ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - ఈటీవీ భారత్​

top news
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
author img

By

Published : Oct 26, 2021, 5:58 AM IST

Updated : Oct 26, 2021, 9:59 PM IST

21:55 October 26

టాప్​న్యూస్​@ 10 PM

  • ప్రియురాలి ఇళ్లు కాల్చేసిన ప్రేమికుడు..!

ప్రేమిస్తున్నానంటూ.. రెండేళ్లుగా యువతి వెంట పడుతున్నాడు. ప్రియురాలు మాత్రం అతడి ప్రేమకు పచ్చ జెండా ఊపట్లేదు. అంతలోనే.. అమ్మాయి ఇంట్లో వాళ్లు వేరొకరితో పెళ్లి నిశ్చయించారు. అసలే ప్రియురాలు తన ప్రేమ ఒప్పుకోవట్లేదనే బాధలో ఉన్న.. ప్రేమికుడికి ఈ వార్త... పుండు మీద కారం చల్లినట్టైంది. కట్​ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి వాళ్ల ఇళ్లు కాలిపోయి ఉంది. అసలు ఈ మధ్యలో ఏం జరిగిందంటే..?

  • తుపాకీతో బెదిరించి మహిళపై..

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై నలుగురు యవకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను తుపాకీతో బెదిరించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ దారుణ ఘటన జరిగింది. రాజస్థాన్​లో జరిగిన మరో ఘటనలో.. ఓ 16 ఏళ్ల బాలికపై ఓ కిరాతకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చేందుకు కారణమయ్యాడు.

  • బాణసంచా దుకాణంలో పేలుడు

తమిళనాడులో ఓ బాణసంచా దుకాణంలో పేలుడు సంభవించి ఐదుగురు మరణించారు. మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు

  • 'కొవాగ్జిన్​'పై డబ్ల్యూహెచ్​ఓ భేటీ

కొవాగ్జిన్​కు అత్యవసర అనుమతులపై (Covaxin WHO approval) డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా సంఘం సమీక్ష నిర్వహించింది. సలహా సంఘం టీకా వివరాలపై సంతృప్తి వ్యక్తం చేస్తే.. 24 గంటల వ్యవధిలో అత్యవసర అనుమతులు లభించే అవకాశం ఉంది.

  • కరోనా కొత్త వేరియంట్ కలకలం

దేశంలో కరోనా మహమ్మారి కొత్త రూపు(Covid New Variant in India) ధరించి విరుచుకుపడుతున్నట్లు కనిపిస్తోంది. కర్ణాటకలో ఏడుగురికి ఏవై.4.2 రకం కరోనా వేరియంట్ సోకినట్లు తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమై.. వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టారు మరోవైపు.. కేరళలో కొత్తగా 7 వేల మందికి కొవిడ్​ సోకింది. ఆ రాష్ట్రంలో ఒక్కరోజే 482 మంది వైరస్ కారణంగా మరణించారు.

20:56 October 26

టాప్​న్యూస్​@ 9PM

  • 'మేధావి వర్గం మౌనం వీడకపోతే..'

హుజూరాబాద్​లో భాజపా ఆధ్వర్యంలో పురప్రముఖుల సభ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్ చుగ్​తో కలిసి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పాల్గొన్నారు. మేధావి వర్గం మౌనంగా ఉంటే.. భవిష్యత్​ తరాలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. భాజపాతో కలిసి నడవాలని సూచించారు.

  • 'తెలంగాణ సర్కార్​పై తీవ్ర ఆగ్రహం

సూర్యాపేటలో చెరువు ఆక్రమణపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ కె.రామకృష్ణన్, ఎక్స్పర్ట్ మెంబర్ డాక్టర్ సత్యగోపాల్​లతో కూడిన బెంచ్ సూర్యాపేట కలెక్టరేట్‌ సమీపంలోని చెరువు ఆక్రమణపై విచారణ చేపట్టింది. కలెక్టర్ నేతృత్వంలోని నలుగురు అధికారుల కమిటీ  సమర్పించిన నివేదికను ఎన్జీటీ తిరస్కరించింది. నివేదికను చెత్తబుట్టలో వేస్తామని తీవ్రంగా స్పందించింది.

  • షకీలా భావోద్వేగం..

ఓ సన్నివేశంలో(Shakeela upcoming movies) తాను నటించడం చూసి తన తండ్రికి గుండెపోటు వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు నటి షకీలా. దీంతో పాటే తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.

  • 'డికాక్​ నిర్ణయం వ్యక్తిగతం'

వెస్టిండీస్​తో మ్యాచ్​కు(WI vs SA Match) అరగంట ముందు దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్(Quinton De Kock News) తీసుకున్న నిర్ణయాన్ని వ్యక్తిగతంగా పరిగణించింది క్రికెట్ సౌతాఫ్రికా. బ్లాక్​ లివ్స్​ మ్యాటర్​కు(Black Lives Matter) మద్దతుగా ప్రతి మ్యాచ్​ ముందు మోకాళ్లపై కూర్చుని మద్దతు తెలపాలని సీఎస్​ఏ.. ఆటగాళ్లకు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో డికాక్ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

19:56 October 26

టాప్​న్యూస్​@ 8PM

  • హెల్మెట్లతో జూనియర్ వైద్యులు

ఉస్మానియా ఆస్పత్రి సమస్యల వలయంగా మారుతోంది. వైద్యులు, రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎప్పుడు పెచ్చులు ఊడి మీదపడతాయో, లేక ఏ ఫ్యాను మీద పడుతుందోనన్న ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా ఉస్మానియాలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారు (medical students wearing helmets).

  • అల్లరి చేస్తున్నారని పిల్లల్ని..

తలకిందులుగా ఇద్దరు చిన్నపిల్లలను కట్టేసి (Parents hang their children with iron chain) ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఇది రాష్ట్ర బాలల హక్కుల కమిషన్​ ఛైర్​పర్సన్​ సంగీతా బెనీవాల్​ దృష్టికి చేరింది. అంతే.. ఆమె నేరుగా చిన్నారుల ఇంటికి వెళ్లారు. అప్పుడే అసలు విషయం బయటపడింది.

  • యువకుల సాహసం- సీఎం ఫిదా

తమిళనాడులో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో చిక్కుకున్న తల్లీబిడ్డలను స్థానికులు అతికష్టం మీద కాపాడారు. సేలం జిల్లాలోని అనైవరి జలపాతం చూసేందుకు వచ్చిన తల్లీబిడ్డలు ప్రమాదవశాత్తు ప్రవాహం వద్ద చిక్కుకుపోయారు. అది గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో ఇరువురిని పైకి లాగి రక్షించారు. ప్రాణాలను పణంగా పెట్టి గ్రామస్థులు చేసిన సాహసాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ కూడా వారిపై ప్రశంసలు కురిపించారు.

  • సినిమా కబుర్లు..

టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన కొత్త అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'సీటీమార్'(seetimaarr jwala reddy song), 'గని' చిత్రాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

  • ఐదుగురు విదేశీ ఆటగాళ్లు అవసరం'

రానున్న ఐపీఎల్​లో(IPL 2022 new teams) పాలుపంచుకోనున్న రెండు కొత్త జట్లకు భారత ఆటగాళ్ల ఎంపిక క్లిష్టంగా మారనుందని టీమ్ఇండియా మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా(Aakash Chopra News) అభిప్రాయపడ్డాడు. ప్రతి జట్టులో ఐదుగురు విదేశీ ఆటగాళ్లను చేర్చుకునే అవకాశం ఇవ్వాలని బీసీసీఐకి సూచించాడు.

18:53 October 26

టాప్​న్యూస్​@7PM

  •  క్రైం లవ్​స్టోరి.. 

ప్రేమ పేరుతో యువతికి శారీరకంగా దగ్గరయ్యాడు... పెళ్లి మాట వచ్చే సరికి ముఖం చాటేశాడు. ఒత్తిడి చేయటంతో అడ్డు తొలగించుకోవాలని ప్లాన్​ చేశాడు. పథకం ప్రకారం హత్య చేశాడు. పోలీసులకు దొరకుండా ఉండేందుకు సరికొత్త డ్రామాకు తెరతీశాడు. అన్ని అనుకున్నట్టే చేసినా.. ఒక్క దగ్గర మాత్రం ప్లాన్​ బెడిసికొట్టింది. ప్రాణాలకు తెగించి హత్య నుంచి తప్పించుకోవాలన్న ఆ ప్రబుద్ధుని అసలు నాటకం బయటపడింది.

  • 'తగ్గనున్న పెట్రో భారం'

దేశ ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించే దిశగా కేంద్రం త్వరలోనే 'ఫ్లెక్స్​ ఇంజిన్ పాలసీ'ని(Flex Engine In India) తీసుకురానుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari News) తెలిపారు. ఫ్లెక్స్ ఇంజిన్లతో.. పెట్రోల్​ లేదా ఇథనాల్​ను వాహనదారులు వినియోగించవచ్చని చెప్పారు. ఇథనాల్​ తక్కువ ధరలో లభించడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

  • తాలిబన్లకుభారీ సాయం

శీతాకాలం కారణంగా అఫ్గాన్(Afghan News) ప్రజలు తీవ్ర నిత్యావసరాల కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ దేశానికి తక్షణమే మానవతా, ఆర్థిక సాయం అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని చైనా, పాక్ ఉమ్మడిగా అభ్యర్థించాయి. మరోవైపు.. చైనా తమకు 10 లక్షల డాలర్ల విలువైన సాయం అందించిందని తాలిబన్ ప్రతినిధులు తెలిపారు.

  • ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణపై.. 

డ్రగ్స్ కేసులో అరెస్టయిన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్​ ఖాన్​ బెయిల్​కు సంబంధించిన హైకోర్టు విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఆర్యన్ తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

  • ఐపీఎల్​లో ఈ విషయాలు తెలుసా?

ఐపీఎల్​లో(ipl new team auction) అహ్మదాబాద్​, లఖ్​నవూ రెండు కొత్త జట్లను చేరుస్తూ బీసీసీఐ అక్టోబర్​ 25న నిర్ణయం తీసుకుంది. అయితే(ipl new team 2022) ఈ కొత్త జట్లు చేరడం వల్ల ఎవరు ప్రయోజనం పొందుతారు? వీటి రాకతో ఐపీఎల్​ ఫార్మాట్​పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఆసలు ఈ మెగాలీగ్​లో జట్ల సంఖ్య ఎప్పుడు పెరిగింది? వంటి విశేషాలను తెలుసుకుందాం..

17:58 October 26

టాప్​న్యూస్​@6PM

  • కోర్టులో నటి సమంతకు ఊరట

హైదరాబాద్​ కూకట్​పల్లి కోర్టులో నటి సమంతకు ఊరట లభించింది. సమంతకు సంబంధిత వీడియోలు 2 యూట్యూబ్‌ ఛానెళ్లు, సీఎల్‌రావుకు కూకట్‌పల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది.  

  • కాంగ్రెస్​ నేతలకు సోనియా అల్టిమేటం

కాంగ్రెస్ నేతలంతా ఐకమత్యంతో పనిచేసి పార్టీ విజయం కోసం కృషి చేయాలని సోనియా గాంధీ సూచించారు. వ్యక్తిగత లక్షాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని తేల్చిచెప్పారు. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇన్​ఛార్జ్​లతో ప్రత్యేకంగా సమావేశమైన ఆమె.. భాజపా, ఆర్​ఎస్​ఎస్​పై సైద్ధాంతిక పోరాటానికి పిలుపునిచ్చారు.

  • 'సర్కారు వారి పాట' వీడియో లీక్.. 

సూపర్ స్టార్ మహేశ్ బాబు(mahesh babu sarkaru vaari paata) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో లీకైంది(sarkaru vaari paata leaked song). ఇది కాస్తా నెట్టింట వైరల్​గా మారింది.

  • కోచ్ పదవికి ద్రవిడ్ దరఖాస్తు!

టీమ్​ఇండియా ప్రధాన కోచ్​ పదవికి రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు చేసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. భారత మాజీ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాయి.

16:52 October 26

టాప్​న్యూస్​@ 5PM

  • వ్యాక్సిన్​ వేసుకోనని మొండికేసిన వ్యక్తి.. 

వ్యాక్సిన్​ తీసుకుంటే కరోనాను నియంత్రించగలమని ఆరోగ్య కార్యకర్తలు వివరించారు. టీకా తీసుకోవాలని అభ్యర్థించారు. అయినా ఆ వ్యక్తి టీకా తీసుకోనంటూ మొండికేశాడు. తోటి గ్రామస్థులు కూడా.. సముదాయించారు. టీకా తీసుకోవాలని నచ్చజెప్పారు. కొందరైతే బతిమాలారు కూడా. అయినా.. ఆ వ్యక్తి తీసుకోనంటే తీసుకోనని చిన్నపిల్లాడిలా మారాం చేశాడు. ఇక మాటలతో పని కాదని గ్రహించిన వాళ్లంతా.. ఏం చేశారంటే..?

  • సబ్​మెరైన్ల రహస్య డేటా లీక్.. 

సబ్​మెరైన్​లకు సంబంధించిన సమాచారాన్ని లీక్ (Submarine Data Leaked) చేసినందుకు ఇద్దరు విశ్రాంత ఉద్యోగులు సహా ముగ్గురు అధికారులను సీబీఐ (CBI News) అరెస్టు చేసింది. ఇందులో ముంబయిలో పనిచేస్తున్న కమాండర్ స్థాయి అధికారి (Indian Navy news) ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అధికారి.. సమాచారన్ని రహస్యంగా విశ్రాంత ఉద్యోగులకు పంపించారని వెల్లడించాయి.

  • ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏను (DA hike news) పెంచుతూ కేబినెట్​ తీసుకున్న నిర్ణయాన్ని.. మోదీ సర్కార్​ నోటిఫై చేసింది. ఇది 2021 జులై 1 (DA hike 2021) నుంచే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

  • తుదిదశకు ప్రభాస్​ 'ఆదిపురుష్'

రెబల్​స్టార్ ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆదిపురుష్'(prabhas adipurush look). రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్​కు సంబంధించిన ఓ అప్​డేట్ వచ్చింది.

  • పాక్​పై భారత్ ఎందుకిలా ఓడిపోతోంది?

భారత్‌ - పాకిస్థాన్‌ మ్యాచ్‌(T20 worldcup 2021 teamindia pakisthan match) అంటే క్రికెట్‌ మాత్రమే కాదు.. కోట్లాది మంది అభిమానులకు పండగే.. రెండు దేశాల్లో నరాలు తెగే ఉత్కంఠ. ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునే రసవత్తర పోరు. అలాంటిది గత నాలుగేళ్లలో దాయాదితో(pak vs teamindia 2021) జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా రెండు ఓటములు చవిచూసింది. ఇది ఐసీసీ టోర్నీల్లో భారత ఆధిపత్యాన్ని నెమ్మదిగా తగ్గించేట్లు కనపడుతోంది. 

16:11 October 26

టాప్​న్యూస్​@4PM

  • 'ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం లేదు'

 కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు ఈఎన్సీ మురళీధర్‌ రెండు లేఖలు రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో నందికొండ ప్రాజెక్టు నివేదికలు బేఖాతరు చేస్తూ.. నాగార్జునసాగర్ ఎడమ కాలువను ఇష్టా రీతిన పెంచుకుంటూ పోయారని మురళీధర్‌ లేఖలో ప్రస్తావించారు. 1952లో హైదరాబాద్ రాష్ట్రం తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు నివేదికలో ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు నందిగామ తాలుకాలోని కట్లెరు వాగు వరకు మాత్రమే ప్రతిపాదించారని వివరించారు. 

  • 'సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్'

ముంబయి క్రూయిజ్ నౌక డ్రగ్స్​ కేసును(mumbai drug case) విచారిస్తున్న ఎన్​సీబీ జోనల్ ఆఫీసర్​పై సంచలన ఆరోపణలు చేశారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్​. బాలీవుడ్‌ సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్‌ చేసి, వారి నుంచి వాంఖడే(NCB Sameer Wankhede) ) డబ్బులు డిమాండ్‌ చేసేవారన్నారు. ఈమేరకు తనకు లేఖ అందిందంటూ దాన్ని బయటపెట్టారు. ఈ అరోపణలను వాంఖడే తోసిపుచ్చారు.

  • '21 ఏళ్ల యువతిపై అత్యాచారయత్నం'

పట్టపగలే ఓ 21 ఏళ్ల యువతిపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారయత్నం చేశాడు. ప్రతిఘటించిన యువతి ముఖంపై రాయితో కొట్టి గాయపరిచాడు. కేరళలో ఈ ఘటన జరిగింది.

  • మెగాస్టార్ వాయిస్ ఓవర్

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న చిత్రం 'రంగమార్తాండ'(rangamarthanda telugu movie). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ మెగా సర్​ప్రైజ్ ఇచ్చారు కృష్ణవంశీ(krishna vamsi movies). ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్​(chiranjeevi voice over movies) ఇస్తున్నారని వెల్లడించారు. అందుకు సంబంధించిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

  • కోలుకుంటున్న మార్కెట్లు..

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు (Stock market today) మళ్లీ జోరు చూపిస్తున్నాయి. తీవ్ర ఒడుదొడుకుల అనంతరం.. ఆఖర్లో మళ్లీ మంచి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 380, నిఫ్టీ 140 పాయింట్ల మేర పెరిగాయి.

14:48 October 26

టాప్​న్యూస్​@3PM

  • 'తెలంగాణ సర్కార్​పై తీవ్ర ఆగ్రహం'

  • ఆ కోబ్రా విషం ఉమ్మిందంటే అంతే!

ఉత్తరాఖండ్​లోని నైనితాల్​ జిల్లా రామ్​నగర్​ ప్రాంతంలో (Spitting Cobra in India) అరుదైన కోబ్రాను గుర్తించారు స్థానికులు. ఈ కోబ్రా.. విషాన్ని ఉమ్మే లక్షణం ఉన్న రకానికి చెందిన పాము. శాంతీకుంజ్​ స్ట్రీట్​లోని ఓ వ్యక్తి నివాసంలో ఈ సర్పాన్ని గుర్తించిన స్థానికులు.. వైల్డ్​ వెల్ఫేర్​ సొసైటీకి సమాచారం ఇచ్చారు. 

  • చైనాపై కరోనా పంజా

చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి(china new outbreak). వైరస్​ ఉద్ధతి దృష్ట్యా.. 40 లక్షల జనాభా గల లాన్జౌ నగరంలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధించారు(lanzhou city news).

  • బాలకృష్ణ టాక్​షోలో మోహన్‌బాబు,నాగబాబు!

'ఆహా' వేదికగా(unstoppable with nbk aha) ప్రసారం కానున్న 'అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే' టాక్​ షోకు నటుడు మోహన్​బాబు తొలి సెలబ్రిటీగా హాజరయ్యారని తెలిసింది. సెట్‌లో బాలకృష్ణతో మోహన్‌బాబు దిగిన ఫొటో వైరల్‌గా మారింది. మరోవైపు, మెగా కుటుంబం నుంచి నాగబాబు ఈ షోలో పాల్గొన్నారని టాక్‌.

  • ఒక్కరోజే రూ.2.71 లక్షల కోట్లు పెరిగిన సంపద

టెస్లా, స్పేస్​ ఎక్స్​ సంస్థల అధినేత ఎలాన్​ మస్క్(Musk news today)​ చరిత్ర సృష్టించారు. ఒక్కరోజులో ఆయన సంపద ఎంత పెరిగిందో తెలుసా? అక్షరాలా రూ. 2.71 లక్షల కోట్లు. అవును మీరు విన్నది నిజమే. ఆ ఒక్క డీల్​.. ఆయనకు కాసులు(Musk tesla shares) కురిపించింది.

13:52 October 26

Top News@ 2PM

  • ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలి..

ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలడం (Fridge Explosion) వల్ల భార్యాభర్తలు సజీవదహనం అయ్యారు. నిద్రిస్తున్న సమయంలో ఫ్రిజ్ పేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన నుంచి తొమ్మిదేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

  • సంరక్షణ కేంద్రాల్లో దారుణం..

జీహెచ్​ఎంసీలోని పలువురు అధికారులు రాక్షస క్రీడ ఆడుతున్నారు. నోరులేని మూగజీవాలకు శాస్త్రీయత లేని శస్త్రచికిత్సలు చేస్తూ వాటి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు..

  • ఫేస్​బుక్​కు లాభాల పంట..

'ఫేస్​బుక్​ పేపర్స్​' (Facebook papers leak) ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ కూడా.. త్రైమాసిక ఫలితాల్లో (Facebook results today) ఈ సామాజిక మాధ్యమ దిగ్గజం జోరు చూపించింది. జులై- సెప్టెంబర్​తో ముగిసిన క్వార్టర్​లో 17 శాతం నికర లాభాన్ని ఆర్జించింది.

  • ఓటమికి కారణాలు చెప్పిన సచిన్‌

ఐసీసీ టోర్నీలో తొలిసారి పాక్ చేతిలో (T20 world cup 2021) టీమ్​ఇండియా పరాజయం పాలైంది. దీనిపై ఎన్నోరకాల కారణాలు వినిపిస్తున్న నేపథ్యంలోనే దిగ్గజ క్రికెటర్ సచిన్​ తెందూల్కర్​ కూడా తన విశ్లేషణను పంచుకున్నాడు.

  • ఆర్​ఆర్​ఆర్​ నిడివి ఎంతో తెలుసా?

'ఆర్​ఆర్​ఆర్'(RRR Update)​కు సంబంధించి మరో అప్​డేట్​ నెట్టింట్లో వైరల్​గా మారింది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తికాగా.. ఫైనల్​ కట్​ అయినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.

12:48 October 26

Top News@ 1 PM

  • 'ఇది సర్కార్ బ్లాక్​మెయిల్..'

వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట కలెక్టర్ విత్తన డీలర్లను బెదిరించడం.. రైతులను బ్లాక్​మెయిల్ చేయడమేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వరి రైతుల బాధ్యత నుంచి తప్పుకునేందుకే ఈ ఎత్తుగడ వేసిందని ఆరోపించారు.

  • యాదాద్రీశుడి చెంతకు గోదావరి..

విశ్వ ఖ్యాతి చెందేలా... భక్తుల మనస్సును ఆకర్షించేలా కృష్ణశిలతో పునర్నిర్మితమవుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాభివృద్ధి పనులు త్వరితగతిన సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో భక్తులు గోదావరి జలాలతో పుణ్యస్నానం ఆచరించేలా పనులు వేగవంతమయ్యాయి. 

  •  ఆంత్రాక్స్‌ కలకలం..

వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్(anthrax symptoms) కలకలం రేపుతోంది. దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో గొర్రెలకు ఆంత్రాక్స్ వ్యాధి సోకినట్లు ప్రాథమికంగా  నిర్ధారణ అయింది. తదుపరి పరీక్షల కోసం నమూనాలు హైదరాబాద్‌కు పంపించినట్లు అధికారులు వెల్లడించారు.

  • సామాన్యుడితో రాకుమారి వివాహం..

రాచరికాన్ని, కోట్లాది రూపాయలను వదులుకుని ఓ సామాన్యుడిని పెళ్లాడింది జపాన్​ రాకుమారి మకో(japan princess mako wedding). టోక్యో ఇంపీరియల్​ ప్యాలెస్​లో మకో- కిమురోల వివాహం నిరాడంబరంగా జరిగింది. 

  • రణ్​బీర్​-ఆలియా పెళ్లి..!

బాలీవుడ్​ ప్రేమజంట రణ్​బీర్​ కపూర్​-ఆలియా భట్​(ranbir alia bhatt marriage).. ఈ ఏడాది చివర్లో డెస్టినేషన్​ వెడ్డింగ్​ చేసుకోనున్నట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. రాజస్థాన్​లోని ఓ ఐకానిక్​ ప్యాలెస్​ ఈ వివాహ వేడుకకు వేదిక కానున్నట్లు తెలిసింది.

11:53 October 26

Top News@ 12 PM

  • టీకా తీసుకోనివారికి రేషన్, పింఛన్‌ బంద్...

కరోనా టీకా(corona vaccine) తీసుకోని వారికి రేషన్, పింఛన్ నిలిపివేస్తామని డీహెచ్ శ్రీనివాస రావు హెచ్చరించారు. నవంబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు. ప్రజలు టీకా తీసుకుని మహమ్మారి నుంచి అప్రమత్తంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

  • తెరాసకు ఓటు వేయకపోతే పింఛను

తెరాసకు ఓటు వేయకపోతే పింఛను నిలిపివేస్తామని ఆ పార్టీ నేత బహిరంగంగా ఓటర్లను హెచ్చరిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. సర్పంచుల స్థాయి నుంచి ఉన్నత పదవుల్లో ఉంది తెరాస నేతలే కాబట్టి ఓటు వేయని పేర్లు నమోదు చేసుకుని పింఛన్లు రాకుండా చేస్తామని హెచ్చరించారు.

  • ఐదేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడో వృద్ధుడు. మహారాష్ట్రలోని పుణెలో ఈనెల 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

  • పీసీసీ అధ్యక్షులతో సోనియా కీలక భేటీ

కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం (Congress Meeting today) నిర్వహించారు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇంఛార్జీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

  • పెరిగిన బంగారం ధర..  

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధరలు (Gold Rate Today)పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రేటు రూ.200 మేర పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు (Silver price today) ఇలా ఉన్నాయి..

10:48 October 26

Top News@ 11 AM

  • ఒకప్పుడు బారులు.. ఇప్పుడు పరుగులు

కరోనా టీకా తీసుకునేందుకు జనాలు ముందుకు రావడం లేదని వైద్య సిబ్బంది వాపోతున్నారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లినా స్పందన కరవవుతోందని చెబుతున్నారు. ప్రజలు ఏమాత్రం సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • రూపాయితో రీఛార్జి అని... లక్షలు కొట్టేశారు!

సైబర్ కేటుగాళ్లు అమాయకులకు వల వేసి లక్షలు కాజేస్తున్నారు. వీరి ఆగడాలకు ముఖ్యంగా యువత, వృద్ధులే బలవుతున్నారు. తాజాగా రూపాయితో రీఛార్జి చేసుకోవాలని చెప్పి.. ఓ వృద్ధుడు ఖాతా నుంచి ఏకంగా రూ.11 లక్షలు దోచేసిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

  • అల్లుడు మరణిస్తే.. 

మోటారు వాహన చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court News) కీలక తీర్పును వెల్లడించింది. అల్లుడు మరణిస్తే అతనిపైనే ఆధారపడి జీవిస్తున్న అత్త.. పరిహారం పొందేందుకు అర్హురాలని స్పష్టం చేసింది. ఆమె అల్లుడికి చట్టబద్ధ ప్రతినిధి అవుతుందని పేర్కొంది.

  • అమెరికా ప్రయాణికులకు అలర్ట్..

కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి కీలక నిబంధనలను (US Travel restrictions) అమెరికా ప్రకటించింది. 18 ఏళ్లు పైబడిన విదేశీ ప్రయాణికులకు (US International Travel news) వ్యాక్సినేషన్ తప్పనిసరి కానుంది.

  • 'షమి నిజమైన భారతీయుడు..

పాకిస్థాన్​తో మ్యాచ్ తర్వాత భారత్​ పేసర్​ షమిపై కొందరు విద్వేషత పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో షమికి కొందరు అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ మేరకు షమికి భారత్​ పట్ల ఉన్న దేశభక్తిని చాటేలా ఓ అభిమాని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసిన వీడియో వైరల్​గా మారింది.

09:46 October 26

Top News@ 10 AM

  • కొత్తగా 12,428 కరోనా కేసులు

దేశంలో రోజువారి కరోనా కేసులు (Coronavirus update) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 12,428 కరోనా కేసులు (Coronavirus update) నమోదయ్యాయి. వైరస్​​ ధాటికి (Covid cases in India) మరో 356మంది ప్రాణాలు కోల్పోగా.. 15,951 మంది కోలుకున్నారు.

  • పదిమంది అదృశ్యం.. 

హైదరాబాద్‌ మహా నగరంలో వేర్వేరు ఘటనల్లో పదిమంది అదృశ్యమయ్యారు(Missing Cases). అయితే వాళ్ల ఆచూకీ ఇంతవరకు తెలియకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమయింది. 

  • నలుగురు సజీవదహనం

దిల్లీలోని ఓ భవనంలో సంభవించిన అగ్నిప్రమాదంలో.. నలుగురు మరణించారు. మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.

  • రైతుకు శేఖర్ కమ్ముల సాయం

సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని  ఓ రైతు గుడిసె దగ్ధమై బీరువాలో దాచుకున్న రూ.6 లక్షలు బూడిదయ్యాయి. ఈటీవీ భారత్​లో ప్రచురించిన ఈ కథనానికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందించారు.

  • ఫ్రెంచ్‌ ఓపెన్‌పై సింధు గురి

డెన్మార్క్‌ ఓపెన్‌లో క్వార్టర్‌పైనల్లో నిరాశపరిచిన పి.వి సింధు.. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టైటిల్‌పై గురి పెట్టింది. మంగళవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్​లో జూలీ జాకోబ్‌సెన్​తో సింధు తలపడనుంది.

08:48 October 26

Top News@ 9 AM

  • ఖాతాలోని సొమ్ము ఉచితంగా ఇంటికి..

ఇంటికి ఉత్తరాలే కాదు.. పొదుపు ఖాతాలోని డబ్బును సైతం ఉచితంగా ఇంటికే తెచ్చి ఇస్తామంటోంది తపాలాశాఖ. తపాలా పొదుపు ఖాతాలోనివే కాదు.. ఇతర బ్యాంకుల్లో మీ సొమ్ములున్నా వాటిని తెచ్చి ఇస్తామంటోంది. కరోనా వేళ ఇలాంటి అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోవాలని ఉందా...? 

  • ఇదేనా పట్టణ సంస్కృతి!?

ఆ మెట్రో రైలు ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. అప్పుడే ఓ మహిళ తన శిశువుతో కలిసి మెట్రో రైలు ఎక్కింది. ఎక్కడా ఒక్క సీటు కూడా దొరకలేదు. గమ్యం చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. ఆమె పడుతున్న ఇబ్బందిని ఎవరూ గుర్తించలేదు. ఇంకా తప్పదని తెలిసిన ఆ తల్లి... శిశువుతో కలిసి అక్కడే కింద కూర్చొని గమ్యం చేరే వరకు ప్రయాణించింది.

  • కొత్త కేసుల్లో టీకా తీసుకున్నవారే అధికం..

తమ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కొవిడ్​ కేసుల్లో.. టీకా రెండు డోసులు పూర్తి చేసుకున్న వారే అధికంగా ఉంటున్నారని తెలిపారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రోగనిరోధక శక్తి ఆరు నెలలు మించడం లేదని వెల్లడించారు.

  • ఒక్క మాట ఖరీదు.. రూ. 25 లక్షల కోట్లు!

ఒక్క మాట ఖరీదు.. రూ. 25 లక్షల కోట్లు. చైనా బిలియనీర్‌, ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మాకు ఎదురైన పరిస్థితి ఇది. సరిగ్గా ఏడాది క్రితం చైనా సర్కారుకు వ్యతిరేకంగా మాట జారి.. జాక్‌ మా కష్టాలు కొనితెచ్చుకున్నారు. చైనా పాలకుల ఆగ్రహానికి గురై 344 బిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో అక్షరాలా 25 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని కొనితెచ్చుకున్నారు.

  • చరిత్ర తిరగరాసిన బాబర్​ ఆజామ్​..

ప్రపంచకప్‌ టోర్నీలో భారత్​పై పాక్​ గెలిచిన అనంతరం పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ తండ్రి అజామ్‌ సిద్దిఖి భావోద్వేగానికి లోనయ్యాడు. తన కుమారుడి చిరస్మరణీయ ఆట పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

07:48 October 26

Top News@ 8 AM

  • అధికారుల తప్పులు.. విద్యార్థులకు తిప్పలు

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణలో లోపాలు బోర్డు నిర్లక్ష్యాన్ని చెప్పకనే చెప్పాయి. ప్రైవేటు కళాశాలలపై అధికారులకు అజమాయిషీ లేదని, కనీస వివరాలు కూడా పరిశీలించడం లేదనే విషయమూ స్పష్టమైంది.

  • ఫ్లెక్సీలకు అనుమతి ఉందా..

తెరాస ప్లీనరీ సందర్భంగా నగరంలో తెరాస నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై కాంగ్రెస్​ సీనియర్ నేత జి.నిరంజన్​ ప్రశ్నించారు. వాటికి అనుమతి ఉన్నట్లయితే ఎంత మొత్తం వసూలు చేశారో తెలపాలంటూ జీహెచ్​ఎంసీ కమిషనర్​కు లేఖ రాశారు.

  • మార్కులు రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య

పీజీ ఎంట్రన్స్​లో తక్కువ మార్కులు వచ్చాయని ఓ యువతి బలవనర్మణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో జరిగింది.

  • ముందు నాగ చైతన్యను అనుకున్నాం..

ఒకే నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చినా.. పాత్రలు, వాటి తాలూకూ నేపథ్యం, భావోద్వేగాలు అన్నీ భిన్నంగా ఉంటాయిని 'వరుడు కావలెను' చిత్రంతో పరిచయమవుతున్న కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య అన్నారు. అందుకే వీటన్నింటినీ కొత్తగా చూపించడం చాలా ముఖ్యమని తెలిపారు.

06:48 October 26

Top News@ 7 AM

  • దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాం..

రాజీలేని పోరాటంతో తెలంగాణ సాధించుకుని.. దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తున్నామని తెరాస అధ్యక్షుడిగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ (KCR) స్పష్టం చేశారు. 2028లో రాష్ట్ర బడ్జెట్‌ 4 లక్షల కోట్లు దాటుతుందన్న సీఎం.. దళితబంధు ఎట్టి పరిస్థితుల్లో ఆగదని.. అందరికీ ఇచ్చితీరుతామని హామీ ఇచ్చారు.

  • హుజూరాబాద్‌ రికార్డులు..

హుజూరాబాద్ ఉపఎన్నిక రాష్ట్రంలో ప్రభంజనం సృష్టిస్తోంది. రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. ఎన్నికల ఖర్చుతో మొదలుకొని ఓటర్లకు తాయిలాలు ఇవ్వడంలో సరికొత్త రికార్డు నమోదు చేసుకొంటోంది. భద్రత విషయంలోను ఈ నియోజకవర్గం ప్రత్యేక రికార్డు నెలకొల్పుతోంది.

  • చర్చలు యువతతోనే.. పాకిస్థాన్​తో కాదు

నూతన అభివృద్ధి దిశగా జమ్ముకశ్మీర్‌ పయనిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కశ్మీర్​ పర్యటనలో ఉన్న ఆయన.. శ్రీనగర్‌లో బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాస్‌ కవచాన్ని తొలగించి ప్రసంగించారు.

  • సందేశమే సినిమా అంతిమ లక్ష్యం కావాలి..

సందేశమే సినిమా అంతిమ లక్ష్యం కావాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సినీ పరిశ్రమకు పిలుపునిచ్చారు. సమున్నత సమాజిక, నైతిక సందేశాన్ని చాటి చెప్పేలా ఉండాలని అన్నారు. 

  • కోహ్లీ, ధోనీ క్రీడాస్ఫూర్తి..

మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లీ క్రీడాస్ఫూర్తి పట్ల ఐసీసీ హర్షం వ్యక్తం చేసింది. అందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. 'ఇది కదా నిజమైన క్రీడాస్ఫూర్తి' అంటూ భారత్‌-పాక్‌ క్రికెట్‌ జట్లను మెచ్చుకుంది.

04:49 October 26

top news@6AM

  • ఏడేళ్లలో సమగ్రాభివృద్ధి

ఏడేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో మనం కీర్తి బావుటా ఎగురవేశామని కొనియాడారు. హైదరాబాద్​లోని హైటెక్స్​లో తెరాస ప్లీనరీ సభను ఘనంగా నిర్వహించారు. దళితబంధును ఎవరూ ఆపలేరని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

  •  ఒక్కరోజే గడువు

హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారానికి ఒక్కరోజే గడువు ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంటింటిప్రచారంతో పాటు రోడ్‌షో, ఆత్మీయ సమ్మేళనాలు ఇప్పటికే పూర్తిచేసిన పార్టీలు చివరి ప్రయత్నాలనూ వేగవంతం చేశాయి. తెలంగాణ ఉద్యమంలో ఎవరు సీనియర్లు అనే అంశంపై భాజపా, తెరాస మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

  •  శ్రేణుల్లో నూతనోత్సాహం

తెరాస శ్రేణుల్లో ప్లీనరీ కొత్త ఉత్సాహన్ని తీసుకొచ్చింది. ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్​లోని హైటెక్స్​లో ఘనంగా నిర్వహించారు. తెరాస నియామావళిని సవరిస్తూ పలు సవరణలు చేశారు. అధ్యక్షుడు లేనప్పుడు కార్యనిర్వాహక అధ్యక్షుడికే నిర్ణయాధికారం ఉండేలా తీర్మానించారు. ఈమేరకు అధికారాలు అప్పగిస్తూ పార్టీ నియామవళి సవరించారు. 

  • సిర్పూర్కర్​ కమిషన్ ప్రశ్నల వర్షం

దిశ నిందితుల ఎన్​కౌంటర్​ కేసులో సిర్పూర్కర్ కమిషన్ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఆ సమయంలో షాద్​నగర్ ఏసీపీగా ఉన్న సురేందర్​ ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే ఆ సమయంలో తాను ఫైరింగ్​ చేయమని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కమిషన్​ ముందు వివరించారు.

  • 'ఆ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి'

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీజీపీ కార్యాలయం (DGP Office) స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవిగా పేర్కొంది. ఆ వ్యాఖ్యలు పోలీస్ శాఖ పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని వెల్లడించింది.

  • 'చర్చలు వారితోనే.. పాకిస్థాన్​తో కాదు'

  • 'భారత్‌-పాక్‌ సంబంధాలు మెరుగుపడాలి.. కానీ'

టీ20 ప్రపంచకప్​లో భారత్​-పాకిస్థాన్​ మ్యాచ్‌ నేపథ్యంలో కశ్మీర్​ సమస్యపై చర్చించడం సరికాదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇరు దేశాలూ పరిష్కరించుకోవాల్సింది కశ్మీర్‌ సమస్య ఒక్కటేనని చెప్పారు.

  • నవంబర్‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు  సెలవో తెలుసా?

నవంబర్​లో (Bank holidays in November) ఏకంగా 17 రోజులపాటు బ్యాంకులు పనిచేయవనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది. అందులో నిజమెంత?

  • ఆమెను ​అలా పిలిస్తే చాలా కోపమట!

తనదైన నటనతో(actress asin birthday) అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకుంది హీరోయిన్​ అసిన్​. నేడు(అక్టోబర్​ 26) ఆమె పుట్టినరోజు సందర్భంగా.. ఈ ముద్దుగుమ్మ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

  • అలా ట్రై చేయండి.. గెలుపు మనదే'

టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021)లో టీమ్ఇండియా తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్(harbhajan singh latest tweet). కాకపోతే జట్టులోని బ్యాటింగ్​ ఆర్డర్​లో పలు మార్పులు చేయాలని సూచించాడు.

Last Updated : Oct 26, 2021, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.