- హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
కరోనాకు సంబంధించిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. కొవిడ్ పరీక్షల విషయంలో ప్రభుత్వ తీరుపై ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భాజపా వరాలు..
భాజపా తన గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. గ్రేటర్ ప్రజలపై హామీల వర్షం కురిపించింది. సామాన్యుడి సొంతింటి కలను నెరవేరుస్తామని.. 24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా, జీహెచ్ఎంసీలో 28 వేల కొత్త నియామకాలు, మూసీ పునరుజ్జీవం కోసం మూసీ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సత్తా ఉందా అని అడిగారు..
తెలంగాణ రాకముందు సొంత రాష్ట్రం నడుపుకునే సత్తా ఉందా అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారని రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరేళ్లలోనే 400 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన భాగ్యనగరాన్ని భారతదేశంలోనే అరుదైన నగరంగా తీర్చిదిద్దామని తెలిపారు. హైదరాబాద్ నిజాం క్లబ్లో జరిగిన 'విశ్వనగరంగా హైదరాబాద్' సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'భాజపా, ఎంఐఎంవి దొంగ నాటకాలు..'
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ భాజపా, ఎంఐఎం దొంగ నాటకాలు ఆడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో భాజపాకు మేలు చేసేందుకే ఓవైసీ సోదరులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్‌ను గెలిపించాలంటూ బంజారాహిల్స్ డివిజన్ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పరాయి పార్టీ నేతలపై ప్రేమ..
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దర్శకత్వంలో భాజపా, ఎంఐఎం నడుచుకుంటున్నాయని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. పీవీ, ఎన్టీఆర్ లాంటి మహానేతల పేర్లను భాజపా-ఎంఐఎంలు తుచ్ఛ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాష్పవాయువు ప్రయోగం..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ.. హరియాణాలోని అంబాలాలో రైతులు ఆందోళన చేపట్టారు. శంభు సరిహద్దు వద్ద రైతులు గుమిగూడి ధర్నా నిర్వహించగా.. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్‌కు అవసరం..
ముంబయిపై పాకిస్థానీ ఉగ్రవాదులు చేసిన దాడిని భారత్ ఎన్నటికీ మరువదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఉగ్రదాడుల్లో అమరులైనవారికి నివాళులు అర్పించారు. ప్రస్తుతం సరికొత్త పంథాలో ఉగ్రవాదంపై పోరాడుతున్నట్లు తెలిపారు. ప్రిసైడింగ్ అధికారుల 80వ సదస్సులో పాల్గొన్న ఆయన.. భారత్‌కు జమిలీ ఎన్నికల అవసరం ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సలహాదారును క్షమించిన ట్రంప్..
అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మాజీ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్‌ను క్షమించారు. క్షమాపణ ఉత్తర్వులపై సంతకాలు చేసిన ట్రంప్.. ఫ్లిన్, అతని కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆటో డ్రైవర్ సాయం..
ఈ సంవత్సరం మొదట్లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి సచిన్ చెప్పాడు. తనకు రహదారికి మార్గం చెప్పడంలో అతడు ఎలా సహాయపడ్డాడో వివరించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- క్రిస్మస్కు 'కూలీ నం.1'..
సినిమాల కొత్త అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో నాగార్జున 'వైల్డ్‌డాగ్', వరుణ్ ధావన్ 'కూలీ నం.1', నితిన్ 'రంగ్‌దే' చిత్రాలకు సంబంధించిన సమాచారం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.