- ఆగని మరణాలు..
దేశంలో మరోసారి నాలుగు వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి. 24 గంటల వ్యవధిలో 4,194 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా 2.57 లక్షల మందికి వైరస్ సోకిందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నిబంధనలు మరింత కఠినం..
ఉదయం 10 గంటల తర్వాత అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. నేటి నుంచి నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నామని స్పష్టం చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు..
కరోనాతో తీవ్రంగా బాధపడుతూ... ప్రాణవాయువు అవసరమైన వారికి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఆక్సిజన్‌ను అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరంలోని గాంధీ, కింగ్ కోఠీ, టిమ్స్, ఛాతీ అసుపత్రులకు... అవసరమైన ప్రాణవాయువును క్షణం కూడా ఆలస్యం కాకుండా... అందించేందుకు ఈ వ్యవస్థ అహర్నిశలు శ్రమిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బ్లాక్ ఫంగస్‌తో మరో వ్యక్తి..
కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. వికారాబాద్‌లో ఇటీవలె కరోనాను జయించిన ఓ వ్యక్తికి... బ్లాక్ ఫంగస్ సోకింది. పరిస్థితి విషమించి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వందో రోజుకు విశాఖ స్టీల్‌ప్లాంట్ దీక్షలు..
వాళ్లంతా ఆ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగులు. ఎప్పట్లాగే విధులు నిర్వహిస్తుండగా గుండెల్లో గుబులు పుట్టించే వార్త. ఆ సంస్థని ప్రైవేటీకరణ చేస్తామన్న కేంద్రం ప్రకటనతో కార్మికులు, ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు వందో రోజుకు చేరుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ ఔషధం భారీ ఉత్పత్తికి సన్నాహాలు!
డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 2-డీజీ కొవిడ్ ఔషధం.. ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ ఔషధాల తయారీకి మరో మూడు, నాలుగు సంస్థలకు అనుమతివ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కరోనా చికిత్సలో 2-డీజీ సత్ఫలితాలిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుందని చెప్పాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తొలి వైట్ ఫంగస్ కేసు..
వైట్ ఫంగస్ మరో రాష్ట్రంలోనూ వెలుగుచూసింది. మధ్యప్రదేశ్ జబల్పుర్లో ఓ వ్యక్తికి ఈ వ్యాధి నిర్ధరణ అయింది. బిహార్, హరియాణా, గుజరాత్ రాష్ట్రాల్లోనూ ఈ కేసులు బయటపడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్ విమానాలపై నిషేధం పొడిగింపు..
భారత్, పాకిస్థాన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని కెనడా మరో నెలరోజుల పాటు పొడిగించింది. ఈ రెండు దేశాలపై ప్రయాణాల నిషేధం విధించటం వల్ల సత్ఫలితాలు కనిపిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీమ్ఇండియా ప్రయోగం కొత్తేం కాదు!
ఒకేసారి రెండు వేర్వేరు సిరీస్‌ల కోసం వేర్వేరు జట్లను పంపించడం టీమ్ఇండియాకు కొత్తేం కాదు. త్వరలో శ్రీలంక, ఇంగ్లాండ్‌కు పర్యటనకు ఇలాగే రెండు జట్లు వెళ్లనున్నాయి. అయితే 1998లో ఇలాంటి ప్రయోగం చేసి విఫలమైన భారత్.. ఈసారి ఏం చేస్తుందో చూడాలి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సినీ ప్రముఖుల భావోద్వేగం..
ప్రముఖ నిర్మాత, పీఆర్వో బీఏ రాజు గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం చెందారు. దీంతో ఆయన మృతి పట్ల చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.