ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు 'బూస్టర్ డోస్ పంపిణీ' Booster Dose in Telangana : కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభమైంది. హైదరాబాద్ యునానీ ఆస్పత్రిలో బూస్టర్ డోస్ పంపిణీని ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన వారు 8.3 లక్షల మంది ఉన్నట్లు అంచనా వేశామని తెలిపారు. రెండో డోస్ తీసుకుని 9 నెలలు దాటిన వారికే బూస్టర్ డోస్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.'మనల్ని కాపీ కొడుతున్నారు' KTR about Rythu bandhu : తెరాస అంటే తెలంగాణ రైతు సర్కార్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జోరుగా రైతుబంధు సంబురాలు జరుగుతున్నాయని... కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వివిధ రూపాల్లో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.అప్పుడే లాక్‌డౌన్‌పై నిర్ణయం.. Kishan Reddy On Lockdown: దేశంలో లాక్డౌన్ విధింపుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్డౌన్ సహా ఆంక్షలు విధించే అధికారం రాష్ట్రాలకు ఇచ్చినట్లు చెప్పారు. సంక్రాంతి తర్వాత దేశంలోని పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటుందన్నారు. మహాకుట్ర ఉంది Bandi Sanjay mouna deeksha: ప్రధాని పర్యటనలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరపడంతో పాటు బాధ్యులందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. పంజాబ్‌లో కాన్వాయ్‌ని నిరసనకారులు అడ్డుకున్న ఘటనలో మహా కుట్ర ఉందని ఆరోపించారు. తల్లి, సోదరి అరెస్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ-3, ఏ-4గా ఉన్న రామకృష్ణ సూర్యవతి, సోదరి మాధవిని పోలీసులు అరెస్టు చేశారు. పెరుగుతున్న కరోనా కేసులు తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 70,697 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1825 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. 'మోదీని ఆపింది మేమే' Sikhs for Justice threatening calls: పంజాబ్‌లో ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాల పాటు నిలిచిపోవడానికి కారణం తామేనంటూ సిక్కు వేర్పాటువాద సంస్థ 'సిక్స్ ఫర్ జస్టిస్' ప్రకటించుకుంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరపొద్దంటూ బెదిరింపులకు పాల్పడింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అత్యున్నత ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చింది.కరోనాపై కేంద్రం అలర్ట్ India covid news: ప్రస్తుతం యాక్టివ్ కేసుల్లో 5-10 శాతం మంది రోగులకు ఆస్పత్రి చికిత్స అవసరమవుతోందని కేంద్రం పేర్కొంది. పరిస్థితి అస్థిరంగా ఉందని, ఆస్పత్రి చేరికలు పెరగొచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కీలక సూచనలు చేసింది. మరోవైపు, కరోనా నేపథ్యంలో రాష్ట్రాలు మరిన్ని ఆంక్షలను అమలు చేస్తున్నాయి.టికెట్ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించా RGV meet perni nani: సినిమా టికెట్ ధరల సమస్యకు సామరస్య పరిష్కారం వస్తుందని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ అన్నారు. ఏపీ సినిమాటోగ్రఫీమంత్రి పేర్నినానిని సచివాలయంలో కలిసిన వర్మ.. టికెట్ ధర తగ్గిస్తే ఆ ప్రభావం సినిమా నాణ్యతపై పడుతుందని చెప్పారు. కోహ్లీ సాధించేనా? Kohli Record: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని భారత జట్టు ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే సిరీస్ 1-1తో సమం కాగా కేప్‌టౌన్‌లో జరగబోయే టెస్టులో గెలవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఈ టెస్టు ద్వారా ఓ రికార్డు నెలకొల్పాలని టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎదురుచూస్తున్నాడు.