ETV Bharat / city

1పీఎం టాప్​న్యూస్

author img

By

Published : Aug 14, 2022, 12:58 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1PM TOPNEWS
1PM TOPNEWS

  • రాకేశ్ ఝున్​ఝున్​వాలా జీవితమే ఓ ఆర్థిక మంత్రం

భారత స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది. మార్కెట్‌ అంటే పెట్టిన డబ్బు తిరిగి వస్తుందో లేదో అన్న భయాలున్న భారత్‌కు పెట్టుబడి పాఠాలు నేర్పిన గురువు ఇక లేరు.. మార్కెట్‌లో డబ్బును ఎలా మదుపు చేయాలో సువర్ణ సూత్రాలను ఆయన లిఖించారు.

  • చనిపోయినట్టు నటించి చిరుతకు షాకిచ్చిన శునకం

కర్ణాటక ఉడుపిలో ఇంటి బయట నిద్రిస్తున్న ఓ శునకం చిరుత దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకుంది. చిరుతతో విరోచితంగా పోరాడింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి మరణించినట్లు నటించింది. తద్వారా ప్రాణాలను కాపాడుకుంది.

  • ఆర్టీసీకి రాఖీ గిరాకి, రికార్డు స్థాయిలో ఆదాయం

రాష్ట్రంలో రోజువారీ ఆదాయం రికార్డులను టీఎస్​ఆర్టీసీ తిరగరాసింది. రాఖీపౌర్ణమి రోజున రికార్డుస్థాయిలో ఆదాయం పెరిగింది. ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజు ఆదాయం రూ.20కోట్లు దాటింది.

  • బైక్​పై నుంచి కిందపడ్డ స్వామిగౌడ్​, రోడ్లు సరిగా లేకపోవడం వల్లేనని ఆగ్రహం

తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్​కు తృటిలో ప్రమాదం తప్పింది. రోడ్డు ప్రమాదంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. అయితే గుంతలున్న రోడ్ల వలనే తనకు ప్రమాదం జరిగిందని.. స్వామిగౌడ్ అధికారులపై మండిపడ్డారు.

  • మంత్రి పేరుతో వాట్సప్‌ చాటింగ్‌, సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు

మంత్రి నిరంజన్​రెడ్డి పేరుతో గుర్తుతెలియని వ్యక్తి ఓ సెల్​ఫోన్​ నంబరు ద్వారా వాట్సప్ చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. మంత్రి ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టుకుని అధికారులకు, నేతలకు సందేశాలు పంపాడు. దీంతో మంత్రి పీఆర్వో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 14,092 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. రికవరీ రేటు 98.54 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.26 శాతానికి పడిపోయాయి.

  • ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బంగారం ధర ఎంతంటే

బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

  • ఆ సూపర్​హిట్​ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తానంటున్న రౌడీ హీరో

విక్రమ్ సినిమా దర్శకుడు లోకేష్ క‌న‌క‌రాజ్‌తో సినిమా చేయాలనుందని అన్నారు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. చెన్నైలో జ‌రిగిన లైగ‌ర్ ప్రమోషన్​ ఈవెంట్‌లో లోకేష్ క‌న‌క‌రాజ్‌పై విజ‌య్ ప్ర‌శంస‌లు కురిపించారు.

  • లైట్ గడ్డంతో మహేశ్ బాబు కొత్త లుక్ అదుర్స్

మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్​తో సూపర్​స్టార్​ మ‌హేశ్​ బాబు తన కొత్త సినిమా చేయనున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా ప్రారంభంకానుంది. అయితే ఈ సినిమాలో మ‌హేశ్​ లుక్‌పై ఓ క్లారిటీ వచ్చేసింది.

  • ఉత్తమ నటుడిగా​ ఆస్కార్ రేసులో తారక్​

హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరు నెట్టింట మారుమోగిపోతోంది. ఆస్కార్ రేసులో తారక్ ఉన్నారంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఉత్తమ నటుడి క్యాటగిరీలో ఎన్టీఆర్ పేరు కచ్చితంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.