1. విపత్తువేళ కిషన్ సాయం...
కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకునేందుకు పార్టీ పిలుపు మేరకు భాజపా శ్రేణులు 'సేవా హీ సంఘటన్' పేరుతో రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. కరోనా బాధితులకు పార్టీ కార్యకర్తలు ఐసోలేషన్ కేంద్రాలు, ఉచిత మందులు, పౌష్టికాహారం అందజేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. నగరంలో ఉగాండ వ్యభిచార ముఠా...
పర్యాటక వీసాతో నగరానికి వచ్చి.. ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తూ ఐదుగురు మహిళలు పోలీసులకు పట్టుబడ్డారు. ప్రత్యేకంగా ఆపరేషన్ నిర్వహించిన రాచకొండ, మానవ అక్రమ రవాణా నిరోధక బృందం వారిని వల వేసి పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రానున్న మూడు రోజులు వానే...
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని... హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల వద్ద విస్తరించాయని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం...
బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం వినియోగిస్తున్న ఆంఫోటెరిసిన్- బి ఔషధం ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు.. కేంద్రం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆరు సంస్థలు.. ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేస్తుండగా, ఇప్పుడు మరో ఐదు కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే కరోనాతో ప్రజలు సతమతమవుతుంటే.. ఆయా రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా గుజరాత్లో 13 ఏళ్ల బాలుడు ఈ బ్లాక్ ఫంగస్ బారినపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. బ్యాంకు ఉద్యోగులపై పంజా...
కరోనా రెండోదశ తీవ్ర ప్రభావంతో.. సుమారు 1300మంది బ్యాంకు సిబ్బంది మరణించినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈ) వెల్లడించింది. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు కలిగి ఉండే తమకు టీకాలు అందించాలని ఏఐబీఈ ప్రధాన కార్యదర్శి భారతీయ బ్యాంకుల సంఘానికి లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. న్యూస్‌పేపర్స్ షేర్చేస్తే అంతే...
సామాజిక మాధ్యమాల్లో ఈ-పేపర్లను షేర్ చేయడాన్ని నిరోధిస్తూ దిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్రం, వాట్సాప్, టెలిగ్రామ్‌కు నోటిసులు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. విదేశాల్లో టీకా ఉత్పత్తి...
దేశం అవసరాల మేరకు టీకా ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కొవాగ్జిన్ ఉత్పత్తిని విదేశాల్లో చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మే18నే కేబినెట్ అంతర్గతంగా సమావేశం నిర్వహించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. కోలుకుంటున్న గాజా...
ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా గాజాలోని హమాస్ ఉగ్రవాదుల మధ్య 11రోజుల పాటు జరిగిన ఘర్షణలకు తెరపడింది. ఇరువర్గాలు కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం తెలిపినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ మినీ సంగ్రామం దాదాపు 250 మందిని పొట్టనబెట్టుకుంది. ప్రాణభయంతో పారిపోయిన ఎందరో ఇప్పుడిప్పుడే.. తమ గూటికి చేరుకుంటున్నారు. రాకెట్ దాడులతో దద్దరిల్లిన గాజా మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. నేనే వెళ్లిపోదామనుకున్నా...
తన తల్లిదండ్రులకు కరోనా నిర్ధరణ అయిందని తెలియగానే ఐపీఎల్ నుంచి వెళ్లిపోదామనుకున్నట్లు ఆర్సీబీ బౌలర్ చాహల్ వెల్లడించాడు. వీలైనంత తొందరగా ఇంటికి చేరుకోవాలని అనుకున్నట్లు తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. రాధిక న్యూడ్ వీడియోపై క్లారిటీ...
గతంలో తన న్యూడ్ వీడియోలంటూ వైరల్ అయిన వార్తలపై బాలీవుడ్ నటి రాధికా ఆప్టే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. కెరీర్ ఆరంభంలో 'పార్చ్డ్' సినిమాలో న్యూడ్ సన్నివేశాల్లో నటించిన విషయం వాస్తవమేనని.. కానీ, ఆ న్యూడ్ వీడియోలు తనవి కావని తేల్చి చెప్పింది. అయితే అప్పటినుంచి సోషల్‌మీడియాలో వస్తున్న ట్రోల్స్ గురించి పట్టించుకోవడం లేదని రాధిక చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.