ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 11AM - top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA
author img

By

Published : Oct 3, 2022, 11:01 AM IST

Updated : Oct 3, 2022, 11:07 AM IST

  • హైదరాబాద్‌ నగర నడిబొడ్డు నుంచే భారత్​ జోడో యాత్ర.. రూట్​ మ్యాప్​ ఇదే..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మన రాష్ట్రంలో రూట్‌ మ్యాప్‌ ఖరారైంది. హైదరాబాద్‌ నగర నడిబొడ్డు నుంచే.. ఈ యాత్ర సాగేట్లు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు.

  • గుడ్​న్యూస్​.. ఎస్సై, కానిస్టేబుళ్ల ప్రాథమిక రాత పరీక్షలో కటాఫ్‌ మార్కుల తగ్గింపు

ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించేందుకు నిర్ణయించిన కటాఫ్‌ మార్కులను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీలతో సంబంధం లేకుండా 10 శాతం తగ్గిస్తూ టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నిర్ణయం తీసుకుంది.

  • ప్రయాణికులకు ముఖ్య గమనిక.. నగరంలో నేడు ట్రాఫిక్​ ఆంక్షలు

సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్​ ఆంక్షలు అమలు కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.

  • ఆ జాతీయ రహదారిపై అర్ధరాత్రి అక్రమ వసూళ్లు.. వెలుగులోకి నమ్మలేని నిజాలు..

చీకటైతే చాలు.. ఆ ముఠా రోడ్డు మీదకు వస్తుంది. రేడియం స్టిక్కర్ల పేరుతో దర్జాగా నడిరోడ్డు మీద దోచుకుంటుంది. అయితే ఇలాంటి అక్రమాలను అరికట్టాల్సిన పోలీసులు.. ఈ ముఠాకు రక్షణ కల్పించటం బాధాకర విషయం. రేడియం స్టిక్కర్ల పేరుతో వాహనాదారులను అడ్డగోలుగా దోచుకుంటున్న తీరు ఈటీవీ-ఈటీవీ భారత్​ నిఘాలో బట్టబయలైంది.

  • ఇంద్రకీలాద్రిపై భక్తుల అవస్థలు.. సీఎం, ఈవో డౌన్​ డౌన్​ అంటూ నినాదాలు

అధికారుల ప్రణాళికా లోపంతో ఇంద్రకీలాద్రిపై భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు.. క్యూలైన్లలో అల్లాడిపోయారు.

  • దుర్గా మండపంలో అగ్నిప్రమాదం- ఐదుగురు మృతి

దసరా నవరాత్రి వేడుకల్లో విషాదం నెలకొంది. ఉత్తర్​ప్రదేశ్​ భదోహిలో దుర్గమ్మ మండపంలో అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కాగా మిగిలిన ఇద్దరు మహిళలు.

  • గాంధీని తలపించేలా 'అసుర' రూపం.. హిందూ మహాసభ దుర్గా మండపంపై దుమారం

అఖిల భారతీయ హిందూ మహాసభ కోల్​కతాలో ఏర్పాటు చేసిన దుర్గా మండపం వివాదాస్పదమైంది. దుర్గమ్మ పాదాల కింద ఉండే అసురుడి(రాక్షసుడి) రూపం మహాత్మా గాంధీని తలపించడం దుమారం రేపింది.

  • పెన్షన్ లైఫ్​ సర్టిఫికెట్ సమర్పించాలా? ఇలా అయితే ఈజీ!

పెన్షన్​ కోసం లైఫ్​ సర్టిఫికెట్ సమర్పించాల్సిన సమయం వచ్చింది. డిజిటలీకరణకో ఇప్పుడు ఈ పని చాలా సులువుగా పూర్తి చేయొచ్చు. అదెలాగో తెలుసుకోండి.

  • ఆ ఘనత సాధించిన తొలి కెప్టెన్​గా రికార్డ్​​.. గాయంతోనే ఆడి..

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. అయినా పెయిన్​ కిల్లర్స్​ వేసుకుని అలానే ఆడాడు. ప్రస్తుతం అతడి గాయం తీవ్రతపై స్పష్టత లేదు. ఇక మ్యాచ్​ అయిపోయాక డెత్ ఓవర్ల సమస్యతో పాటు పలు విషయాల గురించి మాట్లాడాడు.

  • వర్ష-ఇమ్మాన్యుయెల్ పెళ్లికి చీఫ్​ గెస్ట్​గా చిరు,నాగ్, పవన్​!

జబర్దస్త్​ జోడీ వర్ష-ఇమ్మాన్యుయెల్​ తమ పెళ్లికి మెగాస్టార్​ చిరంజీవి, పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​, కింగ్ నాగార్జునను ఆహ్వానించారు! ఆ సంగతులు..

  • ఈ బ్యూటీ.. ఆ సినిమా చైల్డ్​ ఆర్టిస్టా?

పొన్నియిన్​ సెల్వన్​ నటించిన ఓ అమ్మాయి ప్రస్తుతం సోషల్​మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు వైరల్​ అవుతున్నాయి. ఇంతకీ ఆ చిన్నారి ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. తన గురించే ఈ స్టోరీ.

Last Updated : Oct 3, 2022, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.