- 22 మంది జవాన్లు మృతి..
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో నక్సల్స్‌కు, భద్రతా సిబ్బందికి మధ్య శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన జవాన్ల సంఖ్య 22కు చేరింది. శనివారం ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. ఆదివారం మరో 17 మంది మృతదేహాలను గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాలికపై గ్యాంగ్ రేప్!
రాజస్థాన్‌లో ఓ బాలికపై సాముహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను ఎత్తుకెళ్లిన దుండగులు, విషాహారం ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బాధితురాలిని అడవిలో పడేసి వెళ్లారని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- క్యాంపస్‌లోనే అత్యాచారం..
ఐఐటీ గువాహటిలో ఓ విద్యార్థి.. తన తోటి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి.. అతడిపై కేసు నమోదు చేశామన్నారు. హోలీ సందర్భంగా క్యాంపస్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఈ దారుణానికి పాల్పడినట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రేపే ప్రారంభం..
హైదరాబాద్‌లో వాహనాల రద్దీని తగ్గించేందుకు పలు అండర్‌పాస్‌లు, పైవంతెనలు నిర్మించారు. ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు మరో ప్రాజెక్టు గ్రేటర్ వాసులకు అందుబాటులోకి రానుంది. రూ.66 .59 కోట్ల వ్యయంతో నిర్మించిన హైటెక్ సిటీ రైల్వే అండర్ బ్రిడ్జిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రేపు ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- యువకుడిపై కర్రలతో దాడి.. లైవ్ వీడియో..
ఓ సెటిల్మెంట్ వ్యవహారంలో తలెత్తిన వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గొడవలో ప్రశాంత్ అనే యువకుడిని మరో గ్యాంగ్ కర్రతలో చితకబాదారు. ఈ ఘటన సైదాబాద్ ఠాణా పరిధి సింగరేణి కాలనీలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పురుగుల మెరుపు దాడి..
కరీంనగర్ జిల్లా కాకతీయ కాల్వ వంతెనపై పురుగులను చూసి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఫలితంగా కరీంనగర్- హైదరాబాద్ రాజీవ్ రహదారిపై దిగువమానేరు జలాశయం వద్ద ప్రయాణం ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జి దాటాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- థియేటర్‌కి.. పాప్‌కార్న్‌కు సంబంధమేంటి?
థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తున్నామంటే.. చేతిలో పాప్‌కార్న్ తప్పనిసరిగా ఉండాల్సిందే. వాటిని తింటూ సినిమా చూస్తే ఉండే కిక్కే వేరు. అందుకే థియేటర్లో చిరుతిండ్లు ఎన్ని ఉన్నా పాప్‌కార్న్ కొనుగోలు చేయని ప్రేక్షకుడు ఉండడు. అంతలా పాపులరిటీ సంపాదించిన పాప్‌కార్న్ అసలు సినిమా థియేటర్లలో ముఖ్యమైన చిరుతిండిగా ఎలా మారింది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఓడ, పడవ ఢీ..
ఇండోనేషియాలో ఓ పడవ, కార్గోషిప్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 17 మంది ఆచూకీ గల్లంతైంది. జావా ద్వీపంలో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పంత్‌కే కెప్టెన్సీ ఎందుకు?
దిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయంతో లీగ్‌కు దూరమయ్యాడు. దీంతో జట్టులో సీనియర్లను కాదని సారథిగా యువ ఆటగాడు రిషభ్ పంత్‌కు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఉన్న కారణాలను ఓ సారి పరిశీలిద్దామా! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'బ్లాక్ విడో' ట్రైలర్.. 'రిపబ్లిక్' టీజర్..
కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'రిపబ్లిక్' టీజర్ రిలీజ్ అప్డేట్ సహా 'బ్లాక్ విడో' ట్రైలర్, 'వకీల్‌సాబ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ అప్డేట్లు ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.