1. సీఎంలకు ప్రధాని ఫోన్...
మహారాష్ట్ర, తమిళనాడు, త్రిపుర రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయా రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసిన ఆయన.. కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, తమకు 2.6 కోట్ల టీకా డోసులు అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. త్వరలోనే మరో టీకా...
జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన 'జైకోవ్-డి' టీకా అత్యవసర వినియోగానికి అనుమతుల కోసం సంస్థ త్వరలోనే దరఖాస్తు చేయనున్నట్లు తెలుస్తోంది. జైకోవ్-డికి కేంద్రం ఆమోదముద్ర వేస్తే.. దేశంలో అందుబాటులోకి రానున్న నాలుగో టీకా ఇదే కానుంది. అయితే ఈ టీకా మూడు డోసులలో లభిస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రాష్ట్రానికి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు...
తెలంగాణకు 1.45 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని సరఫరా సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జాబితా ప్రకారం రాష్ట్రాలకు ఇంజక్షన్లు అందించాలని సూచించింది. ఈనెల 16 వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఇప్పుడిది అవసరమా..?
దేవరయాంజల్ భూములపై ఎప్పటి నుంచో ఉన్న వివాదంపై... ఇప్పుడే ఇంత తొందరగా విచారణ ఎందుకు చేస్తున్నారని హైకోర్టు... ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజలు కరోనాతో మరణిస్తుంటే లేని స్పందన... ఈఅంశంపై ఎందుకని వ్యాఖ్యానించింది. కరోనా విపత్తు వేళ నలుగురు ఐఏఎస్‌లతో విచారణ జరపాలా...? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ప్రత్యేక కోర్టు పెట్టండి...
వామన్‌రావు హత్య కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు న్యాయశాఖ కార్యదర్శి లేఖ రాశారు. కరీంనగర్ సెషన్స్ కోర్టును.. ప్రత్యేక కోర్టుగా గుర్తించాలని.. విచారణ వేగంగా జరిగేలా చూడాలని ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ప్రేయసిపై కత్తితో దాడి...
ఎన్నిచట్టాలు తెచ్చినా... ఎన్ని షీటీమ్‌లు వచ్చినా మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటివరకు ప్రేమిస్తున్నామంటూ వెంటపడతారు. అమ్మాయి వద్దనే సరికి వారిలోని మృగాన్ని మేల్కొల్పుతారు. తాజాగా జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో యువతిపై యువకుడు దాడి చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. పాక్‌లో హిందూ మహిళ రికార్డు...
పాకిస్థాన్‌లో చరిత్ర సృష్టించారు సనా రామచంద్ అనే హిందూ మహిళ. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సెంట్రల్ సుపీరియర్ సర్వీస్‌కు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫీట్ సాధించిన తొలి హిందూ మహిళ సనానే విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. వాహన రుణం తీసుకుంటున్నారా..?
బైక్, ఆటో, కార్… ఇలా ఏ వాహనం కొనుగోలు చేయాలన్న పూర్తి ధర మొత్తం చెల్లించక్కర్లేదు. దీనికి కారణం ఫైనాన్స్. నెలవారీగా రుణ వాయిదాలు(ఈఎమ్ఐ) చెల్లిస్తే సరిపోతుంది. అయితే దీనికి సంబంధించిన రుణాన్ని మంజూరు చేసేందుకు బ్యాంకులు ఏ విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి? రుణం తీసుకునే వ్యక్తి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి? వంటి వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఆ పని చేస్తేనే జట్టులో చోటు...
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన భారత జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కలేదు. బరువు ఎక్కువగా ఉన్న కారణంగానే ఆయనకు చోటు దక్కలేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. హాటుహాటుగా హీరోయిన్లు...
సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలతో ఎల్లపుడు అభిమానులకు దగ్గరగా ఉంటారు హీరోయిన్లు. వారు చేసే పని గురించి, ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఈ నటీమణుల ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వారెవరో చూసేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.