- కాంగ్రెస్ సమరం..
పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ సామర్థ్యం పెంపును నిరసిస్తూ గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల నిరసన దీక్ష చేపట్టారు. ఏపీ సర్కార్ నిర్ణయాన్ని అడ్డుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భాజపా గాంధీగిరి
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు నిరసనగా భాజపా నిరసనలు చేపట్టింది. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నాయకులు తమ తమ ఇళ్లలో దీక్షను కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం..
పోతిరెడ్డిపాడుపై జగన్ తలపెట్టిన ఎత్తిపోతల సామర్థ్యం పెంపు నిర్మాణం జరిగేదేమీ కాదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలో పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. నాడు పోతిరెడ్డిపాడుకు హారతులు పట్టిన నేతలే నేడు దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ముందస్తు జాగ్రత్తలు
ఈ వానాకాలం సీజన్‌లో కోటీ 35 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈనెలలోనే గరిష్ఠంగా యూరియా నిల్వలు పెట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏపీలో మరో 48
ఆంధ్రాలో కొవిడ్ కేసుల సంఖ్య 2137కు చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 48 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 24 గంటల్లో.. 3525 కేసులు
కరోనా మహమ్మారి దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 122 మంది వైరస్ బారిన పడి మరణించారు. కొత్తగా 3,525 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 74 వేలు దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సర్వత్రా ఉత్కంఠ
కరోనా కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు.. ప్రధాని మోదీ ప్రకటించిన 20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ విధి విధానాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు వెల్లడించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చరిత్ర మారుస్తుందా!
రుణ రహిత కంపెనీగా మారాలనే లక్ష్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.53,125 కోట్ల రైట్స్ ఇష్యూను ప్రకటించింది. రికార్డు తేదీని ఈనెల 14గా నిర్ణయించింది. రిలయన్స్ షేర్లు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రెండు గెలవాలి
వచ్చే మూడు ప్రపంచకప్‌ల్లో రెండింటిని గెలవాలని టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశాడు. వరల్డ్‌కప్ విజేతగా నిలిస్తే ఆ సంతోషం వేరేలా ఉంటుందని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆస్కార్ వాయిదా!
కరోనా సంక్షోభం కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా పడొచ్చని ప్రచారం జరుగుతోంది. అనేక హాలీవుడ్ చిత్రాల విడుదల వాయిదా పడటం వల్ల నామినేషన్లలో పరిమిత సినిమాలే ఉంటాయని నిర్వాహకులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.