ETV Bharat / city

Telangana News Today: టాప్​న్యూస్​ @ 9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS IN TELANGANA TODAY
TOP NEWS IN TELANGANA TODAY
author img

By

Published : Oct 3, 2022, 9:01 AM IST

  • జాతీయ రాజకీయాల్లోకి 'కారు'.. వేగం ఏమాత్రం తగ్గకుండా గట్టి ప్రణాళికలు..

జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు గులాబీ దళం సిద్ధమైంది. కొత్తగా పార్టీ పెట్టకుండా.. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలోని ప్రాంతీయ పార్టీనే ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేయనుంది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఇతర రాష్ట్రాల్లో ఆమోదించలేరు కాబట్టి.. భారత రాష్ట్రీయ సమితిగా మార్చనున్నారు.

తొమ్మిది రోజుల పాటు సందడిగా సాగిన.. బతకుమ్మ పండుగ వేడుకలు నేటితో ముగియనున్నాయి. రాష్ట్రమంతా సద్దుల బతుకమ్మకు సర్వం సిద్దమైంది. ఓరుగల్లులో ఆలయాలు, చెరువుల వద్ద అధికారులు సద్దుల బతుకమ్మ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.

  • హైదరాబాద్​లో ఉగ్ర కుట్ర భగ్నం.. ముగ్గురి అరెస్టు​.. పాకిస్థాన్ గ్రనేడ్లు స్వాధీనం

హైదరాబాద్‌ జంటనగరాల్లో పేలుళ్లకు పాల్పడేందుకు పాకిస్థాన్‌ కేంద్రంగా జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పథకం ప్రకారం అలజడి సృష్టించేందుకు కశ్మీర్‌ నుంచి గ్రనేడ్లను నగరానికి తీసుకువచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. మూసారాంబాగ్‌ వాసి అబ్దుల్‌ జాహెద్‌ పాక్‌ ముష్కరులతో నిత్యం సంప్రదింపులు సాగిస్తున్నాడు.

సరికొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యమంటూ 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందానికి తొలిరోజే షాక్ తగిలింది. యాత్ర మొదటిరోజైన ఆదివారం పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది.

  • 'ఎన్నిసార్లు పెళ్లయింది? ప్రస్తుత భర్త ఎవరు?'.. లేడీ తహసీల్దార్​కు RTI కార్యకర్త ప్రశ్నలు

ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సామాన్యులు సైతం సులువుగా పొందగలిగేలా చేసింది సమాచార హక్కు చట్టం. అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చేందుకు, ఎంతో మందికి న్యాయం జరిగేందుకు కారణమైంది. అలాంటి బ్రహ్మాస్త్రాన్ని సిల్లీ పనులకు ఉపయోగించి కటకటాలపాలయ్యాడు ఓ వ్యక్తి.

  • ఎలుక పోయిందని కేస్.. వారిపైనే డౌట్.. పోలీసుల ప్రత్యేక దర్యాప్తు!

ఎలుక పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడో వ్యక్తి. గుర్తించేందుకు అవసరమైన ఆనవాళ్లన్నీ వివరించాడు. ఎవరిపై అనుమానం ఉందో కూడా చెప్పాడు. ఎన్నడూ చూడని కేసుపై 'ప్రత్యేక' దర్యాప్తు చేస్తున్నారు రాజస్థాన్​ పోలీసులు.

  • రష్యా సైనికుల అకృత్యాలు.. వెలుగులోకి 10 చిత్రహింస కేంద్రాలు.. సామూహికంగా..

ఉక్రెయిన్‌లో రష్యా సైనికుల అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు మాస్కో సైన్యం నియంత్రణలో ఉన్న ఇజియం నగరంలో పది చిత్రహింస కేంద్రాలు, పెద్దపెద్ద సామూహిక ఖననాలు జరిపిన ప్రదేశాలు వెలుగులోకి వచ్చాయి.

  • జాతీయ క్రీడల్లో రష్మీకి రజతం

జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. ఆదివారం మరో రెండు రజతాలు ఆ రాష్ట్రం ఖాతాలో చేరాయి. మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో పల్లవి, ట్రిపుల్‌ జంప్‌లో కార్తీక వెండి పతకాలు గెలుచుకున్నారు.

  • స్టేడియంలో 'ఫ్యాన్స్​ ఫైట్​'​

ఇండోనేషియాలోని ఫుట్‌బాల్‌ మైదానంలో జరిగిన దారుణ ఘటన క్రీడా ప్రపంచాన్ని కదిలించింది. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూద్దామని వచ్చిన ప్రేక్షకుల్లో 125 మంది అభిమానులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం పెద్ద విషాదమే.

  • వామ్మో.. నోరా ఫతేహి ధరించిన ఈ డ్రెస్​ ధర అన్ని లక్షలా?

బాలీవుడ్ అందాల బ్యూటీ నోరా ఫ‌తేహి.. ఈ పేరుకు నార్త్​లోనే కాదు ఇటు సౌత్​లోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు.కెనడాకు చెందిన ఈ హాట్ బాంబ్‌ కంటి చూపుతో కుర్రాళ్ల‌ని అలా క‌ట్టిప‌డేస్తుంది. ఈ మల్టీటాలెంటెడ్​ భామ.. మోడ‌ల్​గా కెరీర్​ను స్టార్ట్ చేసి.. స్పెషల్​ సాంగ్స్​ డ్యాన్సర్​ సింగర్​, నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.