1.సీఎం పర్యటనకు భారీ బందోబస్తు
గల్వాన్ ఘటనలో అమరుడైన కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సూర్యాపేటకు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 650 మంది సిబ్బందితో సంతోష్‌బాబు ఇంటి పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం
ఉస్మానియా ఆస్పత్రిలో మరోసారి సిబ్బంది నిర్వాకం బయటపడింది. బతికిఉన్న మహిళ చనిపోయినట్లు కుటుంబసభ్యులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఒకే వయస్సులో ఉన్న ఇద్దరు మహిళలు చేరారు. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే..
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన తెలిపేందుకు గాంధీ ఆసుపత్రికి బయలుదేరిన లక్ష్మణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4.జీవన్‌రెడ్డి గృహ నిర్బంధం
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని సూరమ్మ జలాశయం పరిశీలనకు వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని జగిత్యాలలో పోలీసులు అడ్డుకున్నారు. తన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరు పట్ల జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పట్ల తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.భారత్-చైనా భేటీ.!
గల్వాన్ లోయ ఘటన అనంతరం పరిస్థితులను చక్కదిద్దేందుకు భారత్-చైనా సమావేశంకానుంది. వాస్తవాధీన రేఖ వెంట ఉన్న మోల్డో ప్రాంతంలో ఇరుదేశాల కమాండర్ స్థాయి అధికారులు భేటీకానున్నట్టు సమాచారం. గల్వాన్ లోయలో చైనా దుస్సాహసానికి పాల్పడి 20మంది భారత జవాన్లను పొట్టబెట్టుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6.పాక్‌కు దీటుగా జవాబు
జమ్ముకశ్మీర్‌లోని నౌషిరా సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాన్ అమరుడయ్యారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ భారత జవాన్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల పాక్ వరుసగా కవ్వింపు చర్యలకు దిగుతోంది. పాక్ చర్యలకు భారత సైనికులు దీటుగా సమాధానమిచ్చారు. సోమవారం తెల్లవారుజామున భారత్-పాక్ బలగాల మధ్య దాదాపు రెండు గంటలపాటు కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7.ఒక్కడిని కాపాడబోయి 8 మంది మృతి
చైనాలో హృదయ విదారక ఘటన జరిగింది. నదీతీర ప్రాంతంలో సరదాగా ఆడుకునేందుకు వెళ్లిన 8 మంది పాఠశాల చిన్నారులు.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. నదిలో పడిపోయిన స్నేహితుడిని కాపాడేందుకు ఏడుగురు విద్యార్థులు నీటిలోకి దూకేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8.ఉపాధి కోల్పోయిన 20 లక్షల మంది!
ప్రైవేట్ బస్సు, టూరిస్టు ట్యాక్సీ ఆపరేటర్లు కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయారు. లాక్‌డౌన్‌తో ఇప్పటికే దాదాపు 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారని బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. రానున్న రోజుల్లో ఇంకా చాలా మంది ఉపాధికి దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9.ఆ విషయంపై అవగాహన కల్పించాలి
జాతివివక్ష గురించి యువక్రికెటర్లకు అవగాహన పెంచాలని, తద్వారా ఆటగాళ్లందరిని సమానంగా చూసే ఆలోచన అలవడుతుందని చెప్పాడు విండీస్ మాజీ సారథి డారెన్ సామి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. వర్మను చూస్తే జాలేస్తోంది
రామ్ గోపాల్ వర్మని చూస్తే జాలేస్తోందని మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ప్రణయ్ హత్య’ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ‘ మర్డర్’ పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్, టైటిల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రణయ్-అమృతల ప్రేమ వ్యవహారం, ఆపై మారుతీరావు చేయించిన పరువు హత్య నేపథ్యంగా సినిమా తీయనున్నట్టు పోస్టర్ చూస్తే అర్థమౌతోంది. దీనిపై తాజాగా అమృత స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.