ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 9AM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS
టాప్ న్యూస్ @ 9AM
author img

By

Published : Jun 2, 2022, 8:59 AM IST

  • రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు

ఎనిమిదేళ్ల ప్రాయాన్ని పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రం.. అవతరణ ఉత్సవాలకు ముస్తాబైంది. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ఈ మారు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అమరులకు అంజలి ఘటించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు నిర్వహించనున్నారు. సాయంత్రం కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరపనున్నారు.

  • జయహో తెలంగాణ

ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించారు. అనంతరం మిఠాయిలు పంచారు.

  • చెప్పులు లేకుండా పరుగెత్తిన మహిళ రికార్డు

ఆమె పరుగుకు జనం సలాం కొట్టారు. రాజకీయ, ప్రభుత్వ అధికారులు మంత్రముగ్ధులయ్యారు. తోటివారు ఆశ్చర్యపోయారు. 30 ఏళ్లు పైబడిన మహిళ తన అసాధారణ పరుగుతో అందర్ని ఆకట్టుకుంది. గట్టిగా అనుకోవాలే గాని మనిషి సాధించనిది ఏదీ లేదంటూ మరోమారు నిరూపించింది.

  • అర్ధరాత్రి అగ్నిప్రమాదం

Fire Accident at nanakramguda: హైదరాబాద్​లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నానక్‌రామ్‌గూడలోని ఓ ఆపార్ట్​మెంట్​లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అపార్ట్​మెంట్ వాసులు బయటకు పరుగులు తీశారు.

  • తరగతి గదిగా డబుల్‌ డెక్కర్‌ బస్‌

Bus Becomes Classroom: కేరళ ప్రభుత్వం మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఓ డబుల్​ డెక్కర్​ బస్సును పాఠశాలగా మార్చింది. ఇది విద్యార్థులకు ఆకర్షణీయ కానుకగా మారింది.

  • 'గదర్​ ఉద్యమం'తో బ్రిటిషర్లకు చుక్కలు!

Azadi Ka Amrit Mahotsav: పొట్ట చేత పట్టుకొని అమెరికా వెళ్లిన భరతమాత ముద్దుబిడ్డలు కన్నభూమి బానిస సంకెళ్లు తెంపటానికి అక్కడి నుంచే 'గదర్‌' అంటూ గర్జించారు. సప్త సముద్రాల ఆవలి నుంచే సాయుధ పథంలో విప్లవశంఖం పూరించారు. లక్ష్య సాధన కష్టమైనా.. బ్రిటిష్‌ పాలకులకు నిద్రలేకుండా చేసింది.. గదర్‌ ఉద్యమం!

  • 16 లక్షలకు పైగా ఖాతాలపై వాట్సాప్‌ నిషేధం

WhatsApp Ban Accounts: ఐటీ నిబంధనలను ఉల్లంఘించే యూజర్లపై గత కొంతకాలంగా చర్యలు తీసుకుంటున్న వాట్సాప్​.. తాజాగా ఏప్రిల్‌ మాసానికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే భారత్‌లో 16.6 లక్షల ఖాతాలను నిషేధించినట్టు వెల్లడించింది.

  • 'ఆఫీస్‌కు రండి.. లేదంటే గెట్‌ ఔట్‌'

Elon Musk Ultimatum Employees: టెస్లా సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌.. తన సంస్థ ఉద్యోగులకు హెచ్చరిక జారీ చేశారు. ఇక నుంచి వర్క్​ ఫ్రమ్​ హోమ్​ కుదరదని స్పష్టం చేశారు. తప్పనిసరిగా కార్యాలయానికి వచ్చి పని చేయాల్సిందేనని.. లేదంటే టెస్లాను వీడిపోవచ్చంటూ ఘాటుగా హెచ్చరించారు.

  • పరువు నష్టం కేసు గెలిచిన జానీ డెప్

Johnny Depp wins defamation case: 'పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్' ఫేమ్, హాలీవుడ్ స్టార్ హీరో జానీడెప్.. మాజీ భార్య అంబర్​హెర్డ్​పై వేసిన పరువు నష్టం కేసులో గెలిచాడు. హెర్డ్​ తనపై కల్పిత ఆరోపణలు చేసిందన్న డెప్​ వాదనను జ్యూరీ సమర్థించింది. అతడికి రూ.116 కోట్ల పరిహారం చెల్లించాలని తీర్పుచెప్పింది.

  • 'పతకాలతోనే మాట్లాడతా'..

Dhanush Srikanth: పుట్టుకతోనే చెవులు వినబడకున్నా, మాటలు రాకున్నా అతడు కుంగిపోలేదు. ఇతరులతో తానేమీ తక్కువ కాదంటూ తుపాకీ చేతబట్టి దేశానికి పతకాలు సాధిస్తున్నాడు. ఇటీవలే డెెఫ్​లింపిక్స్​లో రెండు స్వర్ణాలతో చరిత్ర సృష్టించాడు. అతడే తెలుగు కుర్రాడు ధనుష్ శ్రీకాంత్​. పతకాలతోనే మాట్లాడుతా అంటున్న శ్రీకాంత్.. తన తదుపరి గమ్యాలపై దృష్టిసారించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.