిసెంబర్ నాటికి ఈ సంఖ్యను 5 కోట్లకు పెంచుతామని చెప్పింది. ప్రపంచంలో కరోనావైరస్‌పై తొలి డీఎన్‌ఏ టీకా తమదేనని పేర్కొంది. టీకాకు అనుమతులు వచ్చాక ఉత్పత్తిని ఏటా 24 కోట్ల డోసులకు పెంచాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వానలు దంచుతాయా?
జులై నెలలో నైరుతి రుతుపవనాల తీరుపై భారత వాతావరణ శాఖ అంచనాలు వెలువరించింది. ఈ నెలలో వర్షపాతం సాధారణంగానే ఉండొచ్చని పేర్కొంది. రెండో వారం తర్వాత వర్షాలు పుంజుకుంటాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వాటిలో నో ఛేంజ్
చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఉన్న వడ్డీ రేట్లే.. క్యూ2కు వర్తిస్తాయని తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వాన్‌పై ఫ్యాన్స్ ఫైర్
టీమ్ఇండియాపై మరోసారి విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్. కోహ్లీసేనను ఎగతాళి చేస్తున్నట్లు పోస్టు పెట్టాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రకాశ్‌రాజ్‌కు మద్దతు
తెలుగు నటీనటుల సంఘం అధ్యక్ష పదివికి పోటీ చేస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్‌కు పరోక్షంగా తన మద్దతును తెలిపారు ప్రముఖ నటుడు సుమన్. జాతీయ వైద్యుల దినోత్సవం(National Doctors' Day) సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుమన్.. 'మా' ఎన్నికల(MAA Elections)పై తన మనసులోని మాటను బయటపెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.