ETV Bharat / city

Telangana Top News: టాప్ న్యూస్ @1PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News: టాప్ న్యూస్ @1PM
Telangana Top News: టాప్ న్యూస్ @1PM
author img

By

Published : May 26, 2022, 12:59 PM IST

Revanth Letter to PM Modi : తెలంగాణ ఏర్పాటు గురించి ప్రధాని మోదీ అవమానించేలా మాట్లాడారని.. నేడు హైదరాబాద్‌కు వస్తోన్న ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపక్షణ చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా 9 అంశాలను ప్రస్తావిస్తూ బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో భాజపా, తెరాస విఫలమయ్యాయని అన్నారు.

  • హైదరాబాద్​లో కూరగాయల ధరలు ఇలా..!!

Vegetables Price in Hyderabad Today : హైదరాబాద్​ మోడల్​ రైతు బజార్​ ఎర్రగడ్డలో గురువారం (26-05-22) కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • పసుపు పండుగకు సర్వం సిద్ధం..!

తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండగకు సర్వం సిద్ధమవుతోంది. రెండు రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమంతో పాటు.. పొలిట్​బ్యూరో సమావేశం సైతం ఏపీలోని ప్రకాశం జిల్లాలోనే నిర్వహించాలని నిర్ణయించడంతో ఒక రోజు ముందుగానే పండగ మొదలుకానుంది. మహానాడు సన్నాహక కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది.

  • 'మెక్​డీ' కూల్​డ్రింక్​లో బల్లి..

Mcdonalds lizard: కూల్​ డ్రింక్​లో బల్లి పడినా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మెక్​డొనాల్డ్స్​ స్టోర్​ను అధికారులు సీజ్​ చేశారు. గుజరాత్​లోని అహ్మదాబాద్​లో జరిగిందీ ఘటన.

  • కుమారుడి పబ్​జీ ఆటకు తల్లి బలి!

PUBG Addiction: పబ్​జీ.. దీనికి బానిసై అనేక మంది పిల్లలు ప్రాణాలు కోల్పోగా.. ఎన్నో కుటుంబాల మధ్య చిచ్చు పెడుతోంది. తాజాగా ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. పబ్​జీ ఆడుతున్న కొడుకును భర్త కొడుతుండగా.. అడ్డుకోబోయిన ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

  • వాహనదారులకు బ్యాడ్ న్యూస్​..

third party insurance: థర్డ్​ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్​ ప్రీమియం ధరలను స్వల్పంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ. పెరిగిన ధరలు జూన్ 1న అమల్లోకి వస్తాయని పేర్కొంది.

  • రూ.20 లక్షలకూ అమ్ముడుపోలేదు.. ఇప్పుడేమో..

IPL 2022: ఐపీఎల్​ ప్లే ఆఫ్స్​లో అద్భుత శతకంతో ఆర్​సీబీని ఒంటిచేత్తో గెలిపించాడు రజత్ పటీదార్​. తన జట్టును క్వాలిఫయర్ 2కు చేర్చాడు. అయితే ఈ యువ ఆటగాడు ఐపీఎల్​ వేలం పాటలో రూ.20లక్షలకు కూడా అమ్ముడు పోలేదని మీకు తెలుసా? ఓ ప్లేయర్​కు గాయం కారణంగా జట్టులోకి వచ్చిన పటీదార్​.. అవకాశాలను అందిపుచ్చుకుని సత్తా చాటాడు. ఇప్పుడు అన్ని ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు.

  • వారితో డేటింగ్ భయంకరంగా ఉండేది..​

టాలీవుడ్​ టు బాలీవుడ్​లో వరస ​సినిమాలతో స్టార్​ హీరోయిన్​ శృతి హాసన్​ బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్​ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, సహజీవనం విషయాలపై ఆసక్తికరమైన కామెంట్స్​ చేశారు. ఆమె తల్లిదండ్రులు కమల్​-సారిక విడాకులపైనా స్పందించారు.

  • బెంగళూరుకు సీఎం కేసీఆర్..

KCR Bangalore Tour: సీఎం కేసీఆర్ బెంగళూరుకు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరారు. కాసేపట్లో మాజీ ప్రధాని దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సీఎం సమావేశంకానున్నారు.

  • 'మోదీ జీ.. ఇవన్నీ ఎప్పుడిస్తారు?'..

ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో నగరంలో పలు చోట్ల బ్యానర్లు వెలిశాయి. తెలంగాణకు కేంద్రం ఇస్తామన్న హామీలకు సంబంధించి వాటిని ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నిస్తూ బ్యానర్లు కట్టారు.

  • మోదీ క్షమాపణ చెప్పాలి..

Revanth Letter to PM Modi : తెలంగాణ ఏర్పాటు గురించి ప్రధాని మోదీ అవమానించేలా మాట్లాడారని.. నేడు హైదరాబాద్‌కు వస్తోన్న ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపక్షణ చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా 9 అంశాలను ప్రస్తావిస్తూ బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో భాజపా, తెరాస విఫలమయ్యాయని అన్నారు.

  • హైదరాబాద్​లో కూరగాయల ధరలు ఇలా..!!

Vegetables Price in Hyderabad Today : హైదరాబాద్​ మోడల్​ రైతు బజార్​ ఎర్రగడ్డలో గురువారం (26-05-22) కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • పసుపు పండుగకు సర్వం సిద్ధం..!

తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండగకు సర్వం సిద్ధమవుతోంది. రెండు రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమంతో పాటు.. పొలిట్​బ్యూరో సమావేశం సైతం ఏపీలోని ప్రకాశం జిల్లాలోనే నిర్వహించాలని నిర్ణయించడంతో ఒక రోజు ముందుగానే పండగ మొదలుకానుంది. మహానాడు సన్నాహక కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది.

  • 'మెక్​డీ' కూల్​డ్రింక్​లో బల్లి..

Mcdonalds lizard: కూల్​ డ్రింక్​లో బల్లి పడినా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మెక్​డొనాల్డ్స్​ స్టోర్​ను అధికారులు సీజ్​ చేశారు. గుజరాత్​లోని అహ్మదాబాద్​లో జరిగిందీ ఘటన.

  • కుమారుడి పబ్​జీ ఆటకు తల్లి బలి!

PUBG Addiction: పబ్​జీ.. దీనికి బానిసై అనేక మంది పిల్లలు ప్రాణాలు కోల్పోగా.. ఎన్నో కుటుంబాల మధ్య చిచ్చు పెడుతోంది. తాజాగా ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. పబ్​జీ ఆడుతున్న కొడుకును భర్త కొడుతుండగా.. అడ్డుకోబోయిన ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

  • వాహనదారులకు బ్యాడ్ న్యూస్​..

third party insurance: థర్డ్​ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్​ ప్రీమియం ధరలను స్వల్పంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ. పెరిగిన ధరలు జూన్ 1న అమల్లోకి వస్తాయని పేర్కొంది.

  • రూ.20 లక్షలకూ అమ్ముడుపోలేదు.. ఇప్పుడేమో..

IPL 2022: ఐపీఎల్​ ప్లే ఆఫ్స్​లో అద్భుత శతకంతో ఆర్​సీబీని ఒంటిచేత్తో గెలిపించాడు రజత్ పటీదార్​. తన జట్టును క్వాలిఫయర్ 2కు చేర్చాడు. అయితే ఈ యువ ఆటగాడు ఐపీఎల్​ వేలం పాటలో రూ.20లక్షలకు కూడా అమ్ముడు పోలేదని మీకు తెలుసా? ఓ ప్లేయర్​కు గాయం కారణంగా జట్టులోకి వచ్చిన పటీదార్​.. అవకాశాలను అందిపుచ్చుకుని సత్తా చాటాడు. ఇప్పుడు అన్ని ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు.

  • వారితో డేటింగ్ భయంకరంగా ఉండేది..​

టాలీవుడ్​ టు బాలీవుడ్​లో వరస ​సినిమాలతో స్టార్​ హీరోయిన్​ శృతి హాసన్​ బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్​ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, సహజీవనం విషయాలపై ఆసక్తికరమైన కామెంట్స్​ చేశారు. ఆమె తల్లిదండ్రులు కమల్​-సారిక విడాకులపైనా స్పందించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.