ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 7PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 7 PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 7PM
author img

By

Published : Jun 28, 2021, 6:59 PM IST

వరుసగా రెండో రోజు వెయ్యి లోపు కేసులు..

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. వరుసగా రెండో రోజు వెయ్యిలోపు నమోదయ్యాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1,12,982 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... 993 మంది వైరస్​ బారినపడినట్లు వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా మరో 9 మంది మరణించారు.

ఘనంగా పీవీ శత జయంతి

పీవీ శతజయంతి వేడుకలు సుసంపన్నం అయ్యాయి. వేడుకల ముగింపు కార్యక్రమానికి పీవీ జ్ఞానభూమి వేదికైంది. వందో జయంతి సందర్భంగా పీవీ నరసింహారావు కాంస్య విగ్రహం హుస్సేన్ సాగర్ తీరాన కొలువు తీరింది. గొప్ప సంస్కర్త అయిన నరసింహారావు రాజకీయాలకు అతీతంగా గౌరవించుకోదగ్గ వ్యక్తి అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. పీవీ తెలంగాణ ఠీవీ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్... ఆయనను ఎంత స్మరించుకున్నా తక్కువే అని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆన్​లైన్ తరగతులు​

జులై 1 నుంచి కేజీ టూ పీజీ విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. స్మార్ట్​ ఫోన్లు, ఇంటర్​నెట్​ సౌకర్యం లేనివారికి గతేడాది మాదిరిగానే.. దూరదర్శన్‌ యాదగిరి, టీశాట్‌ ద్వారా ఆన్‌లైన్‌ బోధన నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆయన అంత బిజీగా ఉన్నారా?

పీవీ శత జయంతి సందర్భంగా కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి, భాజపా సీనియర్​ నేతలు లక్ష్మణ్​, డీకే అరుణ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఉత్సవాలకు భాజపా నాయకులను ఆహ్వానించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీకి నివాళులర్పించేందుకు కాంగ్రెస్​ అగ్రనేతలకు కనీసం సమయం కూడా దొరకడం లేదని కిషన్​ రెడ్డి ధ్వజమెత్తారు. తెలుగు జాతి గర్వపడే వ్యక్తి అని కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు'

రాయలసీమ ప్రాజెక్టులపై తెలంగాణ మంత్రులు ఇష్టమెుచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్​కు చెందిన మంత్రి అనిల్ కుమార్(Minister Anil Kumar) ఆక్షేపించారు. వైఎస్​పై చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం సక్రమమే అన్న ఆయన.. తెలంగాణది అనవసర రాద్ధాంతమని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ట్విట్టర్​ కవ్వింపు చర్యలేనా?

నూతన ఐటీ నిబంధనల విషయంలో భారత ప్రభుత్వంతో.. వివాదాన్ని కొనసాగిస్తున్న ట్విట్టర్​.. సోమవారం మరో విపరీత చర్యకు పాల్పడింది. భారత్​లో అంతర్భాగమైన జమ్మకశ్మీర్​, లద్దాఖ్​ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా చూపించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య వ్యక్తిగత ఖాతాకు బ్లూటిక్ విషయంలో గందరగోళం, కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ ఖాతా తాత్కాలికంగా నిలిపివేత వంటి పరిణామాల నేపథ్యంలో ట్విట్టర్ తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వారికి సులువుగా రుణాలు.!

కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచేందుకు కేంద్రం మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ.. ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది కేంద్రం. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో వైద్య సౌకర్యాల అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మస్క్​ మహా రిస్క్​.!

గాలిలో తేలే కార్లు, డ్రైవర్​ రహిత వాహనాలు, అంగారకుడిపై జీవనం.. ఇవన్నీ ఎవరైనా కలగంటారు. కానీ ఎలాన్ మస్క్​ లాంటి వారే నిజం చేసుకునే దిశగా నిర్భయంగా అడుగులేస్తారు. ఆయన ఆలోచనలు, చేష్టలు ఊహాతీతం. అలాంటి మస్క్​ జీవితంలోని కొన్ని ఆసక్తికర విశేషాలు మీ కోసం..

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మాస్టర్​కు చేరువగా మిథాలీ

భారత మహిళల సారథి మిథాలీ రాజ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. సుదీర్ఘ కాలం క్రికెట్​ ఆడిన క్రికెటర్​గా సరికొత్త ఫీట్ సాధించింది. ఆదివారం ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​తో కెరీర్​లో 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈమె కంటే ముందు భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్​ తెందుల్కర్​ 22 ఏళ్ల 91 రోజుల పాటు ఆటలో కొనసాగాడు పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

బుల్లితెర టూ వెండితెర

దక్షిణాది చిత్రసీమలో స్టార్​డమ్​ దక్కించుకున్న నటులెందరో ఉన్నారు. అయితే అందులో కొంతమందికి సినిమాల్లో నటించే అవకాశం అంత తేలిగ్గా దక్కలేదు. కెరీర్​ ఆరంభంలో ఎంతో కష్టపడి తొలుత బుల్లితెరమీద మెరసి ఆ తర్వాత వెండితెరపై కనువిందు చేసే ఛాన్స్​ను దక్కించుకున్నారు. అలా తమలోని ప్రతిభను కనబరిచి తామేంటో నిరూపించుకున్నారు. వీరందరు తమ కెరీర్‌ను మలుచుకున్న తీరు ఎందరో నటులకు స్ఫూర్తిదాయకం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.