- ముూడో ముప్పు లేనట్లే..
భారత్‌లో కరోనా మూడో దశ వచ్చేందుకు అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఒకవేళ వచ్చినా రెండో ఉద్ధృతి అంత తీవ్రంగా ఉండకపోవచ్చని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సిద్ధంగా ఉండాలి..
కొవిడ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు.. ప్రభుత్వ గొప్ప ఆలోచన అని గవర్నర్ తమిళిసై అన్నారు. హైదరాబాద్ వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో ఉన్న కొవిడ్ కంట్రోల్ కేంద్రాన్ని గవర్నర్ పరిశీలించారు. రాష్ట్రంలో లక్ష్యం మేరకు టీకా కార్యక్రమం కొనసాగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శత జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు..
ఈనెల 28న పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆయన గురించి రాసిన 8 పుస్తకాలను ఈరోజే ప్రచురించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డెత్ గేమ్..
హైదరాబాద్ కూకట్పల్లి సంగీత్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. పబ్జీ గేమ్‌కు మరో ప్రాణం బలైపోయింది. పబ్జీ ఆడొద్దని తండ్రి మందలించడంతో 12 ఏళ్ల బాలుడు మణికంఠ మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తివేత..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం వెలువరించింది. ఏపీపీఎస్సీ(APPSC) పోటీపరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. గ్రూప్ 1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వూలు రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సమీక్షా సమయం..
అయోధ్య పట్టణ అభివృద్ధి ప్రణాళికపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నాారు. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డ్రగ్స్ తగలబెట్టిన సైన్యం!
ఐరాస అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం రోజే భారీ ఎత్తున డ్రగ్స్, రసాయనాలను మయన్మార్ సైన్యం సీజ్ చేసింది. వీటి విలువ దాదాపు రూ.5000 కోట్లు ఉంటుందని ప్రకటించింది. వీటిలో హెరాయిన్, గంజాయి, మెథాంఫేటమిన్, కెటామైన్ ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పిల్లలకు కొవాగ్జిన్ ఎప్పటి నుంచంటే..!
కరోనా మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం చూపుతుందనే వైద్యాధికారులు, శాస్త్రవేత్తల సూచనలతో వారి రక్షణకు చర్యలు చేపట్టింది. పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం, టీకా కంపెనీలు ప్రక్రియను వేగవంతం చేశాయి. భారత్ బయోటెక్ ఇప్పటికే కొవాగ్జిన్ ట్రయల్స్ ప్రారంభించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒలింపిక్స్‌కు కష్టమేనా?
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్ హిమదాస్ పాల్గొనేది అనుమానంగా కనపిస్తోంది. జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న సమయంలో ఆమెకు గాయం కావడమే కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చిన్న వయసులో మరణం..
చిన్నవయసులోనే స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్న లవర్‌బాయ్ ఉదయ్‌కిరణ్. శనివారం అతడి జయంతి. ఈ సందర్భంగా అతడిని గుర్తు చేసుకుంటున్న అభిమానులు.. ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇతడిలానే తక్కువ వయసులో పలు కారణాలతో మృతిచెంది, అభిమానులకు శోకాన్ని మిగిల్చిన తారలు ఎవరు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">