ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్​ @ 9AM - Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
author img

By

Published : Sep 22, 2022, 9:01 AM IST

  • పీఎఫ్ఐ కార్యకలాపాలపై దేశవ్యాప్తంగా సోదాలు.. 100 మంది అరెస్ట్​

దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలపై ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఉత్తర్​ప్రదేశ్, కేరళ సహా దేశవ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయి. పీఎఫ్ఐకి చెందిన కీలక వ్యక్తుల నివాసాల్లో దాడులు చేసి.. దేశవ్యాప్తంగా 100 మందిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం తెలంగాణలోని నిజామాబాద్​, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఎన్​ఐఏ సోదాలు నిర్వహించి పలువురు పీఎఫ్ఐకి చెందిన వారిని అదుపులోకి తీసుకుంది.

  • నేడే ​ఇండియా-ఆస్ట్రేలియా రెండో టీ20 టికెట్‌ విక్రయాలు

టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల అమ్మకంపై గందరగోళం కొనసాగుతోంది. 'పేటీఎం' వేదికగా టిక్కెట్లు అమ్మినట్లు మొదట ప్రకటించిన హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ).. అభిమానులు ఆందోళనకు దిగడంతో గురువారం టికెట్లు అమ్మనున్నట్లు తెలిపింది. 39,000 టికెట్లు ఏమయ్యాయి అంటూ బుధవారం క్రికెట్‌ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు.

  • తెలుగు రాష్ట్రాల కుబేరులు వీళ్లే.. దివీస్ అధినేత మురళిదే అగ్రస్థానం

Richest Persons In Telugu States :తెలుగు రాష్ట్రాల్లో రూ.1,000 కోట్లకు మించిన ఆస్తి గల కుబేరులు 78 మంది ఉన్నట్లు ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ తేల్చింది. వీరి మొత్తం సంపద విలువ రూ.3.90 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు స్పష్టం చేసింది. దాదాపు రూ.56,200 కోట్ల ఆస్తులతో దివీస్ లేబొరేటరీస్ అధినేత మురళి కె.దివి అగ్రస్థానంలో ఉన్నారు.

  • ఎలక్ట్రానిక్స్‌ షోరూంలో భారీ చోరీ..

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ ఈసీఐఎల్​ చౌరస్తాలోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూంలో జరిగిన చోరీ ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అర్థరాత్రి వేళ వెంటిలేటర్‌ ఊచలు తొలగించి.. సుమారు రూ.70 లక్షలకు పైగా విలువైన సెల్‌ఫోన్లను దుండగులు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన షోరూం కుషాయిగూడ పోలీస్​స్టేషన్​కు 100 అడుగుల దూరంలో ఉండడం గమనార్హం. ఘటన స్థలాన్ని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ పరిశీలించారు. తెలిసిన వాళ్లే ఈ పని చేసారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

  • వేడెక్కిన ఈడీ విచారణ.. ఇక నుంచి దిల్లీ కేంద్రంగా..

దిల్లీ మద్యం ముడుపుల కేసులో ఈడీ విచారణ వేడెక్కుతోంది. తనిఖీల్లో బయటపడిన వివరాల ఆధారంగా.. అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. ఫార్మా సంస్థకు చెందిన ప్రముఖుడితో పాటు.. రెండు సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు చెందిన సంచాలకులు, వెన్నమనేని శ్రీనివాస్‌రావును విచారించారు. సోదాల్లో రాష్ట్రానికి చెందిన ముఖ్యుల వ్యాపార లావాదేవీల వివరాలు బయటపడినట్టు తెలుస్తోంది. స్థానికంగా సోదాలు పూర్తి కావడంతో మిగతా విచారణ దిల్లీ కేంద్రంగా కొనసాగనుంది.

  • బైక్ లిఫ్ట్‌ ఘటన..: అంతా పక్కా ప్రణాళికతోనే..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజక్షన్‌ హత్య కేసును 48 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగా భర్తను చంపేందుకు భార్యనే కుట్ర పన్నిందని నిర్ధారించారు. ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్‌ వేసి హతమార్చినట్లు తెలిపారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు.

  • అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు.. లక్షల ప్రజాధనం వృథా..

పాలమూరును చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దడం కోసం... పురపాలక శాఖ అమలుచేసిన సీసీ కెమెరాల ప్రయోగం నిష్ప్రయోజనంగా మారింది. కూడళ్లలో చెత్తవేసే వారిపై నిఘా పెట్టేందుకు ఏడున్నర లక్షలు ఖర్చుచేసి మూడేళ్లక్రితం సీసీ కెమెరాలు బిగించిన అధికారులు, నిర్వహణను గాలికొదిలేశారు. కెమెరాలు దెబ్బతిని ఎందుకూ పనికి రాకుండాపోయాయి. మహబూబ్ నగర్ పురపాలికలో ఏడున్నర లక్షల ప్రజాధనం వృధాగా మారింది.

  • ఏపీసీసీ డెలిగేట్​గా చిరంజీవి.. కార్డు జారీ చేసిన ఏఐసీసీ

‘నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు’ అని చిరంజీవి సోషల్‌ మీడియాలో మంగళవారం ఓ ఆడియో ఫైల్‌ను పంచుకున్నారు. దానికి ఎలాంటి క్యాప్షన్‌ రాయకపోవడంతో.. అది తాను హీరోగా నటించిన ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలోని డైలాగ్‌ అని కొందరు.. చిరు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారని మరికొందరు అభిప్రాయ పడ్డారు. నెట్టింట ఇదే హాట్‌టాపిక్‌గా నిలిచింది. చిరు పొలిటికల్‌ మాటపై టీవీల్లో డిబేట్‌లు, పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.

  • ప్రపంచ ఆహార భద్రతకు అమెరికా భారీ సాయం.. మళ్లీ చర్చకు వచ్చిన కశ్మీర్ అంశం

ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆహార సంక్షోభాన్ని నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 2.9 బిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించారు. ఐరాస సర్వప్రతినిధి సభలో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు. మరోవైపు, ఐరాస సర్వప్రతినిధి సభలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్దోగన్‌. భారత్‌-పాక్‌ల నడుమ ఇంతవరకూ శాంతి నెలకొనలేదని వ్యాఖ్యానించారు.

  • 'ఈ జానర్ సినిమా​ తెలుగులో ఇదే మొదటిసారి'

Dongalunnaru Jagratha : హాలీవుడ్​లో ఎన్నో సర్వైవల్‌ థ్రిల్లర్​ సినిమాలు చూసుంటాం. బహుశా ఈ జానర్ తెలుగులో ఇదే తొలిసారి అని అంటున్నారు శ్రీ సింహ కోడూరి. 'దొంగలున్నారు జాగ్రత్త'తో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు ఆ జానర్​ను పరిచయం చేస్తున్నామని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.