ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @3PM - టాప్‌టెన్‌ న్యూస్‌ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @3PM
టాప్‌టెన్‌ న్యూస్‌ @3PM
author img

By

Published : Nov 9, 2020, 3:01 PM IST

  • సీఈసీ ఆరోడాపై సుప్రీంలో కేసు..

భారత ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ ఆరోడాపై దిల్లీకి చెందిన న్యాయవాది కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. అభ్యర్థుల నేర చరిత్రను బహిర్గతం చేయాలన్న సుప్రీం ఆదేశాలు పాటించలేదని.. ఆరోడా సహా పలువురు రాజకీయ నాయకులపై ఫిర్యాదు చేశారు. ఉల్లంఘనకు పాల్పడినవారిని శిక్షించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రాష్ట్రపతికి 15వ ఆర్థిక సంఘం తుది నివేదిక..

పదిహేనవ ఆర్థిక సంఘం తన తుది నివేదికను రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​కు అందించింది. 'కరోనా కాలంలో ఆర్థిక సంఘం' పేరుతో రూపొందించిన నివేదికను ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్​కే సింగ్ రాష్ట్రపతికి సమర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అధికారులకు ర్యాపిడ్​ పరీక్షలు..

హైదరాబాద్​ ప్రగతిభవన్​లో కరోనా ర్యాపిడ్​ పరీక్షలు నిర్వహించారు. సినీనటుడు చిరంజీవికి కరోనా పాజిటివ్​ వచ్చినందున ఈ పరీక్షలు చేపట్టినట్లు సమాచారం. రెండ్రోజుల క్రితం చిరంజీవి, నాగార్జున సీఎం కేసీఆర్​ను కలిసినందున సోమవారం ర్యాపిడ్​ పరీక్షలు హుటాహుటిన జరిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'మంత్రిగా కేటీఆర్ విఫలం..'

పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌పై భాజపా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని దిల్లీలో ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రోడ్లు, నాలాల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అక్రమాలు జరిగాయి..

హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఎంపీ రేవంత్​ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వరద బాధితులకు తక్షణ సాయం రూ.10 వేలు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • శరవేగంగా యాదాద్రి పనులు..

యాదాద్రి ఆలయ నిర్మాణాల పనులు సీఎం కేసీఆర్​ దిశానిర్దేశం మేరకు వేగంగా జరుగుతున్నాయి. భక్తుల బసకు.. నిత్యాన్నదానానికి వారి మొక్కల సమర్పణకు ఇలా అన్ని అవసరాలు తీర్చేందుకు గానూ గుట్టకింద ఉన్న గండిచర్లను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. ఈమేరకు కట్టడాలు భక్తి భావం ఉట్టిపడేలా నిర్మించేందుకు యాడా ప్రణాళికలను రూపొందిస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • హరిత మతాబులు వచ్చేశాయోచ్‌..

దీపావళి అంటే దీపాల పండగ... మధ్యలో ఈ కాలుష్యం పెంచే మతాబులెందుకు!’ - ఈ వాదన మనదగ్గర ఎప్పటి నుంచో ఉంది.‘దీపావళి నుంచి మతాబుల్ని మైనస్‌ చేస్తే, దానికీ కార్తీక పున్నమికీ తేడా ఏమిటీ?!’ - పై వాదనకి ఇది కౌంటర్‌! దేశంలోని ఈ రెండు తరహాల వాళ్లనీ సంతృప్తి పరిచే సరికొత్త పర్యావరణహిత మతాబులు వచ్చేశాయిప్పుడు. ఈసారి దీపావళికి మనమంతా ఈ ‘గ్రీన్‌ క్రాకర్స్‌’నే వాడబోతున్నాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • జన్మదిన వేడుకల్లో 'ఫలితాల' జోష్..

ఆర్​జేడీ నేత, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్​ 31వ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఘనంగా నిర్వహించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మహాకూటమికే అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు పట్నా వీధుల్లో సంబరాలు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ..

ఆస్ట్రేలియాలో జరిగే టెస్టు సిరీస్​లో మాత్రమే రోహిత్ శర్మ పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ఈ విషయమై త్వరలో స్పష్టత రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దుమ్ములేపడం మాత్రం పక్కా..

బాలీవుడ్​లోని కొన్ని సినిమాలు.. పలు కారణాల వల్ల ఏళ్ల తరబడి విడుదలకు నోచుకోలేదు. అనంతరం కొన్నేళ్లకు అన్ని అడ్డంకులు తొలిగి, ప్రేక్షకులు ముందుకొచ్చి విశేషాదరణ దక్కించుకున్నాయి. మరి ఆ చిత్రాలేంటి? ప్రజల ముందుకు ఎప్పడొచ్చాయి? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.