ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top news
టాప్ న్యూస్ @ 7PM
author img

By

Published : Apr 23, 2022, 6:59 PM IST

  • ' ప్రగతిభవన్​ను ప్రజాభవన్​గా మారుస్తాం'

Kishan Reddy on pragathi bhavan: కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తెరాస నేతలు పబ్బం గడుపుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెరాస నేతల ఆగడాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో.. రాష్ట్ర సర్కారు ఎంత ఖర్చు చేసిందో చర్చకు సిద్ధమా అంటూ కేంద్ర మంత్రి సవాల్​ విసిరారు. ఇప్పుడు ప్రగతిభవన్​ కల్వకుంట్ల ప్రగతిభవన్​గా ఉందని.. దానిని భవిష్యత్​లో​ తెలంగాణ ప్రజాభవన్​గా మారుస్తామని కిషన్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

  • 'నాకు ఉప ప్రధాని ఇస్తానంటే.. నేనే వద్దన్నా..'

KA Paul Comments: రాజకీయ నాయకులంతా.. పోటీ పడి మరీ దోచుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​ మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన మొత్తం గాడి తప్పిందని విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లోపు దేశమంతా పర్యటిస్తానని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి తెలంగాణలో 72, ఆంధ్రప్రదేశ్‌లో 102 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

  • 'ప్రగతిభవన్ కేంద్రంగా దందా '

Kodandaram on TRS: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. ప్రగతిభవన్‌ కేంద్రంగా కాంట్రాక్టర్ల కమిషన్ దందా నడుస్తోందని ఆరోపించారు. ఉద్యోగ ప్రకటన చేసి నెల దాటినా ఒక్క నోటిఫికేషన్ లేదని మండిపడ్డారు.

  • ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రి ఆవరణలో చెత్తను కాల్చే క్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

  • 50 కేజీల నిమ్మకాయలు చోరీ.. సీసీటీవీ దృశ్యాలు వైరల్

నిమ్మకాయలు మార్కెట్​లో భారీ ధర పలుకుతున్నాయి. రాజస్థాన్​లోని జైపుర్ ముహానా మండీలో కేజీ నిమ్మకాయలు రూ.400కు విక్రయిస్తున్నారు. దీంతో దొంగల కళ్లు నిమ్మకాయలపై పడింది.

  • చేయని నేరానికి 28 ఏళ్లు శిక్ష

accused released after 28 years: చేయని నేరానికి 28 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు ఓ వ్యక్తి. యువకుడిగా జైలుకు వెళ్లి.. ఐదుపదులు దాటిన తర్వాత బయటకు వచ్చాడు. నిర్దోషి అని తేలగానే కోర్టులోనే బోరున విలపించాడు. అసలేమైందంటే?

  • మ్యాన్​హోల్​లో పడిన మహిళ-చివరికి..!

ఓ మహిళ మ్యాన్​హోల్​లో పడిన ఘటన బిహార్​లోని పట్నాలో గురువారం(ఏప్రిల్​ 21) జరిగింది. అలమ్​గంజ్​ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు.. సీసీటీవీల్లో రికార్డయ్యాయి

  • దేశం ప్రశాంతంగా ఉందంటే వారే కారణం

'దేశభద్రతను కాపాడుతున్న జవాన్ల త్యాగాన్ని గౌరవించుకోవడం మన అందరి బాధ్యత' అని మెగా హీరో రామ్‌చరణ్‌ అన్నారు. 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌'లో భాగంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లోని యుద్ధవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు.​

  • రెజ్లర్​ రవి దహియాకు గోల్డ్​​.. పునియాకు సిల్వర్

Asian championship wrestling 2022: ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్స్ రజత పతక విజేత, భారత కుస్తీవీరుడు రవికుమార్‌ దహియా సత్తా చాటాడు. రెజ్లింగ్‌ 57 కిలోల పురుషుల ఫ్రీస్టైల్ విభాగంలో దహియా స్వర్ణ పతకం సాధించాడు. మరోవైపు.. 67 కేజీల విభాగంలో రజతం సాధించాడు బజరంగ్​ పునియా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.