ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 9PM - టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9PM TOPNEWS
9PM TOPNEWS
author img

By

Published : Jun 18, 2022, 8:59 PM IST

  • 'సికింద్రాబాద్‌ అల్లర్లలో ప్రత్యక్షంగా రూ.12 కోట్ల ఆస్తినష్టం'

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ జరిగిన అల్లర్లలో ప్రత్యక్షంగా రూ.12కోట్ల ఆస్తినష్టం జరిగిందని డివిజనల్ మేనేజర్‌ గుప్తా తెలిపారు. రైళ్ల రద్దుతో జరిగిన నష్టంపై అంచనా వేస్తున్నామన్నారు.

  • అశ్రునయనాల మధ్య ముగిసిన రాకేష్​ అంత్యక్రియలు

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో మరణించిన రాకేష్ అంత్యక్రియలు స్వగ్రామం దబీర్‌పేటలో ముగిశాయి. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్‌, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు రాకేష్‌ పాడే మోశారు.

  • సికింద్రాబాద్​ ఘటనలో 50మంది అరెస్ట్...

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆస్తుల విధ్వంసంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రాథమికంగా సేకరించిన ఆధారాలతో 50మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ విడతలవారీగా గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు.

  • పోలీసుల కళ్లుగప్పి గాంధీ ఆస్పత్రిలోకి రేవంత్‌రెడ్డి

గాంధీ ఆస్పత్రి వద్ద కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. సికింద్రాబాద్‌ ఘటన క్షతగాత్రులను పరామర్శించేందుకు గాంధీ ఆస్పత్రికి రేవంత్‌ రెడ్డి వెళ్లారు. పోలీసులు భారీగా మోహరించడంతో ఆస్పత్రి వెనుక గేటు నుంచి లోపలికి వెళ్లి యువకుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

  • ఆగని 'అగ్గి'.. వాహనాలు 'బుగ్గి'..

సైనికుల ఎంపిక కోసం కేంద్ర కొత్తగా ప్రతిపాదించిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌లలో యువత చేపట్టిన నిరసన ప్రదర్శనలు ఉద్రిక్తంగా మారాయి.

  • 'ఆ విషయంలో తగ్గేదే లే'.. అగ్నిపథ్‌ పథకంపై రాజ్‌నాథ్‌

అగ్నిపథ్​ పథకంపై దేశవ్యాప్తంగా నిరసలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నేవీ, ఎయిర్​ఫోర్స్​ చీఫ్​తో పాటు ఆర్మీ వైస్​చీఫ్​తో భేటీ అయ్యారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. ఈ పథకం అమలుపై సమీక్ష చేపట్టిన రాజ్​నాథ్​.. అగ్నిపథ్​ను మరోసారి సమర్థించారు.

  • స్వల్పంగా తగ్గిన బంగారం ధర..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.52,640గా ఉంది. కిలో వెండి ధర రూ.62,668గా ఉంది. క్రిప్టోకరెన్సీలు కూడా నష్టాలను నమోదు చేస్తున్నాయి.

  • లంకలో దయనీయ పరిస్థితులు​..

శ్రీలంకలో సోమవారం నుంచి ప్రభుత్వ రంగంలోని కార్యాలయాలు మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సుదీర్ఘమైన విద్యుత్తు కోతల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైలీ మిర్రర్‌ దినపత్రిక పేర్కొంది.

  • ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు సెంచరీలు..

నెదర్లాండ్స్​తో మ్యాచ్​లో విజృంభించిన ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏకంగా 498 పరుగులతో వన్డే చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేశారు. సాల్ట్, మలన్, బట్లర్.. ముగ్గురూ​ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వన్డేల్లో ఇలాంటి అరుదైన సంఘటన గతంలోనూ రెండుసార్లు జరిగింది. అది ఎప్పుడంటే..

  • థియేటర్‌లోనే ఏడ్చేసిన సదా..

ఇటీవలే ఓ సినిమా చూస్తూ భావోద్వేగానికి గురయ్యారు నటి సదా. థియేటర్​లోనే కంటతడి పెట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.