- కీలక భేటీ..
ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు హాజరు కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పరిశీలిస్తున్నాం.. విరమించండి..
కరోనా కష్టకాలంలో జూడాలు చేపట్టిన సమ్మె సరైంది కాదని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగడాన్ని ఆయన తప్పుబట్టారు. సమ్మెను వెంటనే విరమించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పోరాటం పునరావృతం అవుద్ది..
'మానుకోట తిరుగుబాటుకు పదకొండు ఏళ్లు' పేరుతో సామాజిక మాధ్యమం వేదికగా తెజస చర్చాగోష్ఠి నిర్వహించింది. ఈ చర్చలో తెజస అధ్యక్షుడు కోదండరాం, మాజీమంత్రి ఈటల రాజేందర్, అద్ధంకి దయాకర్‌తో పాటు పలువురు జేఏసీ నేతలు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలి..
ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రహస్య తయారీ..!
ఏపీలోని కృష్ణపట్నం ఆనందయ్య మందు కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. పరిశోధనలు జరిగేవరకు ఆపాలన్న ఆదేశాలతో ఔషధ పంపిణీ నిలిచిపోయింది. అయితే.. ఆనందయ్యతో పాటు.. ఆయన శిష్యులు రహస్యంగా ఔషధాన్ని తయారు చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'యాస్' ఉగ్రరూపం..
బంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని తీరప్రాంతాల్లో యాస్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. నివాసిత ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఒడిశాలోని ధామ్రా వద్ద తుపాను తీరాన్ని తాకిందని ఐఎండీ తెలిపింది. మరికొద్ది గంటల్లో ఉత్తర ఒడిశా, బంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేటికీ ఆచరణీయం..
బుద్ధుని బోధనలు ప్రస్తుత పరిస్థితులకూ సరిపోతాయని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. బుద్ధుని జననం, జ్ఞానోదయానికి ప్రతీక అయిన బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బంగాల్లో 'యాస్' కల్లోలం..
యాస్ తుపాను ధాటికి బంగాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని నదులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డ్రా అయితే ఫలితం ఎలా?
మరి కొద్ది రోజుల్లో ప్రపంచటెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ప్రారంభంకానుంది. ఇందులో న్యూజిలాండ్, టీమ్ఇండియా తలపడనున్నాయి. మరి ఈ మ్యాచ్ డ్రా అయితే? ప్రస్తుతం అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. ఇరు జట్లనూ విజేతగా ప్రకటిస్తారా? లేదా ఫలితం వచ్చే వరకు ఆడిస్తారా? ప్రస్తుతానికి ఈ అంశంపై స్పష్టత లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హాలీవుడ్‌కు ప్రభాస్..
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హాలీవుడ్లో నటించనున్నాడంటూ వార్తలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. 'మిషన్ ఇంపాజిబుల్'లో డార్లింగ్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడని అంటున్నారు. తాజాగా ఈ విషయమై స్పందించాడు దర్శకుడు మెక్‌క్వారీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.