ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​@ 5PM - ts news in Telugu

ఇప్పటి వరకున్న ప్రధాన వార్తలు...

top ten news @ 5pm
top ten news @ 5pm
author img

By

Published : Sep 19, 2020, 4:58 PM IST

పార్లమెంట్​కు కరోనా ఎఫెక్ట్​...

పార్లమెంట్​ వర్షాకాల సామావేశాలు గడువు కంటే ఒక వారం ముందే ముగిసే అవకాశముంది. పులు కేంద్ర మంత్రులు, సిబ్బందికి కరోనా సోకడం వల్ల కేంద్రం ఈ విధంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నగరం మళ్లీ... జలమయం...

ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్​లో భారీ వర్షం కురిసింది. ఎటు చూసినా నీరే కనిపించేంతగా వాన కొట్టింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఇంకా ఏం చేద్దాం...

రాష్ట్రంలోని అన్ని జిల్లాల గిరిజన సంక్షేమ అధికారులు, ఐటీడీఏల పీఓలతో హైదరాబాద్ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి సత్యవతి రాఠోడ్​ సమావేశమయ్యారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న విషయమై అందరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అధికారులపై 'నాలా' కేసు...

మేడ్చల్​ జిల్లా నేరెడ్​మెట్​లోని దీనదయాళ్​ నగర్​లో నాలాలో పడి మృతి చెందిన చిన్నారి సుమేధ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ, ఇంజినీరింగ్​ అధికారుల మీద కేసు నమోదు చేయనున్నట్టు నేరెడ్​మెట్​ సీఐ లక్ష్మీ నరసింహస్వామి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అక్రమ బాంబుల అడ్డా...

పశ్చిమ్​ బంగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు గవర్నర్​ జగదీప్​ ధన్​ఖర్​​. రాష్ట్రంలో ఎన్​ఐఏ ఉగ్రవాదులు పట్టుబడిన అనంతరం.. 'బంగాల్​ అక్రమ బాంబుల తయారీకి అడ్డా'గా మారిందని ఆరోపించారు. దీదీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలే దీనికి కారణమని విమర్శించారు. ఎన్​ఐఏ ఇవాళ ఉదయం జరిపిన దాడుల్లో మొత్తం 9 మంది అల్​ఖైదా ఉగ్రవాదులు పట్టుబడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పుష్కరానికి పూసింది...

ఎన్నో వ్యాధులను నయం చేయగల ఔషధ గుణాలున్న ఓ మొక్క... 12ఏళ్ల తర్వాత మళ్లీ పుష్పించింది. చివరిసారిగా కేరళలో వికసించిన ఆ పుష్పాలు... తాజాగా మధ్యప్రదేశ్​లో దర్శనమిచ్చాయి. అప్పట్లోనే దీని గొప్పతనాన్ని తెలుసుకున్న ఓ యూరోపియన్‌ మహిళ.. ఆ మొక్క పేరిట ఓ ఆలయాన్ని నిర్మించినట్లు సమాచారం. ఆ మొక్క పేరేంటి?... పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మళ్లీ వస్తున్నాడటా...

పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​.. ఏడాది తర్వాత మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నారా? తమ పార్టీకి పునరుజ్జీవం పోసేందుకు కసరత్తు చేపట్టారా? అంటే అవుననే చెప్పాలి. అందులో భాగంగానే ఆయన ఆదివారం నిర్వహించే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి హారుకానున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కాల్పుల కలకలం...

అమెరికా న్యూయార్క్​ రాష్ట్రంలో అర్థరాత్రి కొందరు దుండగులు... స్థానికులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు. అయితే కాల్పులకు కారణం ఎవరనేది ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ మజా... ఈసారి మిస్​...

యూఏఈ వేదికగా నేటి నుంచి ఐపీఎల్ కొత్త సీజన్‌ ఆరంభం కానుంది. అభిమానులు లేకుండా మ్యాచ్‌లు జరగడటం క్రికెటర్లపై ప్రభావం చూపిస్తుందని క్రికెట్‌ విశ్లేషకులు సి.వెంకటేశ్‌ అభిప్రాయపడ్డారు. బోసిపోయిన స్టాండ్స్‌తో ఆటను చూడాలంటే అంతా మజా ఉండదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రాగిణి, సంజన జైల్లోనే...

శాండిల్​వుడ్​ డ్రగ్స్​ కేసులో అరెస్టయిన నటి రాగిణి, సంజనల బెయిల్​ అభ్యర్థనను ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. సెప్టెంబరు 21న తిరిగి విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో వీరిద్దరూ మరో రెండు రోజులు కారాగారంలోనే గడపాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.