ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @3PM
TOP TEN NEWS @3PM
author img

By

Published : Apr 24, 2021, 2:59 PM IST

  • టీకాలు ఉచితంగానే..

కరోనా టీకాను అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే అందించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. బహిరంగ మార్కెట్లో ఒక్కో డోసు ఖరీదు రూ.400 ఉన్నప్పటికీ.. తాము సేకరించి అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు టీకా ధరలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరాం రమేశ్‌ ట్వీట్​పై స్పందించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు..

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యత చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అనుభవం దేశానికి ఎంతో ప్రయోజనకరమవుతుందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అదే ఉద్ధృతి..

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 7వేల మందికిపైగా వైరస్‌ సోకింది. కొవిడ్‌ కాటుకు మరో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీలక కేసులు 58వేలు దాటాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గాంధీలో కిషన్​రెడ్డి..

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్​లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. రాష్ట్ర మంత్రులు అనవసరంగా కేంద్రంపై ఆరోపణలు చేసున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వచ్చే కేసులు, మరణాలను బట్టి కేంద్రం కేటాయింపులు చేస్తోందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అమ్మో అరెస్టులా..

ఆర్థిక నేరాల్లో ఆరితేరిన ఓ నిందితుడిని ఇటీవల నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. రిమాండ్‌కు తరలించే ముందు చేసిన వైద్యపరీక్షల్లో అతడికి కొవిడ్‌ సోకినట్టు నిర్ధారణైంది. దీంతో అరెస్ట్‌ చేసిన బృందంలోని ఐదుగురు పోలీసుల్లో కలవరం మొదలైంది. మూడు రోజులుగా వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కరోనాను తొలుత జయించేది గ్రామాలే..

కరోనాను ముందుగా భారత్​లోని గ్రామీణ ప్రాంతాలే జయిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాల్లో మహమ్మారి ప్రబలకుండా అన్నిరకాలుగా ప్రయత్నించాలని కోరారు. గతేడాది సాధించిన అనుభవంతో కరోనాపై పోరాడాలని పంచాయతీలకు పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • జైపుర్ గోల్డెన్ ఆస్పత్రికి ఆక్సిజన్ ట్యాంకర్..

దిల్లీలోని జైపుర్ గోల్డెన్ ఆస్పత్రికి ఓ ఆక్సిజన్ ట్యాంకర్ చేరుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సుమారు 200 మంది కరోనా రోగులకు అత్యవసరంగా ఆక్సిజన్ అవసరమైన నేపథ్యంలో ఈ మేరకు కేంద్రం చర్యలు చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ప్రేమకు అడ్డొస్తున్నాడని..

కన్నడ నటి నయన.. తన ప్రేమకు అడ్డొస్తున్నాడని సోదరుడినే అతి కిరాతకంగా హత్య చేయించింది. ప్రస్తుతం ఈ విషయం కర్ణాటకలో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఎవరా నటి? ఏం జరిగింది? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కరోనాతో క్రికెటర్ తల్లి మృతి..

టీమ్ఇండియా మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి తల్లి చెవులాంబ కన్నుమూశారు. కరోనా కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బాలకృష్ణ యమస్పీడుగా!

కథానాయకుడు బాలకృష్ణ కూడా యువ హీరోల బాటలో వెళ్లాలని అనుకుంటున్నారు. ఒకేసారి రెండు సినిమాల్లో నటించి, వాటిని త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.